Thursday 15 September 2022

కేసీఆర్ 2.0 - 3


గోవాలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 8 మంది బీజేపీలో చేరిపోయారు. కాంగ్రెస్ ఏమీ చేయలేకపోయింది. 

గెలిచిన తన ఎమ్మెల్యేలకు ఆత్మవిశ్వాసం అందించి కాపాడుకోలేని స్థితిలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఏమీ చేయలేదు అని ఇలా ఎప్పటికప్పుడు తెలిసిపోతోంది. 

బీజేపీయేతర పార్టీల్లో ఎక్కడ ఎవరు ఎంతమంది గెలిచినా, వారికి ఓపెన్‌గా తాయిలాలిస్తూ తమపార్టీలోకి చేర్చుకొని ప్రభుత్వాలను కూలగొట్టే అధమస్థాయి రాజనీతి బీజేపీది. 

ఒకేదేశం, ఒకే పార్టీ దిశగా ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనం నిర్దేశించుకుని, దేశాన్ని వందల సంవత్సరాల వెనక్కి తీసుకుపోతున్న పార్టీని, ప్రధానమంత్రిని... జస్ట్ అలా చూస్తూ ఊరుకుంటున్నాయి మిగిలిన అన్ని పార్టీలు, ఆ పార్టీల అధినేతలు. 

ఇది ఇంక నడవనీయం అని ప్రెస్‌మీట్లు పెట్టి మరీ  సింహంలా గర్జిస్తున్న గొంతు ప్రస్తుతం ఈ దేశంలో ఒక్కటే. 

కేసీఆర్. 

కట్ చేస్తే - 

హైద్రాబాద్ వేదికగా కేసీఆర్ ప్రకటించే జాతీయపార్టీ కోసం తెలంగాణ ప్రజలే కాదు... యావత్ దేశంలోని అత్యధికశాతం మంది రైతులు, ప్రజలు, ఇతరపార్టీల రాజకీయ నాయకులు, ఇండస్ట్రీ వర్గాలు, మిగిలివున్న ఆ కొద్ది కేంద్రప్రభుత్వ సంస్థల్లోని ఉద్యోగులు, అనేక ఎన్‌జీవో వ్యవస్థలు ఎదురుచూస్తున్నాయి. 

అయితే - కేంద్రంలో ఉన్న బీజేపీపై, మోదీపై కేసీఆర్ ప్రత్యక్షంగా యుద్ధం ప్రకటించే ఆ సంచలనాత్మక దినం వచ్చే విజయదశమికేనా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.  

4 comments:

  1. శ్రీమాన్ కేసీఆర్ గారు కూడా తెలంగాణా రాష్ట్రంలో ఇతరపార్టీలను తమ పార్టీలో అలాగే కలుపుకున్నా రనుకుంటాను. ఇప్పడే మీకు తప్పు తోచటం ఏమిటీ? ఇది pot calling kettle black అన్నట్లుగా లేదా?

    ReplyDelete
    Replies
    1. విద్యాధికులు కూడా చాలా గుడ్డిగా ఫాలో అవటం అంటే ఇదే!

      మీకు జవాబివ్వటం నాకు ఇష్టం లేదు. అయినా క్లుప్తంగా ప్రయత్నిస్తాను...

      > కేసీఆర్ ఎవ్వర్నీ రమ్మనలేదు. 6 కోట్లు, 60 కోట్లు ఇస్తాం అని ఆఫర్స్ ఇవ్వలేదు (బీజేపీ విషయంలో ఇవి పత్రికల్లో, న్యూస్‌లో ఎన్నోసార్లు వచ్చాయి! ఆయా ఎమ్మెల్యేలు, మంత్రులే స్వయంగా చెప్పారు!!). అలా కొనేసి, ఏ ప్రభుత్వాన్ని పడగొట్టలేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం స్ట్రాటెజిక్‌గా పార్టీలోకి తీసుకున్నారు. అభివృద్ధి చేస్తున్నారు.

      > గత 8 ఏళ్ళలో మోదీ గారు దేశంలో చేసిన అభివృద్ధి ఏమిటో, దేశానికి ప్రజలకు నిజంగా పనికొచ్చే పనులు చేసింది ఏమిటో... ఆ లిస్టు కాస్త గణాంకాలతో మీరొక ఆర్టికిల్ రాయండి. తెలుసుకుంటాను.

      I close this discussion here itself. If anything there to share plz write a post and send me link. Thanks.

      Delete
  2. https://www.andhrajyothy.com/amp/telugunews/progress-in-japan-and-china-madness-in-india-ngts-telangana-1822091603403396

    ReplyDelete