Tuesday 12 July 2022

Addicted to KCR!


"ఎనిమిది సంవత్సరాల మీ పరిపాలనలో ఈ దేశానికి మీరు చేసిన ఒక్క మంచి పని ఏంది?" 

మొన్న సాయంత్రం ప్రెస్‌మీట్‌లో ఇదీ కేసీఆర్ గారి సూటి ప్రశ్న. 

ఎవరికైతే ఈ ప్రశ్నను కేసీఆర్ వేశారో - దీనికి సమాధానం ఇచ్చే బాధ్యత తీసుకొనే స్థాయిలో వారు లేరు. ఆ స్థాయికి ఎదగలేరు కూడా అని ప్రతిరోజూ స్వయంగా వారి వాట్సాప్ కంటెంట్‌తో వారికి వారే ప్రూవ్ చేసుకుంటున్నారు.   

"కరెంట్ ఇవ్వలేరు, సాగునీరు ఇవ్వలేరు, మంచినీరు కూడా ఇవ్వలేరు. సాక్షాత్తూ దేశ రాజధాని ఢిల్లీలోనే కరెంట్ కోతలు, త్రాగడానికి మంచినీళ్ళు లేవు! ఇదీ మీ ప్రభుత్వం... ఇది నిజం కాదా?"

ఇది కేసీఆర్ గారి ఇంకో సింపుల్ కొశ్చన్. కాని, వాళ్ళు దీన్ని నిజమని ఒప్పుకోరు, జవాబివ్వలేరు.  

"సుప్రీంకోర్టు లక్ష్మణరేఖ దాటింది" అని చెప్పే అంత స్థాయిలో అసలు మీరున్నారా? అంత స్థాయి పనులు మీరు ఏం సాధించారని సుప్రీంకోర్టు జడ్జీలనే ట్రోలింగ్ చేస్తున్నారు?  

"ఒక రైతు భీమా ఇచ్చే తెలివి ఉందా మీ గవర్నమెంటుకు?" 

"నాన్ బిజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పర్ క్యాపిటా ఇన్‌కమ్ ఎక్కువుందన్న విషయం అసలు మీకు తెలుసా?" 

"ది హిందు పత్రిక ఎడిటర్ ఎన్ రాము, ఎన్‌డిటీవీ ప్రణయ్ రాయ్‌లను నక్సలైట్లని పేరుపెడతారా?"  

"ఇండియన్ డెమాక్రసీని ఘోరంగా హత్యచేస్తున్న మీరు, ఇంకెందరో ఏక్‌నాథ్ షిండేలను సృష్టిస్తామని సిగ్గులేకుండా బాహాటంగా చెప్పుకుంటారా?"  

"మీరు ప్రజాస్వామ్య హంతకులు కారా?"  

"రఘురాం రాజన్, అమర్త్యసేన్, ఇతర ప్రపంచ ఆర్థికవేత్తలు చెప్తున్న వాస్తవాలు అసలు వింటున్నారా?"   

"నేను చాలా బాధతో చెప్తున్నాను ఏందంటే - దేశంలో ఇంతవరకు ఏ మూర్ఖుడు కూడా చేయని పనుల్ని ఈ ప్రధానమంత్రి చేస్తున్నాడు... మీకు తెలుసా?" 

"దేశ ఆర్థిక భవిష్యత్తును కూడా సర్వనాశనం చేస్తున్నాడు... మీకు తెలుసా?"

... ... ...  

గ్యాప్ లేకుండా, యుద్ధభూమిలో బాంబుల మోతలా... ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ ప్రశ్నల వర్షం! 

కాని, అవతలివైపు నుంచి సమాధానాలు ఇచ్చేంత సీన్ లేదు... ఇవ్వలేరు.    

కట్ చేస్తే -

మన ఐటి & ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ ఒక ట్వీట్ పెట్టారు: "ముఖ్యమంత్రి గారి రెండున్నర గంటల మారథాన్ ప్రెస్‌మీట్ పొలిటికల్ సైన్స్ విద్యార్థులకు ఎక్సలెంట్ లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్! అవతల కొందరు 8 ఏండ్లు అవుతున్నా ఒక్క ప్రెస్‌మీట్ ఫేస్ చేయడానికే వణుకుతున్నారు!!" అని.

ఒక్క ప్రెస్‌మీట్ ఫేస్ చెయ్యడానికి 8 ఏండ్లుగా వణుకుతున్నదెవరో మనకు తెలుసు, అందరికీ తెలుసు. 

నిజానికి, కేసీఆర్ ప్రెస్‌మీట్స్ పైనే పొలిటికల్ సైన్స్ పరిశోధకులు పిహెచ్‌డిలు చేయాల్సి ఉంది, చేస్తారు కూడా. 

మా కంపెనీ సైట్ మేలా నుంచి తిరిగివస్తూ - కేసీఆర్ గారి మొన్నటి ప్రెస్‌మీట్ చివరి అరగంట మాత్రమే చూడగలిగాను. నేను చూసిన ఆ అరగంటలోనే కావల్సినన్ని కొత్త పదాల్ని, కొత్త పంచ్‌ల్ని, కొత్త భావాల్ని, కొత్త నినాదాల్ని ఇచ్చారు "కంటెంట్ కింగ్" కేసీఆర్. 

"హ్యూమన్ క్యాపిటల్." 
అసలు ఈ పదం ఎప్పుడైనా ఈ దేశాన్ని పాలిస్తున్నవాళ్ళు విన్నారా? 

"ఇండియా రియాక్ట్స్!" 
కేవలం రెండు పదాల్లో ఇంత ప్రొయాక్టివ్, ఇంత పవర్‌ఫుల్ స్లోగన్ ఒకదాన్ని వీళ్ళు సృష్టించగలరా? 

భారతదేశంలో కురిసే వర్షపాతం అంకెల్ని పేపర్ మీద రాసిచ్చినా, కనీసం చూసి చదవగలరా వీళ్ళు? 

జింబాబ్వేలో, రష్యాలో, చైనాలో, అమెరికాలో ఉన్న భారీ నీటి రిజర్వాయర్ల గురించి అధ్యయనం చేసి, వాటి కెపాసిటీని అంకెల్లో ఆశువుగా చెప్పేంత సీన్ వీరికి ఎన్నటికైనా వస్తుందా? 

75 ఏళ్ళ భారత రాజకీయ చరిత్రలో జరుగుతున్నది కేవలం "బ్లేమ్ గేమ్" తప్ప మరొకటి కాదు అని చెప్పేంత విశ్లేషణ, వివేచన వీరికుందా? ఎప్పటికైనా తెలుసుకుంటారా?

మారుతున్న కాలమాన పరిస్థితులు, అవసరాలు, అభివృద్ధినిబట్టి - ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి రాజ్యాంగాన్ని రివైజ్ చెయ్యాలని చెప్పిన థామస్ జెఫర్సన్ గురించి వీరెప్పుడైనా విన్నారా?  

ఒక అరగంటలో ఏదో ఒక చిన్న బ్లాగ్ రాసి పోస్ట్ చేద్దామనుకున్నవాణ్ణి... దాన్ని పక్కనబెట్టి, మొత్తం ప్రెస్‌మీట్‌ను మళ్ళీ మొదటినుంచి చూశాను. 

దటీజ్ కేసీఆర్. 

రెండు గంటల పక్కా కమర్షియల్ సినిమాను చూడటమే కష్టమైపోతున్న ఈ డిజిటల్-సోషల్ యుగంలో - కేసీఆర్ గారి రెండున్నర గంటల నాన్-స్టాప్ మారథాన్ ప్రెస్‌మీట్‌ను నిమిషం మిస్ కాకుండా చూసే ఫ్యాన్స్... వారికి పార్టీలకతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారంటే అతిశయోక్తికాదు. 

కేసీఆర్ అందించే కంటెంట్ స్థాయి అలాంటిది. ఆ స్థాయిని రీచ్ కావడం అందరివల్ల కాదు. వాట్సాప్ యూనివర్సిటీలు అసలు ఆ దరిదాపుల్లోకి కూడా రాలేవు.   

కట్ చేస్తే -

మొన్న 5 వ తేదీనాడు... మంత్రి, టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆవిష్కరించిన నా పుస్తకానికి ముందు నేననుకొన్న పేరు "ఎడిక్టెడ్ టు కేసీఆర్". 

ఆ పేరుతో చేసిన కవర్ డిజైన్ ఇంకా నాదగ్గర భద్రంగా ఉంది.  

కాని, 'ఎడిక్టెడ్' అన్న నెగెటివ్ పదంతో టైటిల్ వద్దు అని ఒకరిద్దరు మిత్రులు అనడంతో ఆ టైటిల్ పక్కనపెట్టి, "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" అన్న టైటిల్‌తో ప్రచురించాను. 

వాస్తవానికి, కేసీఆర్ నిజంగా ఒక ఎడిక్షన్.

ఒకసారి వారి ఆలోచనలకు, వారి వ్యూకి, వారి విజన్‌కి కనెక్ట్ అయ్యామా... ఇంక అంతే.  

నిన్నటి ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ చెప్పినట్టు, 75 సంవత్సరాల రొటీన్ పాలిటిక్స్ నుంచి ఈ దేశం బయటపడాలి. అవుటాఫ్ ద బాక్స్ రాజకీయాలు రావాలి.  

ఈ దిశలో కూడా ఒక మహోఉద్యమం ప్రారంభం కాబోతోందని నేననుకొంటున్నాను. ఆ మహోద్యమానికి కేసీఆరే నాయకత్వం వహిస్తారన్నది స్పష్టం. అందుకోసం, అవసరమైతే టీఆరెస్ జాతీయపార్టీగా కూడా మారుతుంది. 

ఇది డిజిటల్-సోషల్ యుగం. కొన్ని నెలలల్లోనే దేశ రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా ఫ్లిప్ చేయగల టెక్నాలజీ, మీడియా, సోషల్ మీడియా మన ముందున్నాయి. 

ఒక్క చిన్న ఆలోచన చాలు, ఒక్క చిన్న ట్విస్ట్ చాలు, పదునైన ఒకే ఒక్క వ్యూహం చాలు. ఓవర్‌నైట్‌లోనే దేశ రాజకీయ ముఖచిత్రంలో ఊహించని పరిణామాలు జరుగుతాయి. 

ఇప్పుడలాంటి పరిణామాల కోసం దేశం ఎదురుచూస్తోంది. 

సంకల్పం గొప్పది, శక్తివంతమైనది అయినప్పుడు... ఈ సర్వ ప్రపంచం, ఈ అనంతవిశ్వం కూడా పాజిటివ్‌గా కుమ్మక్కై... ఆ సంకల్పాన్ని నిజం చెయ్యడానికి సహకరిస్తాయంటారు.

కేసీఆర్‌లో ఆ సంకల్పం ఉంది. 

వారి సంకల్పానికి మనం కూడా సహకరిద్దాం.  

No comments:

Post a Comment