Sunday 21 August 2022

బ్లాగింగ్ నాకేమిచ్చింది? - 1


మనిషన్న తర్వాత ఏదో ఒక ఎడిక్షన్ ఉంటుంది... 

ఎడిక్షన్ అంటే అది ఏ తాగుడో, జూదమో, ఇంకేదో కానక్కర్లేదు. చచ్చేంత ఇష్టం ఉండే ఏదైనా పాజిటివ్ అలవాటు కూడా కావచ్చు.

నాకున్న ఏకైక ఎడిక్షన్ బ్లాగింగ్. 

కనీసం ఒక అయిదారు సార్లు ఇంక బ్లాగింగ్ బంద్ చేద్దామనుకున్నాను. కాని, అలా జరగలేదు. బహుశా జరగదు. 

కట్ చేస్తే - 

21 ఆగస్ట్ 2012...

సరిగ్గా పదేళ్ళ క్రితం, ఇదేరోజు, నేను నా బ్లాగింగ్ జర్నీ ప్రారంభించాను. ఇప్పటికీ ఎలాంటి బోర్ ఫీలింగ్ లేకుండా, ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహంతో నా బ్లాగ్‌లో ఏదో ఒకటి రాస్తూనే ఉన్నాను. 

పనికొచ్చేదో, పనికి రానిదో... ఏదో ఒకటి రోజూ కాసేపు ఇలా రాయడం చాలా అవసరం నాకు. అంతలా ఎడిక్టయ్యాను.

ఏదో రాసి ఎవర్నో ఉధ్ధరించాలన్నది కాదు ఇక్కడ విషయం. నన్ను నేను ఉధ్ధరించుకోవడం కోసం మాత్రం నాకు నిజంగా తప్పనిసరి.

ఇంతకు ముందు చాలా సార్లు నాకు నేనే చెప్పుకున్నట్టు... రాయడం అనేది నాకు సంబంధించినంతవరకు... ఒక థెరపీ. ఒక యోగా. ఒక ఆనందం. ఒక స్పిరిచువల్ ఎక్సర్‌సైజ్. 

ఎవరేమనుకుంటారో అన్న మైండ్‌సెట్ లోంచి బయటపడగలిగితే చాలు... బ్లాగింగ్, మనతో మనం మాట్లాడుకోడానికి ఒక మంచి ఔట్‌లెట్‌లా పనిచేస్తుంది.

ఎలాంటి హిపోక్రసీ, ఇన్‌హిబిషన్స్ లేకుండా, జీవిత పర్యంతం మనం ఇష్టంగా ఫీలయ్యి, అన్నీ పంచుకోగలిగిన ఒకటి రెండు అద్భుత స్నేహాలను కూడా అందిస్తుంది.  

“No matter who you are, no matter what you do, no matter who your audience is: 30 percent will love it, 30 percent will hate it, and 40 percent won't care. Stick with the people who love you and don't spend a single second on the rest. Life will be better that way.” - James Altucher    

2 comments:

  1. మీ బ్లాగ్ కు పదవ జన్మదిన శుభాకాంక్షలు. పది సంవత్సరాలు విడవకుండా బ్లాగ్ నడిపిన మీకు అభినందనలు 💐.

    పైన మీరు పెట్టిన పోస్టర్ లోని Keep calm అన్న సలహాని బాగానే పాటిస్తున్నట్లున్నారే — ఇతర బ్లాగుల్లో మీ కామెంట్లు కనబడవు 🙂🙂.

    ReplyDelete
    Replies
    1. థాంక్ యూ అండి!

      "కీప్ కామ్" అనేది మీరు అనుకుంటున్న విషయంలో కాదండి. అది, నన్ను నేను ఇన్‌స్పైర్ చేసుకోడానికి మాత్రమే. 🙂🙂

      నిజమే నండి... వేరే బ్లాగుల్లో నా కామెంట్స్ తక్కువ. నా ఆలోచనలకు కనెక్ట్ అయ్యే ఏవైనా కొన్ని బ్లాగులు సూచించండి. వీలైతే లింకులతో. మీకు ముందస్తు ధన్యవాదాలు ఈ సహాయానికి!

      Delete