Monday 26 September 2022

జీవితమ్ ఆధ్యాత్మికమ్!


Everything is spiritual in this world!
- Joe Vitale


జీవితంలో అనుకోకుండా కొన్ని ఊహించని మలుపులు వస్తాయి... 

మూడు మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్ని - ఒకదాని తర్వాత ఒకటి - దాదాపు ఓ పద్నాలుగేళ్ళపాటు చేసిన తర్వాత, నా చివరి ఉద్యోగం ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నప్పుడు రిజైన్ చేశాను.

అలా అసలు ఉద్యోగం అంటేనే పడనివాణ్ణి, ఫ్రీలాన్సర్‌గా, ఫ్రీ బర్డ్‌గా బ్రతకటమే ఇష్టపడినవాణ్ణి... దాదాపు ఒక 22 సంవత్సరాల తర్వాత, నా జీవితంలోనే ఎప్పుడూ ఊహించనివిధంగా, కొన్ని నెలల క్రితం మళ్ళీ నేను కొత్తగా ఒక ఉద్యోగంలోకి చేరిపోయాను. 

తర్వాత కొన్ని రోజులకి అది ఉద్యోగం కాదు, బాధ్యత అని టెక్నికల్‌గా నాకు తెలిసింది. 

చిన్నప్పట్నుంచీ ఇంట్లో గాని, విద్యార్థిగా ఉన్నప్పుడు గాని, పెళ్లయ్యాక గాని, నా పిల్లల విషయంలో గాని, నా ఉద్యోగాల్లో కాని నేనెప్పుడూ పనికి భయపడలేదు. పని తప్పించుకోవాలనుకోలేదు. పని చేస్తూ ఉండటమే నాకిష్టం. 

ఇక్కడ పని కూడా క్రియేటివిటీకి సంబంధించిందే కాబట్టి ఎంతైనా సరే బాగా కష్టపడాలనుకున్నాను. నా పనికి సంబంధించిన ఎలాంటి చాలెంజ్‌నయినా స్వీకరించాలనుకున్నాను.    

అంత గట్టి కమిట్‌మెంట్‌తో ఈ ఉద్యోగంలోకి ఎంటరయ్యాను. జీతం విషయంలో కూడా అంతే గట్టిగా ఒకటికి నాలుగుసార్లు కన్‌ఫర్మేషన్ తీసుకొన్నాను. 

కాని... అన్నీ అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది? 

తప్పెవరిదీ లేదు. కాని... ఈ ఉద్యోగం మీద ఆధారపడి నేను వేసుకున్న ప్లాన్స్ అన్నీ అలా అలా ఆవిరైపోయాయి. చూస్తుండగానే నాలుగున్నర నెలలు గడిచిపోయాయి.  

దాదాపు 5 నెలలన్నమాట!

ఇప్పుడు నాకున్న పరిమిత సమయంలో 5 నెలలు నేను వృధా చేసుకున్నానంటే అది అత్యంత బాధాకరం.      

అదలా వుంచితే, రెండు దశాబ్దాల గ్యాప్ తర్వాత - ప్రధానంగా దేని గురించయితే నేను కొత్తగా మళ్ళీ ఉద్యోగంలో చేరానో అది అసలు జరగలేదు.     

ఎంతైనా సరే కష్టపడదాం అనుకున్నవాణ్ణి... అసలు నా పనే ప్రారంభం కాలేదు. ఆఫీసులో ఎప్పుడైనా ఏదైనా చిన్న పని చేస్తున్నానంటే, అది జస్ట్ క్లరికల్ పని లేదా అంతకంటే క్రింది సబ్ స్టాఫ్ చేసే పని. 

డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి తెలిసినవాణ్ణి కాబట్టి దానిగురించి నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. పెద్దగా పట్టించుకోను. 

ఇంక క్రియేటివిటీకి సంబంధించి నేను నా చాంబర్లో కూర్చొని ఒక తపస్సులా ఒంటరిగా చేసే శ్రమ బయటికి కనిపించని శ్రమ.

బయటివాళ్ళకి నేను ఖాళీగా కూర్చొని ఏదో చదువుకుంటున్నట్టు, రాసుకుంటున్నట్టు, నాలుగు సోషల్ మీడియా పోస్టులు పెట్టుకుంటున్నట్టు, చాటింగ్ చేసినట్టుగానే ఉంటుంది. ఇదింకో మానసిక వ్యధ.   

ఏది ఎలా ఉన్నా, నేను ఏ రెండు ప్రయోజనాలు ఆశించి ఇన్నేళ్ళ తర్వాత ఈ ఉద్యోగంలో చేరానో, ఆ రెండింటి విషయంలో కూడా కనుచూపుమేరలో నాకు ఎలాంటి క్లారిటీ లేదు. 

ఇలాంటి నేపథ్యంలో ప్యానిక్ అయ్యి అనవసరంగా టెన్షన్ పడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. 

ఒకటి మాత్రం గట్టిగా అనుకొన్నాను... ఎంత పనయినా చేస్తాను, ఎంత కష్టమైనా పడతాను...

కాని, 
నేను ఎవరికీ భారం కావద్దు,
కొత్తగా నామీద ఏ భారాలు పడవద్దు. 

ఈ నేపథ్యంలో ఒక గట్టి నిర్ణయం తీసుకొన్నాను. ఈ ప్లాట్‌ఫామ్ బేస్‌గా - అంతకుముందు ఎన్నెన్నో పనులు చేయాలనుకొన్నవాటినన్నిటినీ ఇప్పుడు దాదాపు పూర్తిగా మినిమైజ్ చేసేసుకున్నాను. 

Ultimate Minimalism... 

ఒక నిర్దిష్టమైన తేదీ తర్వాత - అన్ని పనులకూ గుడ్-బై  చెప్పెయ్యాలని గట్టిగా అనుకున్నాను. ఇలా అనుకున్నదానికి వంద శాతం కట్టుబడి ఉంటాను. 

ఇందులో మార్పు ఉండదు.   

అప్పటిదాకా - ప్రతి అంశాన్నీ పాజిటివ్‌గా స్వీకరిస్తూ, తుఫానులో కూడా స్మూత్ సెయిల్ చెయ్యడానికే ఎంతయినా కష్టపడతాను. 

కట్ చేస్తే -    

మారిన ఫిలిం కంటెంట్ ట్రెండ్స్, బిజినెస్ ట్రెండ్స్‌ను దృష్టిలో పెట్టుకొని - అతి తక్కువ సమయంలో ఒక 3 ఫీచర్ ఫిల్మ్స్ చెయ్యడానికి ప్లాన్ చేశాను. 

వాటిలో ఒకటి ఈ విజయదశమికి ఎనౌన్స్ చేస్తున్నాను. 

భారీ స్టార్లు, భారీ బడ్జెట్స్ కావు కాబట్టి ఎలాంటి ఇబ్బందులుండవు. నాకు పెద్ద సమస్య కాదు. 

ముఖ్యంగా నేను మళ్ళీ ఫ్రీ బర్డ్ కావడమే ఇప్పుడు నాముందున్న పెద్ద సమస్య.  

స్టీరింగ్ నా చేతుల్లోకే తీసుకుంటున్నాను కాబట్టి ఏ సమస్యా ఉండదు. అన్ని బాధ్యతలూ నా ఒక్కడి భుజాలమీదే ఉంటాయి. 

దేనికైనా నాకు నేనే సమాధానంగా ఉండాలి. 

అదే నాకిష్టం.

సో... ఇలాంటి ఇన్ఎక్స్‌ప్లికబుల్ స్ట్రెస్‌లో కూడా... ఇప్పుడు ఇప్పుడు నేను ఒక ఖచ్చితమైన టైమ్ బౌండ్ టార్గెట్స్‌తో ముందుకెళ్తున్నాను. 

ఈ నేపథ్యంలో - తాత్కాలికంగా కొన్నాళ్లపాటు నాకెంతో ప్రియమైన నా బ్లాగింగ్ హాబీకి విరామం ఇవ్వక తప్పటం లేదు. 

మళ్ళీ తప్పక కలుద్దాం. అందాకా శెలవ్. 

ఎందరో మహానుభావులు... అందరికీ వందనాలు.

8 comments:

  1. edo real estate company lo director gaa join ayinattunnaru, adi manestunnara?

    ReplyDelete
    Replies
    1. లేదు, ఇంకా అందులోనే పనిచేస్తున్నాను.

      Delete
  2. when is your next movie? eagerly waiting

    ReplyDelete
  3. Expect the unexpected to happen అన్నారు ఎవరో. జీవితం అంతే నండి. మీపోరాటతత్త్వం నచ్చింది. విజయదశమి నుండి మీకు విజయపరంపర ప్రారంభం అవుతుంది తప్పకుండా. నాకా నమ్మకం ఉంది.

    ReplyDelete