Sunday 25 September 2022

"ఫిమేల్" అన్న పదం ఉంటేనే తప్పా?


"ఫిమేల్ స్క్రిప్ట్ రైటర్" కోసం ఒక క్రియేటివ్ గ్రూప్‌లో ఎవరో పోస్టు పెట్టారు. 

అంతే... 

ఆ పోస్టుని విమర్శిస్తూ టపటపా పోస్టులు పడిపోయాయి!

అసలు "ఫిమేల్" రైటర్స్ ఏంటి?... 
ఎవరైనా ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా అడిగారా?... 
రైటర్ రైటరే... 
మేల్ అయితే ఏంటి, ఫిమేల్ అయితే ఏంటి?... 
మేల్ రైటర్స్ పనికిరారా... 

అలా పోస్ట్ పెట్టడం ఏదో పెద్ద నేరం అయినట్టు... ఇలా రకరకాల కోణాల్లో దండయాత్ర! 

ఈ ట్రోల్ అంతా చదివితే మాత్రం... ఆ పోస్ట్ పెట్టినతను ఎలాంటి అనుమానం లేకుండా మెంటల్ అయిపోవడం పక్కా.  

కట్ చేస్తే - 

లత సాహిత్యం చదివినవారికి ఆ రచయిత్రి రాసే  'ప్రేమలో ఇంటెన్సిటీ' గుర్తుండే వుంటుంది. రంగనాయకమ్మ, ఓల్గా, కుప్పిలి పద్మ రాసినట్టు మేల్ రచయితలు రాయగలరా? 'ఏ మాయ చేసావె' సినిమాలో ఉమర్జీ అనురాధ రాసినట్టు డైలాగ్స్ ఇంకో మగ రచయిత రాయగలడా? 

అర్థం లేని ట్రోలింగ్ కాకపోతే "ఫిమేల్ రైటర్ కావాలి" అని ఒక క్రియేటివ్ గ్రూప్‌లో పోస్టు పెట్టుకొనే స్వతంత్రం మరో క్రియేటివ్ జీవికి లేకపోవడం బాధాకరం. 

"Female ADs" కోసం నిన్న రాత్రే నేనొక యాడ్ పెట్టాను. మా డైరెక్షన్ టీమ్‌లో ఆల్రెడీ కావల్సినంతమంది బాయ్స్ ఉన్నారు. కొన్ని అంశాల్ని అమ్మాయిలే ఇంకాస్త బాగా హాండిల్ చేస్తారన్న ఉద్దేశ్యంతో ఇప్పుడొక ఇద్దరు ఫిమేల్ అసిస్టెంట్ డైరెక్టర్స్‌ను తీసుకొంటున్నాను. 

అసలిప్పుడు దాదాపు ప్రతి డైరెక్టర్ టీమ్‌లో 50% మంది ఫిమేల్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటుండం ఈ మధ్య వచ్చిన అద్భుత పరిణామం. అది వేరే విషయం.   

మా మ్యూజిక్ డైరెక్టర్ కొత్త ఫిమేల్ వాయిస్ కోసం చూస్తున్నాడు. ఈ రిక్వయిర్‌మెంట్ గురించి ఆల్రెడీ మ్యూజిక్ అరేంజర్స్‌కు, కోఆర్డినేటర్స్‌కు చెప్పాడు. ఒక యాడ్ కూడా ఇచ్చాడు. 

సో... మేం కూడా అలా "ఫిమేల్... సో అండ్ సో కావలెను" అని యాడ్ ఇవ్వకూడదా? 

"ఫిమేల్" అన్న పదం ఉంటేనే తప్పా? 

భయమా,  అపనమ్మకమా? 

అసలు ఏ కాలంలో ఉన్నాం మనం? 

ఏ స్థాయిలో ఆలోచిస్తున్నాం?    

ఎలాంటి వుమెన్ రైటర్స్, ఎలాంటి వుమెన్ టెక్నీషియన్స్ ఇంతకుముందు వచ్చారు... ఇప్పుడొస్తున్నారు? 

కనీసం ఐడియా ఉందా?   

సారీ... అపర్ణా సేన్, దీపా మెహతా, భాను అతియ, అలంకృత శ్రీవాస్తవ, తనూజ చంద్ర, నందితా దాస్, లీనా యాదవ్, షోనాలి బోస్, రీమా కగ్తి, ఆశ్విని అయ్యర్ త్రివేది, జూహి చతుర్వేది, మేఘనా గుల్జార్, జోయా అఖ్తర్, గురిందర్ చద్దా, కొంకనా సేన్ శర్మ, సుధా కొంగర, నందిని రెడ్డి...  

We still have such pseudo creative people who cannot just think out of the bloody box. 

2 comments:

  1. మీఆవేదన అర్ధం అయింది. చాలా సబబుగా వ్రాసారు. పరిస్థితులు పరిణతంగా ఉంటే ప్రత్యేకంగా అడుగ నవసరం లేకుండానే సహజంగానే మనకు రచయితలూ రచయిత్రులూ సమసంఖ్యలో అందుబాటులో ఉండేవారు. అంతవరకూ సందర్భాన్ని బట్టి నేరుగా అడుగవలసి రావచ్చును. అంతమాత్రాన పెడర్ధాలు తీయటమూ అతిగా స్ఫందించటమూ నిజంగానే సరికాదు. ఈమధ్యన సరిగా సంయమనంతో ఆలోచించకుండానే వ్యాఖ్యలు వ్రాయటం హెచ్చుగా ఉందనిపిస్తోంది.

    ReplyDelete