నటి, డాన్సర్, ఇంటర్నేషనల్ మాడల్, నా ఫ్రెండ్. ఇప్పుడు రష్యాతో జరుగుతున్న యూక్రేనియన్ వార్‌లో (Russia-Ukrainian war) సోల్జర్‌గా పనిచేస్తోంది!
కాత్యా ఇప్పుడు జీవిస్తోందీ, యుద్ధం చేస్తోందీ యూక్రేన్‌లోని ఆమె స్వస్థలం కార్ఖీవ్‌లో. కొన్ని నెలల క్రితం ఇదే కార్ఖీవ్ నగరాన్ని రష్యా 70% నేల మట్టం చేసి, బూడిద మిగిల్చింది.
రిటార్ట్ అంటే ఇలా ఉంటుంది!
నాకేది చాతనవుతలేదు. ఒక్క పని అవుతలేదు. అయినంక చెప్తా. కొత్తగా అలోచిస్తున్నా... ఇలా అనుకుంటుంటే యుగాలు గడిచిపోతాయి.
నేను ఎందుకు చేయలేను, అందర్లా నేనూ మనిషినే కదా అనుకుంటే అన్నీ అవే కదుల్తాయి. ఎదురుదాడి కూడా చేయొచ్చు.
యుద్ధానికి ముందు ఒకవైపు దేశాలు తిరుగుతూ ఇంటర్నేషనల్ మాడలింగ్ చేస్తూ, మరోవైపు కుటుంబాన్ని పోషిస్తూ చదువుకొంది కాత్యా.
సంవత్సరకాలంగా యుద్ధంలో పాల్గొంటూ దేశం కోసం పనిచేస్తుండటం, ఒకవైపు యుద్ధం జరుగుతుండగానే సుమారు 1200 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తూ తన కుటుంబాన్ని దేశ సరిహద్దులు దాటించి సురక్షితంగా చేరవేయటం, యుద్ధం జరుగుతుండగానే ఒక కోర్స్ కూడా పూర్తిచేయడం... ఇవన్నీ కూడా కాత్యా చేసింది.
కాత్యా సమాధానం: "ఇది యుద్ధం. అంత సులభంగా చెప్పలేం. అంత త్వరగా ముగియదు."
కాత్యాలో ఉన్న సిసలైన పోరాట పటిమలో కనీసం ఒక్కశాతమైనా నాలో ఉందా అని నన్ను నేను ప్రశ్నించుకుంటే నా దగ్గర సమాధానం లేదు.
అసలు మామూలు జీవితాన్ని యుద్ధం చేసిన వాళ్ళని ఏం చెయ్యాలి?
ReplyDelete