Monday 20 June 2022

సినిమా ఇండస్ట్రీలో జయాపజయాల్ని శాసించేది ఏది?


సినిమా ఇండస్ట్రీలో జయాపజయాల్ని శాసించేది - అందరూ మామూలుగా అనుకున్నట్టు - కథ, నిర్మాత, బడ్జెట్లు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, మేకింగ్, ప్రమోషన్... ఇలాంటివేవీ కావు.  

ఇవ్వన్నీ సెకండరీ. 

మనతో కలిసి పనిచెయ్యడానికి మనం ఎన్నుకొనే వ్యక్తులు, మనం అసోసియేట్ అయ్యే వ్యక్తులే మన జయాపజయాలకు మొట్టమొదటి కారణం అవుతారు! 

కట్ చేస్తే - 

హీరోహీరోయిన్స్ గాని, డైరెక్టర్స్ గాని వాళ్ళదగ్గరికి ఎవరు సినిమా తీస్తామని వస్తే వాళ్ళతో చెయ్యరు. చాలా విషయాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇలాంటివాళ్ళే సక్సెస్ సాధిస్తారు.  

సినిమా చేస్తే చాలు, డబ్బులొస్తే చాలు అనుకునేవాళ్ళు వెంటనే ఏం ఆలోచించకుండా ఓకే అంటారు. ఫలితాలు ఫెయిల్యూర్ దిశగా తీసుకెళ్తాయి. కొత్త సమస్యల్ని క్రియేట్ చేస్తాయి. ఆ సమస్యలు ఎలా ఉంటాయంటే - కొన్నికొన్నిసార్లు ఒక దశాబ్దకాలం జీవితాన్ని తినేస్తాయి. ఇలాంటివన్నీ అనుభవం మీదే తెలుస్తాయి. 

నమ్మటం కష్టం కాని - మనం కొందరు వ్యక్తుల్ని, వారి మాటల్ని సంపూర్ణంగా నమ్మి టీమ్‌లోకి తీసుకుంటాం. అసోసియేట్ అవుతాం. కాని - ఇలాంటి నిర్ణయానికి ముందు చాలా ఆలోచించాలని అనుభవాలు చెబుతాయి. 

చాలామంది సీనియర్లు ఈ విషయం చెప్తే మనం వినం. పట్టించుకోం అసలు. 

ఒక ప్యానిండియా డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో ఇలాంటి ఒక విషయం చెప్పినప్పుడు నేను నవ్వుకున్నాను. ఈయనేదో చెప్తాడ్లే అని!  

"నా దగ్గరికి వెయ్యికోట్లు పెడతాను అని ఒక నిర్మాత వచ్చాడని నేను అతన్ని తీసుకోలేను. అతనిలో నేను డబ్బుకన్నా ముందు ఇంక చాలా విషయాలు చూస్తాను. సినిమా మీద నాకున్నంత ప్యాషన్ ఉండాలి. అతని మైండ్‌సెట్ నాకు కనెక్ట్ కావాలి. యాటిట్యూడ్ నచ్చాలి. రెండు నిమిషాలు మాట్లాడగానే అర్థమైపోతుంది, అతను నాకు కనెక్ట్ అవుతాడా లేదా అన్నది. సరిపోదు అనిపిస్తే వెంటనే సారీ చెప్పేస్తాను". 

ఇంక చాలా చెప్పాడు ఆ డైరెక్టర్. 

ముఖ్యంగా - వాళ్ళ మాటలకి చేతలకి మధ్య జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్న విషయం మాట్లాడుతున్నప్పుడు కనీసం వారికైనా తెలియాలి. 

అందుకే సీనియర్లు ఒకరికి ఛాన్స్ ఇచ్చే ముందు-లేదా-ఒకరితో అసోసియేట్ అయ్యేముందు చాలా టైమ్ తీసుకుంటారు. అందుకే వాళ్ళు నిలబడతారు. సక్సెస్ సాధిస్తుంటారు. సక్సెస్‌లో ఉంటారు. 

నా సినీ జర్నీలో కనీసం ఒక నాలుగుసార్లు ఇలాంటి ముఖ్యమైన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాను. ఇబ్బందుల్లో ఇరుక్కొన్నాను.

ఇక్కడ తప్పుపట్టాల్సింది ఆయా వ్యక్తులను కాదు. వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్లని మార్చలేం. మన నిర్ణయాలను తప్పు అనుకోవాలి. ఆ బాధ్యత మనమీదే వేసుకోవాలి. వారితో ఆ అనుభవాన్ని ఒక పాఠంగా గుర్తుపెట్టుకోవాలి. మన భవిష్యత్ నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. 

కట్ చేస్తే - 

ఇప్పుడు నేను ప్రయాణిస్తున్నది ఒక సిస్టమ్‌తో.
అలాంటి సిస్టమ్‌ను క్రియేట్ చేసిన ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్‌తో. 
సింప్లిసిటీని ఇష్టపడే ఒక అద్భుతమైన వ్యక్తితో. 

నా ఆత్మీయ మిత్రుడు, నా శ్రేయోభిలాషి, సీరియల్ ఎంట్రప్రెన్యూర్ అయిన ఆ వ్యక్తి గురించి ఒక బ్లాగ్ రెండురోజుల్లో పోస్ట్ చేస్తున్నాను. 

సో, ఇక్కడ విషయం ఏంటంటే - మన యాటిట్యూడ్ బాగున్నప్పుడు అన్నీ అవే కుదురుతాయి. బాగుంటాయి. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. అది సహజం.

కాని ఏదైనా సరే... "ఇది మన పని" అనుకొని చేస్తున్నప్పుడు ఏ ఇబ్బందులూ ఇబ్బంది పెట్టవు. అన్నీ బాగుంటాయి. 

మనకు నచ్చిన ఒక మంచి పాజిటివ్ వాతావరణంలో మనం పనిచేయడం అనేది చాలా ముఖ్యం. 

ఈ సమయంలో - ఈ నిర్ణయం నేను తీసుకొన్నందుకు నాకు నేనే కంగ్రాట్స్ చెప్పుకొంటున్నాను. 

No Regrets. No Negativity. Celebrate Life, Everyday!  

No comments:

Post a Comment