Sunday 4 September 2022

అమ్మకాలే కాదు, ఆశయ సాధన కూడా ముఖ్యం!


కనీసం ఒక డజన్ భాషల్లో, మిలియన్ల సంఖ్యలో అమ్మకాలు జరిగిన పుస్తకాలను చదువుతూ పెరిగినవాణ్ణి. కేవలం మనకోసమే ఒక పుస్తకం రాసుకున్నా, ఆ పుస్తకాన్ని ఇష్టపడే మనలాంటి లైక్‌మైండెడ్ కనీసం ఒక వెయ్యి మంది అయినా ఉండితీరతారన్నది నా హంబుల్ లాజిక్. 

1000 True Friends అన్నమాట! 

ఇంగ్లిష్‌లో చాలా చోట్ల మనం వినే "1000 True Fans" కాన్‌సెప్ట్ కూడా ఇదే. 

వెయ్యిమంది ట్రూ ఫ్యాన్స్ ఉన్నారంటే పదివేల పుస్తకాలమ్మినట్టే లెక్క.  

నాకున్న కొన్ని వ్యక్తిగత పరిమితులవల్ల, ముఖ్యంగా నా అశ్రద్ధవల్ల ఇప్పటివరకు నేను చేయాలనుకొన్న రచనలు గాని, రాయాలనుకొన్న పుస్తకాలు గాని రాయలేదు. కాని, రాసిన రెండు మూడు బుక్స్ మాత్రం అన్నీ బెస్ట్ సెల్లర్ పుస్తకాలే. 

వేటినీ ఇంట్లో అటకమీదకెక్కించలేదు. ఇంట్లోవాళ్ళకో, ఇంకెవరికో భయపడి పబ్లిషర్ దగ్గరే అట్టడబ్బాల్లో వదిలెయ్యలేదు. అన్నీ అతి తక్కువ సమయంలో సోల్డ్ అవుట్ అయిన పుస్తకాలే! 

కట్ చేస్తే -  

కొద్దిరోజుల క్రితం మంత్రి కేటీఆర్ గారు లాంచ్ చేసిన నా పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కేంద్ర బిందువుగా తీసుకొని, ఒక రాజకీయ కోణంలో రాసిన పుస్తకం.

బుక్ సెల్లర్స్, పబ్లిషర్స్ చెప్తున్న బుక్ సేల్స్ అంకెల ప్రకారం ఈ పుస్తకం కూడా లాంచ్ అయిన కొద్దిరోజుల్లోనే "బెస్ట్ సెల్లర్ పుస్తకం" గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. నా ఇతర పుస్తకాలతో పోలిస్తే ఈ పుస్తకం కనీసం ఒక పదిరెట్లు సేల్ అవ్వాలి. 

'తెలుగు బుక్స్ డాట్ ఇన్' తప్ప, ఇంకా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ పోర్టల్స్‌లోకి ఎక్కలేదు. త్వరలోనే మా స్వర్ణసుధ పబ్లికేషన్స్ వారు ఈ పని కూడా పూర్తిచేయవచ్చు. 

కేసీఆర్ అభిమానులు, తెలంగాణ ప్రేమికులు కోట్లల్లో ఉంటారు. వాళ్ళల్లో కనీసం ఒక లక్షమంది అయినా డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. వీరిలో ఒక పావు భాగం మందిని మరింతగా ఇన్‌స్పైర్ చెయ్యడానికి, ఉడతాభక్తిగానైనా నా పుస్తకం ఉపయోగపడుతుందన్నది నా నమ్మకం.

అతిదగ్గరలో ఉన్న 'ఎలక్షన్ ఇయర్' సందర్భంగా - కేవలం అమ్మకాల్లోనే కాదు, ఆశయ సాధనలో కూడా ఉపయోగపడాలన్నది నా ఉద్దేశ్యం. 

దీని కోసం, బల్క్ ఆర్డర్స్‌తో, భువనగిరి నవీన్ లాంటి కేసీఆర్ డైహార్డ్ ఫ్యాన్స్ కనీసం ఇంకో పదిమందయినా ముందుకువస్తే బాగుంటుంది. వస్తారు కూడా. 

No comments:

Post a Comment