Thursday 8 September 2022

సొమ్మొకడిది సోకొకడిది!


"టాలీవుడ్ హబ్" అట! సినీ ప్రముఖులందరితో కలిపి "మహత్తరమైన సభ" అట, దానికి "ప్రధాని నరేంద్రమోది"ని ఆహ్వానించటం జరుగుతుందని... మొన్ననే రాజ్యసభ సభ్యత్వం తీసుకొన్న రచయిత విజయేంద్రప్రసాద్ గారి ఉవాచ...  

దేశానికి ప్రధాని అయిన మోదీని పిలిస్తే తప్పేం లేదు. ఆ కుర్చీకి మనం తప్పక రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. (మనకు కుర్చీ ఇచ్చినందుకు కూడా అనుకోండి. తప్పదు. We understand.) 

కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా ఆహ్వానిస్తాం అని మాటవరుసకైనా అనటం కనీస మర్యాద, బాధ్యత. 
    
ప్రతిదానికీ కలిసి, వంగి వంగి దండాలు పెట్టి, తాయిలాలు తీసుకొనేది కేసీఆర్ దగ్గర! టాలీవుడ్ హబ్బూ గిబ్బూ ఐడియాలకు మాత్రం మోదీ కావాలి!! 

సో... లోపల్లోపల బాగానే జరుగుతోంది రాజకీయం!

కట్ చేస్తే - 

కోరింది ఇస్తూ, కోరినదానికంటే ఇంకా ఎక్కువే ఇస్తూ... మనస్పూర్తిగా మన కేసీఆర్ వీళ్ళను ఎంత బాగా చూసుకుంటే మాత్రం ఏం లాభం? 

"మేం వేరే" అని ఎప్పటికప్పుడు కొందరు ప్రూవ్ చేసుకుంటూనే ఉంటారు. 

తెలుగు వేరే, తెలంగాణ వేరే అని ఇలా ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూనే ఉంటారు. 

ఇలాంటివారివల్ల ఇండస్ట్రీలోని మాగ్జిమమ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కు ఎలాంటి లాభం ఉండదు. జీరో. ఉంటే గింటే నష్టమే ఉంటుంది. 

అయినాసరే, నా నమ్మకం ఏంటంటే... కేసీఆర్, కేటీఆర్, తెలంగాణలను అంత ఈజీగా వదులుకోలేని వర్గం ఒకటి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉంది. ఉంటుంది.

అదే చాలా శక్తివంతమైన వర్గం కూడా.  

ఫక్తు రాజకీయాలే అనుకున్నప్పుడు ఆ వర్గం బాహాటంగానే బయటకొస్తుంది. అది వేరే విషయం.  

అయితే... దేన్నీ అంత ఈజీగా తీసుకోవద్దు అన్న విషయం... గమనించాల్సిన పెద్దలు గమనిస్తున్నారనే అనుకుంటున్నాను. 

After all... క్రియేటివిటీ వేరు, రాజకీయాలు వేరు!

3 comments:

  1. ప్రధాని మోదీ గారిని ఆహ్వానిస్తాం అని చెప్పటం జాతీయ స్థాయిలో వ్యవహారం అని స్పష్టం చేయటానికే కావచ్చునండీ. కేసీఆర్ గారిని ఆహ్వానించమని అనటం లేదుగా. బహుశః రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రి వర్యులనూ ఆహ్వానిస్తారని అనుకోవచ్చు. వేచి చూదాం.

    ReplyDelete
    Replies
    1. నమస్తే.

      మీరనుకున్నట్టు జరగదండీ శ్యామలీయం గారూ! మీరు చెప్పిన ఇద్దరు వస్తారంటే ఆయన రారు.

      ఇది మామూలు సినిమా సభ వ్యవహారం కాదు. రాబోయే ఎన్నికలను దృష్టిలోపెట్టుకొని చేసే పని. దీని వెనుక చాలా కథ వుంటుందండి. ఆ సభంటూ జరిగితే మీరే చూస్తారుగా!

      Delete
  2. ఈరోజున కేసీఆర్ గారు ప్రధానమంత్రి ఐతే అని శ్యామలీయంలో ఒక టపా వ్రాసారు. అది ఊరికే‌ తమాషాకు వ్రాసినది. మీరు కాని మరొకరు కాని సీరియస్‌గా తీసుకోనవసరం లేదు.

    ReplyDelete