Sunday 11 September 2022

ఎవరిలోనైనా నన్ను ఆకర్షించే మొట్టమొదటి అంశం...


వ్యక్తిగతంగా తను ఏ పార్టీకి అనుకూలమైనా సరే, కొన్ని కొన్నిసార్లు అర్థం లేకుండా ఎంత పిచ్చిపిచ్చిగా మాట్లాడినా సరే... కంగనా రనౌత్ లోని కిల్లర్ ఇన్‌స్టింక్ట్, భయంలేనితనం నాకు బాగా నచ్చుతాయి. 

ఎక్కడో హిమాచల్ నుంచి అనుకుంటాను... ఒక్కతే ముంబై వచ్చింది. బాలీవుడ్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. తెలుగు, తమిళంలో కూడా నటించింది. 60 కోట్లతో ముంబైలో ఒక ఫిలిం ప్రొడక్షన్ ఆఫీస్ పెట్టింది. సినిమాలు నిర్మిస్తోంది. దర్శకురాలయింది కూడా. 

కట్ చేస్తే - 

పద్మశ్రీ అవార్డుతో పాటు, 3 జాతీయ అవార్డులు, 4 ఫిలిం ఫేర్ అవార్డులు కూడా గెల్చుకొన్న కంగానాను, జస్ట్ ఒక "అందాలు ఆరబోసే రొటీన్ గ్లామర్ డాల్" అని అంత ఈజీగా తీసుకోడానికిలేదు. ఆమె వ్యక్తిగత జీవితంతో పాటు, ఆమె వృత్తిజీవితం కూడా అనేక చాలెంజ్‌లతో కొనసాగుతూ వస్తోంది. 

కరణ్‌జోహార్ లాంటి బాలీవుడ్ మొఘల్స్‌తో ఢీ అంటే ఎంత పెద్ద విషయమో కంగనాకు తెలియక కాదు. "తుఝే క్యా లగ్తాహై ఉధ్ధవ్ థాకరే..." అని సాక్షాత్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రినే ఏకవచనంలో సంభోధిస్తూ, సవాల్ విసరడం అంత ఈజీ కాదు.    

ప్రతి మనిషిలోనూ కొన్ని బలహీనతలుంటాయి. కొన్ని తెలియనివి. కొన్ని తెలిసే చేసేవి.  

ఎవరి రీజన్స్ వారికుంటాయి. ఎవరి జీవితం వారిది. 

ఎవరిలోనైనా నన్ను ఆకర్షించే మొట్టమొదటి అంశం వారు సాధించిన విజయాలు. వారిలోని గట్స్.

తర్వాత - వారిలోని నిరంతర ఉత్సాహం. జీవితం పట్ల వారికున్న ప్యాషన్. ఒక రొటీన్‌కు అలవాటుపడకుండా ఉండటం. "వెయిట్ అండ్ సీ" అన్న ధోరణికి ఎడిక్ట్ కాకుండా ఉండగలగటం. 

ఇవేవీ అంత ఈజీ కాదు.    

ఇలాంటి లక్షణాలన్నీ తన డి ఎన్ ఏ లో భాగం చేసుకొన్న కంగానా... ఒక ఫైటర్. 

ఆ ఫైటర్ పోరాటం వెనుక తన 16 ఏళ్ల ఫిలిం ఇండస్ట్రీ జీవితపు మర్చిపోలేని అనుభవాలున్నాయి. ఘోరమైన అవమానాలున్నాయి. అంతులేని సంఘర్షణ ఉంది.  

5 comments:

 1. నాపుస్తకానికి ప్రణాలికను వేసుకోవటం జరిగింది. ఐతే, పెద్దగా ఉండే దీనిని గ్రంథస్థం చేయటానికి సహాయపడే book writing software ఏదన్నా ఉన్నదా మీ ఎఱుకలో? ఎలిమెంట్స్ & ఇంటెగ్రిటీ maintain చేయాలంటే ఆఅవసరం ఉంది. నేరుగా వ్రాసేయటం కష్టం కావచ్చును.
  వీలైతే నాకు వాట్సాప్ చేయండి. ఇక్కడ చెప్పినా ఓకే.

  ReplyDelete
  Replies
  1. మీరు చెప్పిన విధంగా నాకెప్పుడూ అలాంటి అవసరం రాలేదు. నాకు తెలిసి నేను ఎలాంటి సాఫ్ట్ వేర్ ప్రయత్నించలేదు. బహుశా ఉండే ఉంటాయి. మీరు ట్రై చేసి, బాగుంటే నాకు చెప్పండి. థాంక్స్ ఇన్ అడ్వాన్స్!

   Delete
  2. తప్పకుండా చెబుతా నండీ.

   Delete
 2. మీరు వ్రాసినది నిజం. అందం, అభినయం, ధైర్యం కలిగిన వ్యక్తి కంగనా రణవట్. బాలీవుడ్ రాజకీయ బిగ్గీస్ ను ధైర్యంగా ఢీకొన్న వనిత.

  ReplyDelete