Tuesday, 26 July 2022

ప్రేయసి... ప్రయోగశాల!


వైజాగ్‌లో ఉన్న నాకత్యంత ప్రియమైన ఒక ఫ్రెండ్‌కూ నాకూ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది.

కొంచెం ఏం కాదు, చాలానే వచ్చింది. 

మొన్నొకసారి మళ్ళీ కలిశాం. కాని, ఆ గ్యాప్ గ్యాప్‌గానే ఉంది. 

జీవితంలోని ఏదో ఒక దశలో ఇలాంటి జెర్క్‌లు ఎవరికైనా కొన్ని తప్పవనుకుంటాను.

అకారణంగా ఎలాంటి గొడవలు, గొడవలకు కారణమైన దారుణాలేం లేకుండానే వచ్చిన ఈ గ్యాప్ నన్ను నేను చాలా విధాలుగా విశ్లేషించుకోడానికి కారణమైంది. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చాలా విషయాల్లో నేను నిరాసక్తంగా మారిపోయాను. 

అందులో ఒకటి నా బ్లాగింగ్.  

కట్ చేస్తే - 

థాంక్స్ టూ మై ఫ్రెండ్ ఇన్ వైజాగ్... నాలో వచ్చిన ఈ 'బ్లాగర్స్ బ్లాక్‌'ను బ్రేక్ చేయడం కోసం తనని గుర్తుతెచ్చుకొంటూ ఈ పోస్టు రాయడం మొదలెట్టాను. 

ఎప్పుడో ఒకటీ అరా బ్లాగ్ పోస్ట్ తప్ప అసలేమీ రాయటం లేదు ఈమధ్య. 

ఇది పెద్ద నేరం. నా దృష్టిలో.

రాయగలిగివుండీ, రకరకాల కారణాలను వెతుక్కొంటూ రాయకుండా ఉండటం, అలా ఉండగలగటం... నిజంగానే పెద్ద నేరం. 

ఏదో రాసి, ఎవర్నో ఉధ్ధరించాలన్నది కాదు ఇక్కడ విషయం. కరోనా లాక్ డౌన్  సమయంలో నేను ఎదుర్కొన్న ఎన్నో ఊహించని సంఘటనల నేపథ్యంలో నన్ను నేను ఉధ్ధరించుకోవడంకోసం మాత్రం ఇప్పుడు నాకు నిజంగా తప్పనిసరి. 

ఖచ్చితమైన లక్ష్యాలతో ఎవరేమనుకుంటారోనన్న పనికిరాని సంకోచాలేం లేకుండా ఒక్కొక్కటీ పూర్తిచేసుకొంటూ ముందుకెళ్తున్నాను. 

ఈ నేపథ్యంలో నాకెంతో ప్రియమైన నా బ్లాగింగ్ చాలా తగ్గిపోయింది. 

రాయడం అనేది నాకు సంబంధించినంతవరకూ... ఒక థెరపీ. ఒక యోగా. ఒక ఆనందం. ఒక గిఫ్ట్. నాకత్యంత ఇష్టమైన నా సహచరి, నా ప్రేయసి.  

నిజానికి ఇదేమంత గొప్ప విషయం కాదు. అనుకుంటే ఎవరైనా రాయగలరు. కానీ, అందరూ అనుకోరు. అందరివల్లా కాదు. 

ఇలాంటి గొప్ప అదృష్టాన్ని వినియోగించుకోకపోవడం నాకు సంబంధించినంతవరకు నిజంగా నేరమే. ఈ నిజాన్ని నేను పదే పదే రిపీటెడ్‌గా రియలైజ్ అవుతుంటాను. 

బ్లాగింగ్ నిజంగా ఒక స్ట్రెస్‌బస్టర్.

ఈ విషయాన్ని ప్రాక్టికల్‌గా నేను ఎన్నోసార్లు గుర్తించాను. చాలా సార్లు ఈ విషయం గురించి ఇదే బ్లాగ్‌లో రాశాను.  

జీవితంలో ఏవైనా ఊహించని జెర్క్‌లు వచ్చినప్పుడు కూడా నిజంగా నన్ను కాపాడేది ఈ అలవాటే. ఈ థెరపీనే. ఈ యోగానే. 

నేను రాయాలనుకున్న కొన్ని పుస్తకాల గురించి, స్క్రిప్టుల గురించి, ఇంకెన్నో క్రియేటివ్ థింగ్స్ గురించి నాకు మొట్టమొదటగా ఐడియా ఫ్లాష్ అయ్యిందీ, అయ్యేదీ కూడా... ఇలా బ్లాగింగ్ చేస్తున్నప్పుడే. 

"Sometimes I think of blogging as finger exercises for a violinist. Sometimes I think of it as mulching a garden." ~Kate Christensen

No comments:

Post a Comment