Monday 22 August 2022

బ్లాగింగ్ నాకేమిచ్చింది? - 2


జీవితంలో ఒక దశ తర్వాత చెయ్యాలనుకున్నది చేసేసుకుంటూ పోవడమే. 

మిగిలిందంతా జస్ట్ బుల్‌షిట్! 

ఆ దశ కొందరికి కొంచెం ఎర్లీగా వస్తుంది. కొందరికి కొంచెం ఆలస్యంగా వెలుగుతుంది. నాలాగా. 

కట్ చేస్తే -   

సినిమా ప్యాషనేట్స్ అయిన కొంతమంది లైక్‌మైండెడ్ మిత్రుల నెట్‌వర్క్‌ను సృష్టించుకొనే ప్రయత్నంలో భాగంగానే ముందు నేనీ బ్లాగ్‌ను సృష్టించాను. 

ఊరికే సినిమా టిడ్‌బిట్స్, రొటీన్ వార్తల్లాంటివి రాయకుండా... నా అనుభవంలో నాకు తెలిసిన ఫిలిం ఇండస్ట్రీ లోపలి విషయాలను లైటర్‌వీన్‌లో, హిపోక్రసీ లేకుండా నిజాలనే రాస్తూ పంచుకోవాలన్నది నా ఆలోచన. 

అందుకే, ఈ బ్లాగ్‌కు "నగ్నచిత్రం" అని పేరు పెట్టాను.  

దీన్ని కొంచెం సీరియస్‌గా, కొంచెం ఈజీగా, కొంచెం కేర్‌లెస్‌గా తీసుకొంటూ, ఎప్పుడో తోచినప్పుడు మాత్రం ఒక పోస్ట్ "ఏదో రాయాలి కాబట్టి రాస్తాను" అన్నట్టుగా అలా రాస్తూపోయాను. 

నెమ్మదిగా బ్లాగింగ్ ఎంత శక్తివంతమైందో నాకర్థమైంది. నా దినచర్యలో భాగమైంది. 

తర్వాత్తర్వాత, నా ఫ్రీలాన్సింగ్ క్రియేటివ్ యాక్టివిటీ మొత్తానికి దీన్నే ఒక "హబ్‌"లా ఉపయోగించుకొంటూ, ఏ ఒక్కదానికీ పరిమితం చేయకుండా అన్నీ దీన్లోనే రాయడం ప్రారంభించాను. 

అందరూ, అన్నీ, ఇక్కడే, నా ఈ బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ మీదే నాకు కనెక్ట్ కావడం ప్రారంభమైంది.   

21 ఆగస్టు 2012 నాడు, అనుకోకుండా సృష్టించిన ఈ "నగ్నచిత్రం" వయస్సు చూస్తుండగానే 10 ఏళ్ళు దాటింది.

ఇవాళ్టికి సరిగ్గా 3651 రోజుల ఆత్మీయ స్నేహం మా ఇద్దరిదీ! 

ఫినిషింగ్ టచ్ ఏంటంటే - 

నా లేటెస్ట్ బెస్ట్ సెల్లర్ పుస్తకం "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" ఆలోచన నాలో రావడానికి కూడా నాకత్యంత ఇష్టమైన నా ఈ బ్లాగింగ్ అలవాటే కారణం!      

"Sometimes I think of blogging as finger exercises for a violinist; sometimes I think of it as mulching a garden. It is incredibly useful and helpful to my “real” writing." ~Kate Christensen

2 comments:

  1. " Keep calm and continue Blogging "
    " రాయడం అనేది... ఒక థెరపీ.. ఒక యోగా.. ఒక ఆనందం... ఒక స్పిరిచువల్ ఎక్సర్సైజ్."
    " బ్లాగింగ్ ఎంతో శక్తివంతమైనది "
    --- బ్లాగింగ్ గురించి స్ఫూర్తి నిచ్చే మాటలు చక్కగా చెప్పారండీ 👌.
    నేను బ్లాగింగ్ మొదలెట్టి రెండు సంవత్సరాలు దాటిందంతే. అందువల్ల పొందే మానసిక ఆనందం అనుభవైకవేద్యం.. అమూల్యం..ఇది నిజం! 🙏

    ReplyDelete
    Replies
    1. మీ కామెంట్‌కు థాంక్స్ అండి.

      రాస్తూ ఉండండి. బెస్ట్ విషెస్...

      Delete