Wednesday 14 September 2022

మనం తీసే సినిమాలు థియేటర్‌కా, ఓటీటీకా?


నిత్యా మీనన్ న్యూస్ ఐటమ్ ఒకటి చదివాను ఇందాకే.

ఒక నెల క్రితం ఇంటర్వ్యూ అనుకుంటాను, అందులో ఆమె చెప్పింది నాకు బాగా నచ్చింది. 

మన రొటీన్ థియరీలు, ప్రాక్టికాలిటీలు, పనికిరాని ఈగోలు పక్కనపెట్టి ఆలోచిస్తే మాత్రం నిత్యా మీనన్ అభిప్రాయం కరెక్టే అనిపిస్తుంది. 

అసలు విషయమేంటంటే - 

మనం సినిమాలు తీసేటప్పుడే "ఇది థియేటర్ కోసం తీస్తున్నాం, ఇది ఓటీటీ కోసం తీస్తున్నాం" అని ఒక కేటగరైజేషన్ చేసుకొని తీయటం సరైన ఆలోచన కాదు. 

అసలు సినిమా అంటూ తీస్తే - తప్పకుండా దాని ప్రధాన లక్ష్యం థియేటర్‌లో ప్రదర్శించడమే కావాలి. 

ఆ సినిమాలోని కంటెంట్, దాని బిజినెస్ పొటెన్షియాలిటీని బట్టి, తర్వాత అది థియేటర్‌కు వెళ్ళగలుగుతుందా, ఓటీటీ దగ్గరే సెటిలవుతుందా, అసలు మార్కెట్లో ఎవరైనా దాన్ని పట్టించుకుంటారా లేదా అన్నది తర్వాత విషయం.  

నిజమే కదా?

సో... ముందైతే, సినిమా అంటూ తీస్తే... అది థియేటర్ రిలీజ్ కోసమే తీయాలి. ఓటీటీలు, శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, రీమేక్ రైట్స్ ఎట్సెట్రా అన్నీ తర్వాతెలాగూ ఫాలో అవుతాయి. 

అది చిన్న సినిమా అయినా, భారీ బడ్జెట్ ప్యానిండియా సినిమా అయినా ఇక్కడ మర్చిపోకూడని పాయింట్ ఒక్కటే... 

Cinema is a battle ground! 

6 comments:

  1. Cenema is a battle ground అన్నది అంత సబబుగా.లేదండీ. నిజానికి cenema is a fighter on the battle ground అనటం బాగుంటుంది అనుకుంటాను.

    ReplyDelete
    Replies
    1. 1960 లలో ఫ్రెంచ్ న్యూ వేవ్ సినిమాల మార్గదర్శి అయిన ఒక గొప్ప డైరెక్టర్ చెప్పిన మాట ఇది. మీకు సబబుగా లేకపోవడం నాకు అంత సబబుగా అనిపించడం లేదండీ.

      కట్ చేస్తే -

      మీరు చెప్పిన లైన్లో అసలు వాక్య నిర్మాణంలోనే తప్పుందేమోనని నాకనిపిస్తోంది. లేదా, నాకు ఇంగ్లిష్ గ్రామర్ రాకపోయుండాలి. మన్నించాలి.

      Delete
    2. ఈసంవాదం భలేగా ఉందండీ. నేను చెప్పిన వాక్యంలో ఏవిధమైన నిర్మాణ దోషమూ లేదండీ. సినీరంగం ఒక యుధ్ధభూమి అనీ ప్రతిసినిమా ఆయుధ్ధభూమిలో విజయంకోసం పోరాడుతున్న వీరుడి వంటి దనీ చెప్పటమే ఆవాక్యం పరమార్థం. మీకు నాభావన సబబుగా అనిపించకపోతే పోనీయండి దానికేం. ఒక సినిమా నిర్మాణం ఒక యుధ్ధరంగం అనుకోవటంలో ఔచిత్యం ఉంది కాని సినిమా అనేదే యుధ్ధమూ అనటంలో కించిత్ ఔచిత్యభంగం ఉందని నా ఉద్దేశ్యం. అంతే కాని మిమ్మల్ని తప్పెంచటం నాఅభిమతం కాదండి

      Delete
    3. మీ వివరణతో మీ ఉద్దేశ్యం అర్థమయింది. థాంక్స్.

      నేను రాసిన "Cinema" సినీఫీల్డు అని భావన. ఇది నా భావన కాదు, ఈ మాట చెప్పిన పెద్దాయన భావన.

      Delete
  2. మీ అబ్బాయి తో మీరు సినిమా తీయొచ్చు కదా ? ఎవరి జాతకం ఎలా ఉందొ , మీ అబ్బాయి పెద్ద హీరో అవ్వచ్చేమో .

    ReplyDelete
    Replies
    1. నేనెప్పుడూ అనుకోలేదు. మా అబ్బాయిలిద్దరికీ కూడా ఆ ఆలోచన ఉన్నట్టు నేను గమనించలేదు, వాళ్ళూ చెప్పలేదు. ఏమైనప్పటికీ, ఇది ఆలోచించదగ్గ విషయమే! :-)

      భన్యవాదాలు!

      Delete