Thursday 21 April 2022

షో బిజినెస్‌లో షో ఎంతవరకు?


1991 లోనే 'గాడ్ ఫాదర్' డైరెక్టర్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ కోప్పలా ఒక మాటన్నాడు... 

"ఇప్పుడు మనం ఇన్ని కెమెరాలు, ఇంత లైటింగ్, ఇంత ఎక్విప్ంట్‌తో , ఇంతమంది స్టార్స్‌తో, ఇంత పెద్ద టీమ్‌తో ఎంతో ప్లాన్ చేసుకొని ఇలా సినిమాలు తీస్తున్నాం. కాని, ఒకరోజు వస్తుంది... ఒక చిన్న అమ్మాయి, ఇంట్లో మూలనపడి ఉన్న వాళ్ల డాడీ తాలూకు చిన్న వీడియో కెమెరాతో చాలా ఈజీగా ఒక అద్భుతమైన సినిమా తీసినా ఆశ్చర్యం లేదు!" 

ఆరోజు వచ్చేసింది. 

ఒక 3 లక్షలు పెడితే జేబులో పట్టే కెమెరాలు రెండు వస్తాయి. కోట్లరూపాయలు ఖరీదు చేసే భారీ కెమెరాలతో వచ్చే రెజొల్యూషన్, క్వాలిటీ వగైరా ఈ కెమెరాల్లో కూడా వస్తుంది. 

కాని, ఫిలిం ఇండస్ట్రీలో ఉండే హిపోక్రసీకి ఏదైనా భారీగానే కనిపించాలి. షో బిజినెస్ అన్నమాట! 

అంతవరకైతే ఓకే.

కాని, మధ్యలో ఉండే కొందరు పనిలేని వ్యక్తులు ఇలాంటి కొన్ని ఫార్మాలిటీస్ క్రియేట్ అవ్వటానికి కారణమవుతారు.

ఫలానా ఫలానా కెమెరాలతో తీస్తేనే ఓటీటీ వాళ్ళు తీసుకుంటారు అని... శాటిలైట్ రైట్స్ అమ్మాలన్నా, థియేటర్ రిలీజ్‌కి సినిమా ప్రమోట్ చెయ్యాలన్నా సో అండ్ సో కెమెరాలే వాడాలని రూల్స్ క్రియేట్ చేస్తారు. లాజిక్ లేని ఆ రూల్సే నడుస్తుంటాయి. 

లాజిక్స్ ఎవరైనా మాట్లాడాలంటే భయం... ఎవరు పుల్లేస్తే ఎక్కడ సినిమా ఆగిపోతుందో అని!  

కట్ చేస్తే - 

ఐఫోన్‌తో మొత్తం ఫీచర్ ఫిలిం షూట్ చేసి, అందులోనే ఎడిట్ చేసి, సినిమాల్ని రిలీజ్ చేస్తున్న రోజులివి.

షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ రిలీజులు కాదు నేను చెప్తున్నది... 

ఇలా తీసిన మైక్రో బడ్జెట్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్‌లో పోటీపడుతున్నాయి. అవార్డులు సాధిస్తున్నాయి. 

వందల కోట్లు కొల్లగొడుతున్న కె జి ఎఫ్-2 సినిమా ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి 17 ఏళ్ళప్పుడే ఆ సినిమా ఎడిటర్‌గా చేరాడు. ఇప్పుడతనికి 20 నడుస్తున్నాయి. 

ఒకవైపు ఈ స్థాయిలో మార్పులు ఇండస్ట్రీలో చూస్తున్నాం. మరోవైపు కెమెరాలు, ఎక్విప్‌మెంట్ విషయంలో పనికిరాని హిపోక్రసీ కూడా చూస్తున్నాం. 

అయితే - ఇండిపెండెంట్ సినిమాలు, చిన్న బడ్జెట్ సినిమాల దగ్గరికి వచ్చేటప్పటికే ఇలాంటి ఎక్కడలేని రూల్స్ పుట్టుకొస్తాయన్నది మాత్రం ఎవ్వరూ కాదనలేని నిజం.  

సినిమాల ఓపెనింగ్స్‌లోనో, వాటి ప్రి-రిలీజ్ ఫంక్షన్స్‌లోనో, చానల్స్ ఇంటర్వ్యూల్లోనో హిపోక్రసీ అంటే ఓకే. "షో బిజినెస్ కదా... అలాగే మాట్లాడతారు" అని అందరికీ అలవాటైపోయింది.

కాని, మేకింగ్ దగ్గర కూడా ఈ షో అవసరమా?      

10 comments:

  1. >>ఇండిపెండెంట్ సినిమాలు, చిన్న బడ్జెట్ సినిమాల దగ్గరికి వచ్చేటప్పటికే ఇలాంటి ఎక్కడలేని రూల్స్ పుట్టుకొస్తాయన్నది మాత్రం ఎవ్వరూ కాదనలేని నిజం.

    100% true

    ReplyDelete
  2. గోప్రో కెమేరాతో మూవీ తియ్యలనుకున్నాం. అప్పుడు ఒక ఓటిటి కంపెనీవాల్లు చెప్పింది "కెమేరానిబట్టి పేమెంట్ ఫిక్స్ చేస్తాం" అని. విచిత్రంగా కంటెంట్ గురించి డిస్కషనే రాలేదు. ఓటీటీ కి గోప్రో చాలా ఎక్కువ.

    ReplyDelete
    Replies
    1. ఇదంతా ఈ మధ్యలో ఉందే బేకార్ గాళ్ళ క్రియేటివిటీ. అసలీ విషయం మీరు చెప్పొద్దు. ఇలాంటివాళ్ల కోసం - ఒక రోజు రెడ్ ఎపిక్/డ్రాగన్ లాంటి కెమెరా తీసుకొని, దాన్ని సీన్‌లో పెట్టి, ఒక 2 గంటల వర్కింగ్ వీడియో తీసిపెట్టుకోవాలి. (అంటే కనీసం ఒక 20 సీన్స్/కాస్ట్యూమ్స్ మారాలి... డిఫరెంట్ ఫ్రేంస్‌లో!).

      ఇదంతా ఒక 20 వీడియో బైట్స్‌గా చూపించాలి. ఇదీ కథ. చేయండి ఏం కాదు...

      మా ఫిలిం ప్రొడక్షన్ కార్పొరేట్ ఆఫీస్ మే/జూన్‌లో ప్రారంభిస్తున్నాం. మీకు మార్కెట్ చేయించిపెడతా. నో వర్రీ... All the best!

      Delete
  3. >>క రోజు రెడ్ ఎపిక్/డ్రాగన్ లాంటి కెమెరా తీసుకొని, దాన్ని సీన్‌లో పెట్టి, ఒక 2 గంటల వర్కింగ్ వీడియో తీసిపెట్టుకోవాలి.

    :)

    బకారాగాడేం కాదులేండి. ఇప్పుడున్న టాప్ 3 ప్లాట్‌ఫాంస్ లో ఒక దాన్లో కీరోల్.

    >>మా ఫిలిం ప్రొడక్షన్ కార్పొరేట్ ఆఫీస్ మే/జూన్‌లో ప్రారంభిస్తున్నాం. మీకు మార్కెట్ చేయించిపెడతా.

    రెడీఅవ్వగానే చెప్పండి. నాదగ్గరకు మార్కెటింగ్‌కోసం రెగ్యులర్‌గానే వస్తుంటారు. I will refer them to you

    ReplyDelete
    Replies
    1. Thank you.

      అదృష్టవశాత్తు నాకా అవసరం లేదు. We've our own people in different places and doing already. :-) Will surely contact you if needed.

      Delete
    2. Chiru Dreams, plz leave me your number. I will contact you if needed. My number is all over the blog & in many of my posts: 9989578125. :-)

      Delete
    3. I shared your number in my circle. If anyone mentioned my name, my name is Chiranjeevi. You will start to get calls in 2-3 days.

      Delete
    4. I called you yesterday evening. You didn't take call. I am buzzing you on whatsapp now. Please check

      Delete
  4. Chiru wanted to give Business to you and you are refusing it. I dont understand your Logic.

    ReplyDelete
    Replies
    1. Plz check all comments above. You understand what I said in what context. :-) Thanks.

      Delete