Tuesday 8 November 2022

కోపరేటివ్ ఫిలిమ్ మేకింగ్ - 1


ఆమధ్య "Iceక్రీమ్" సినిమాతో ఓ కొత్త ట్రెండ్‌కి తెరతీశాడు వర్మ. 

దాని పేరు "కోపరేటివ్ ఫిలిమ్ మేకింగ్".

పాతవాళ్లయినా, కొత్తవాళ్లయినా - ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా ముందు ఇవ్వటం అనేది ఉండదు. సినిమా పూర్తయ్యి, రిలీజయ్యి, లాభాలు వచ్చాకే ఆ లెక్కలు! 

దీనికి ఒప్పుకున్నవాళ్లే సినిమాలో పనిచేస్తారు.

ఈ విషయంలో తప్పనిసరైన కొందరికి మాత్రమే మినహాయింపు ఉంటుంది. కొందరికి మినిమమ్ పేమెంట్ ఉంటుంది. 

ఈ మైక్రో బడ్జెట్ కోటి కావచ్చు, రెండు కోట్లు కావొచ్చు.  సో .. ఉన్న ఆ కొద్ది బడ్జెట్‌ను మేకింగ్‌కు, ప్రమోషన్‌కు మాత్రమే వాడతామన్నమాట!

చాలా మంచి కాన్‌సెప్ట్ ఇది.  ముఖ్యంగా చిన్న బడ్జెట్ సినిమాలకు సంబంధించి మాత్రం ఇదే చాలా చాలా కరెక్టు.

కొత్తవాళ్లతో చేసే సినిమాలకు "టాక్" వచ్చేదాకా మంచి ఓపెనింగ్స్ ఉండవు కాబట్టి, ప్రమోషన్ పరంగా ఎన్నో జిమ్మిక్కులు చేయాల్సి ఉంటుంది. అయినా హిట్టో, ఫట్టో ముందే ఎవరూ చెప్పలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ముందు ప్రొడ్యూసర్‌ను కొంతయినా బ్రతికించుకోవాలంటే ఇదే మంచి పధ్ధతి.

టీమ్ వర్క్.
కంటెంట్.
ప్రమోషన్.

ఈ తరహా సినిమాలు తీయాలంటే ఈ మూడే చాలా ముఖ్యమైనవి.

కట్ చేస్తే - 

దాదాపు ఇదే కాన్సెప్ట్‌తో నేను రెండు సినిమాలు ప్రారంభించాను. అందులో మొదటిది: Yo! 

ఇది నా "కమ్ బ్యాక్" అన్నమాట!  

Yo! బడ్జెట్ రెండు కోట్లు. 

ఈ సిస్టమ్‌లో నాతో కలిసి పనిచేయాలనుకొనే కొత్త ఇన్వెస్టర్లు మీ పూర్తి వివరాలు తెలుపుతూ నాకు వాట్సాప్ చెయ్యొచ్చు: 9989578125. 

1 comment:

  1. >> సినిమా పూర్తయ్యి, రిలీజయ్యి, లాభాలు వచ్చాకే ఆ లెక్కలు!
    అసలుసిసలు లెక్క ఇదే! టీమ్‌ వర్క్ & టీమ్‌ షేర్. ఇదే కరెక్ట్! ఈరోజుల్లో జనానికి కంటెంట్ ముఖ్యం అని మేకర్స్ ఈపాటికే తెలుసుకొని ఉండాలి - తెలియని వారికి దెబ్బలు తప్పవు (జనం చేతుల్లోనే లెండి). డ్రిల్లు క్లాసుల్లాంటి డాన్స్‌ పాటల సీన్లూ, హీరో ఇంకా కొట్టీకొట్టకుండానే గాల్లోకి అలాఅలా ఎగిరిపోయే బెలూన్లలాంటి బాడీలున్న గాంగ్‌స్టర్లతో ఫైట్లూ, వీటిని కూరికూరి తీస్తున్న ఫార్ములాసినిమాలూ ఇంక కాలంచెల్లిన సరుకులు. కాంటెంట్ అండీ - అదే జనం కోరేదీ. అందులో మీ ప్రత్యేకత చూపండీ - విజయం జేబులో వేసుకోండి. వెరీ సింపుల్! వెరీ సింపుల్!! మీరు సరైన ఆలోచన చేసారు. శుభాకాంక్షలు!!

    ReplyDelete