Tuesday 11 October 2022

పుస్తకానికి శతదినోత్సవం!


నా పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" ఆవిష్కరణ జరిగి ఇవాళ్టికి సరిగ్గా 99 రోజులు. 

రేపు వందవ రోజు.

డైనమిక్ మంత్రి, టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు జులై 5 వ తేదీనాడు ఈ పుస్తకాన్ని ప్రగతిభవన్‌లో లాంచ్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు... ఆదివారంతో కలిపి, ప్రతిరోజూ, నిరంతరం సేల్స్‌లోనే ఉందీ పుస్తకం.

థాంక్స్ టు:

> నవోదయ బుక్ హౌజ్, కాచిగూడ 
> పాలపిట్ట బుక్స్, సుందరయ్య పార్క్, బాగ్‌లింగంపల్లి 
> స్వర్ణసుధ పబ్లికేషన్స్, రామ్స్ ఎంక్లేవ్, ఎర్రగడ్డ

ఈ నాలుగు పాయింట్స్ నుంచి ఈ పుస్తకం సేల్స్ ఇంకా కొనసాగుతున్నాయి.   

మా బుక్ సెల్లర్స్‌కు ఇప్పటివరకు వచ్చిన బల్క్ ఆర్డర్స్‌లో కొన్ని - లండన్‌లో ఉన్న భువనగిరి నవీన్ నుంచి రావడం విశేషం. నవీన్ లండన్ నుంచి బల్క్‌గా బుక్స్ ఆర్డర్ చేసి, ఇక్కడ లోకల్‌గా రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది కేసీఆర్ ఫ్యాన్స్, తెలంగాణ ప్రేమికులకు బుక్‌ని గిఫ్ట్‌గా పంపించడం అన్నది నిజంగా గొప్ప విషయం.    

మా పబ్లిషర్స్ ఈ పుస్తకాన్ని ఇంకా అమెజాన్‌లో గాని, ఫ్లిప్‌కార్ట్‌లో గాని పెట్టలేదు. పెట్టుంటే, ఈ బుక్ సేల్స్ కనీసం ఇంకో నాలుగు రెట్లు జరిగుండేది. 

వచ్చే "హైద్రాబాద్ బుక్ ఫేర్" పూర్తయ్యేటప్పటికి పదివేల కాపీల అమ్మకాలు అత్యంత కూల్‌గా జరుపగలమన్నది మా పబ్లిషర్స్ నమ్మకం. 

కట్ చేస్తే - 

"కేసీఆర్ -ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" పుస్తకం కొనుక్కొన్న ప్రతి ఒక్కరూ, ఒక వారం రోజుల్లోనే మళ్ళీ ఇంకో రెండు కాపీలు (కనీసం!) కొనుక్కెళ్ళి - వాటిని తమ ఫ్రెండ్స్‌కో, తెలిసినవారికో గిఫ్ట్‌గా ఇస్తుండటం నేను గమనించిన ఇంకో గొప్ప విషయం.  

ప్రఖ్యాత సౌండ్ ఇల్యూజనిస్టు మిమిక్రీ శ్రీనివాస్ గారు ఈ పుస్తకం చదివాక తన అద్భుతమైన రివ్యూను ఒక వీడియో బైట్ రూపంలో పంపించడం మరొక మంచి అనుభూతి. వీరితోపాటు ఇంకా చాలామంది తమ రివ్యూలను వీడియో బైట్ రూపంలో పంపించారు.   

"రఘుపతి వెంకయ్య నాయుడు" చిత్ర దర్శకులు, అభ్యుదయ రచయిత, నా మిత్రుడు బాబ్జీ గారు ఈ పుస్తకం చదివాక రాసిన రివ్యూ నన్ను బాగా ఆలోచింపజేసింది. బాగా ఇన్‌స్పయిర్ చేసింది. దాన్ని ఉన్నదున్నట్టుగా - ఈ మధ్యే నా ఫేస్‌బుక్ వాల్ మీద పోస్ట్ చేశాను. ఒక జ్ఞాపకంగా భద్రపర్చుకోవడం కోసం, ఒక గెస్ట్ పోస్టుగా - రేపు నా బ్లాగ్‌లో కూడా పోస్ట్ చేస్తున్నాను.              

పుస్తకం ఆవిష్కరణ జరిగిన 'డే వన్' నుంచి, దాదాపు పుస్తకం చదివిన ప్రతి ఒక్కరూ... పుస్తకం గురించి వారి అభిప్రాయాన్ని - అయితే ఒక ఫేస్‌బుక్ పోస్టుగా పెడుతున్నారు. లేదంటే డైరెక్ట్‌గా నాకు పంపిస్తున్నారు. 

వీరిలో - వీయస్పీ తెన్నేటి వంటి ప్రముఖ రచయితలు, స్పిరిచువల్ మెంటర్స్ కూడా ఉండటం నాకు మరింత ఆనందాన్నిచ్చింది.

ఇక, #PhotoWithKCRBook విషయం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రియమైన పాఠక మిత్రుల నుంచి ఇప్పటికే వందలాది అద్భుతమైన ఫోటోలు అందుకున్నాను. ఇంకా అందుకుంటున్నాను. వీలైనన్ని నా టైమ్‌లైన్ మీద పోస్ట్ చేస్తున్నాను. 

అయితే - నేను అనుకున్న కొంతమంది ప్రముఖులకు, కొందరు నా శ్రేయోభిలాషులకు ఒక బాధ్యతగా నేనే వ్యక్తిగతంగా వెళ్ళి కలిసి నా పుస్తకం అందించాలనుకున్నాను. ఉద్యోగ బాధ్యతలు, ఇతర దైనందిన జీవితపు వొత్తిళ్ళ కారణంగా సమయం కుదరలేదు. వచ్చే వారం పదిరోజుల్లో ఆ పని కూడా పూర్తిచేయడానికి ప్లాన్ చేసుకున్నాను.    

కట్ చేస్తే - 

జాతీయ పార్టీ "బీఆరెస్"తో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో సంచలనాలకు తెరలేపుతున్న ఈ సందర్భంలో - కేసీఆర్ అభిమానులకు, బీఆరెస్ లోని వివిధస్థాయిల్లోని నాయకులకు, కార్యకర్తలకు నా పుస్తకం ఒక మంచి ఇన్‌స్పైరింగ్ టూల్‌గా ఉపయోగపడుతోందని చాలామంది చెబుతున్నారు. 

అలా ఉపయోగపడాలన్నదే నా కోరిక అని పుస్తకం ప్రోలోగ్‌లోనే స్పష్టంగా రాశాను.

రేపు - "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" పుస్తకం ఆవిష్కరణ శతదినోత్సవం సందర్భంగా... స్వర్ణసుధ పబ్లికేషన్స్ అధినేత బైరి పరమేశ్వర్ రెడ్డి గారు పాఠకులకు ఒక స్పెషల్ ఆఫర్ ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. అదేంటన్నది రేపు తెలుస్తుంది.  

ఎందరో మహానుభావులు... అందరికీ వందనాలు.  

2 comments:

  1. మిత్రులు మనోహర్ గారు,
    మరలా ఒక మంచి బ్లాక్ బస్టర్ సేల్స్ ఉన్న పుస్తకం వ్రాసి లైమ్‌లైట్‌లో వెలుగుతున్నందుకు అనేకానేక శుభాభినందనలు. లోగడ మీరు సినిమారంగానికి సంబంధించి (స్క్రిఫ్ట్ వర్క్ మీద అని గుర్తు) ఒక లాండ్‌మార్క్ పుస్తకం వ్రాసి మీటాలెంట్ ఋజువుచేసుకున్నారు. ఇది దానిని మించి విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. ఇంకా ఇంకా మీరు వివిధరంగాలకు సంబంధించి మంచిమంచి విజయవంతమైన పుస్తకాలు వెలువరిస్తారని నాకు చాలా నమ్మకంగా ఉంది. (కేసీఆర్ గారు నాకు పెద్దగా నచ్చరు, అది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. అంతమాత్రాన మీరు కేసీఆర్ గారి గురించి ఒక అద్భుతమైన పుస్తకం వ్రాస్తే ఆనందించకుండా ఉండలేను. ఇది మీపట్ల నాకున్న సదభిప్రాయానికి చిహ్నం. ఇది వేరే సంగతి.) తెలుగుపుస్తకప్రపంచంలో మీరు ఒక మంచిస్థానాన్ని సంపాదిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. విజయోస్తు!

    ReplyDelete