Saturday 17 September 2022

విమర్శ వేరు, విద్వేషం వేరు!


"కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు" అని శ్రీశ్రీ గారు ఎంతమంది కుర్రాళ్లనో చూసింతర్వాతనే కదా రాసుంటారు? 

అలాంటి కుర్రాళ్లను నేను కూడా అప్పుడప్పుడు చూస్తున్నాను. జాలిపడుతున్నాను. 

కట్ చేస్తే - 

రాజకీయాల్లో అభిమానం, దృక్పథాలు వేరుగా ఉండటం సర్వసహజం. 

విమర్శలు కూడా బాహాటంగా చేయవచ్చు. తప్పేం లేదు. అయితే, విమర్శ అనేది నిర్మాణాత్మకంగా ఉండాలి. 

వ్యక్తిగత విద్వేషం విమర్శ కాదు. 

సబ్జెక్ట్ లేనప్పుడే అలాంటి విమర్శలు చాలా అవేశంతో చేస్తారు. అనుకోకుండా కుండి సంజయ్ అవతారమెత్తుతారు.  

ఇవ్వాళ నేను పెట్టిన ఒక పోస్టు చదివి, గుంటూరు నవోదయలో నేను పనిచేసినప్పటి నా విద్యార్థి ఒకరు చాలా ఆవేశంతో ఏదేదో కామెంట్ పెట్టాడు, అసలు సబ్జెక్టు తప్ప. 

హిందూ మతం గురించి నాకేం తెలీదట. కేసీఆర్ మత్తులో ఉన్నానట. ఇక కేసీఆర్ మీదనయితే కావల్సినంత విద్వేషం చిమ్మాడు. 

అదే ఇంకొకరెవరో అయితే వాడు రాసిన ప్రతిపదానికీ ఫిట్టింగ్ ఆన్సర్ ఇచ్చేవాణ్ణి. 

కాని, ఇక్కడ వీడు నా విద్యార్థి.     

నేను మావాడి కంటే పదిరెట్లు ఆవేశంగా, నిర్మాణాత్మకంగా, లాజికల్‌గా సమాధానమివ్వగలను. 

కాని, నేనిచ్చే ఆ సమాధానం చూసి, కేసీఆర్ అభిమానులు అతన్ని తుక్కుతుక్కుగా ఆడుకుంటారు. అది నాకిష్టం లేదు. అందుకే నేనా పని చేయలేదు. సింపుల్‌గా వాడి కామెంట్స్ డిలీట్ చేశాను. ఈ విషయంలో మరింత కొనసాగింపు వాడితో ఇష్టం లేక బ్లాక్ చేశాను. 

ఎందుకంటే... నాకు వాడిలో సుమారు పాతికేళ్ల క్రితం నాటి నా 12 ఏళ్ళ విద్యార్థే కనిపిస్తున్నాడు! 

నాతో ఇంకేదన్నా వాదించాలనుకుంటే హాయిగా వాడు నాకు కాల్ చేస్తాడు. కలుస్తాడు. 

మా అనుబంధం నవోదయమ్! :-) 

కట్ చేస్తే - 

నా విద్యార్థి హైద్రాబాద్‌లోనే చాలాకాలంగా మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ హాప్పీగా ఉన్నాడు. సైడ్‌కు చిన్నస్థాయిలో రియల్ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తున్నాడు. మంచి పెయింటింగ్స్ వేసే ఆర్టిస్టు కూడా. హైద్రాబాద్‌లోనే రెండు మూడు ఆర్ట్ ఎగ్జిబిషన్స్ కూడా పెట్టాడు.  

కడుపులోంచి అంత విద్వేషం కక్కడానికి మరి కేసీఆర్ మావాడికి ఎప్పుడు ఏ అన్యాయం చేశారో నాకైతే తెలీదు.  

2 comments:

  1. విమర్శను స్వీకరించలేని వాళ్ళు విద్వేషం ప్రదర్శిస్తారు. ఆ విద్వేషం వలన క్రోధం, దాని వల్ల అవివేకం కలిగి, చివరికి బుద్ధి నశిస్తుంది.
    అందుకే "ద్వేషించడం ఆరోగ్యానికి హానికరం" అంటాను.
    https://bonagiri.wordpress.com/2019/01/01/%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b5%e0%b1%87%e0%b0%b7%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%a1%e0%b0%82-%e0%b0%85%e0%b0%b0%e0%b1%8b%e0%b0%97%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%b9/

    ReplyDelete
    Replies
    1. మీ పోస్ట్ చాలా బాగుంది. సందర్భసహితం, ఎవర్ గ్రీన్ కూడా!

      థాంక్యూ.

      Delete