Tuesday 12 April 2022

ఒక కమిట్‌మెంట్... 100,900 ట్వీట్స్!


మీరు ట్విట్టర్‌లో ఉన్నారా? 
ఎప్పటి నుంచి ఉన్నారు? 
రోజుకి ఎన్ని ట్వీట్స్ చేస్తుంటారు మామూలుగా? 
ఇప్పటికి మొత్తం ఒక 10 వేల ట్వీట్స్ పెట్టారా?   

ప్రపంచవ్యాప్తంగా ఒక రెండున్నర కోట్ల మంది భారతీయులు ట్విట్టర్ ఉపయోగిస్తున్నారు. 

వీరిలో ట్విట్టర్ అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. 2009 నుంచి ఆయన పోస్ట్ చేసిన ట్వీట్స్ సంఖ్య కేవలం 11,400 మాత్రమే. 

సెలబ్రిటీల్లో, 2010 నుంచి ట్వీట్ చేస్తున్న 'బిగ్ బి' అమితాబ్ బచ్చన్ మాత్రం ఇప్పటివరకు రికార్డ్ స్థాయిలో 68,700 ట్వీట్స్ పోస్ట్ చేశారు. కాని, ఈ అంకె చేరుకోడానికి అమితాబ్ బచ్చన్‌కు 12 ఏళ్ళు పట్టిందన్న విషయం మనం గమనించాలి. 

2009 నుంచి, తన సోషల్ మీడియా కోసం ప్రత్యేకంగా స్పెషలిస్టులైన సిబ్బందిని పెట్టుకొని మరీ ట్వీట్ చేస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్రమోది ఇప్పటివరకు పోస్ట్ చేసిన ట్వీట్స్ సంఖ్య కేవలం 32,400 మాత్రమే.  

ప్రపంచస్థాయి కుబేరుల్లో ఒకడైన ఈలన్ మస్క్ కూడా ఎప్పుడు చూసినా ట్విట్టర్లోనే ఉంటాడు. 2009 నుంచి ఇతను పోస్ట్ చేసిన ట్వీట్స్ సంఖ్య 17,300 మాత్రమే.   

నేను 2009 లోనే ట్విట్టర్ ఎకౌంట్ ఓపెన్ చేశాను కాని, పెద్దగా ఉపయోగించలేదు. ఫేస్‌బుక్ మీద బోర్ కొట్టినతర్వాత, ఈ మధ్యే ట్విట్టర్లో  కూడా రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తున్నాను. నా ట్వీట్స్ సంఖ్య కూడా ఇంకా 20K దాటలేదు.        

కట్ చేస్తే -  

మొన్నొకరోజు నా ట్విట్టర్ ఫీడ్‌లో కనిపించిన ఒక మిత్రుని ట్వీట్ చూసి అటువైపు వెళ్లాను. అనుకోకుండా నా దృష్టి అతని ప్రొఫైల్ మీదున్న ట్వీట్స్ అంకె మీద పడింది.     

షాక్...

100,900 ట్వీట్లు! 

రెఫ్రెష్ చేసి చూశాను. సేమ్... 100.9K ట్వీట్స్.  

నా స్టడీ ప్రకారం - ప్రపంచస్థాయిలో, ఇప్పటివరకు లక్ష ట్వీట్స్‌కు లైక్స్ కొట్టినవాళ్ళు ఉన్నారు గాని,  లక్ష ట్వీట్స్‌ పోస్ట్ చేసిన ట్విట్టర్ ప్రియులు కేవలం వేళ్లమీద లెక్కించే అంత మంది మాత్రమే ఉన్నారు. 

ఇండియా నుంచి గాని, ప్రవాస భారతీయుల్లో గాని ఈ "లక్ష ట్వీట్స్" మైలురాయిని హిట్ చేసినవాళ్ళు మాత్రం... ఇప్పటివరకు ఒక్కరు కూడా లేరు!  

ఈ అద్భుత రికార్డ్ సాధించిన మిత్రుడు మరెవరో కాదు... భువనగిరి నవీన్. 


నవీన్ గురించి నేను ఇంతకుముందు నా బ్లాగ్‌లో రాశాను... 

నవీన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. 2020 ఫిబ్రవరి వరకు, లండన్ టెక్ మహేంద్రలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేశాడు. ఇప్పుడు అదే లండన్‌లో సొంతంగా "బీవీఆర్ టెక్" పేరుతో కంపెనీ స్థాపించి, ఇండిపెండెంట్ కన్‌సల్టెన్సీ చేస్తున్నాడు. 

భార్య ప్రవల్లిక లండన్‌లోనే డెంటల్ కేర్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తోంది. వాళ్ళిద్దరికీ ఒక పాప – వైష్ణవి, ఒక బాబు – జైశ్రీరామ్. 

సూర్యాపేటకు దగ్గర్లో ఉన్న అడివెంల గ్రామంలో, వాళ్ల అమ్మమ్మ గారింట్లో పుట్టాడు నవీన్. ఖమ్మం జిల్లా పాల్వంచలో డీఏవీ, నవభారత్ స్కూళ్లలో చదువుకున్నాడు. పాల్వంచలోనే యాడమ్స్ ఇంజినీరింగ్ కాలేజిలో బీటెక్ చేశాడు.  


కేసీఆర్ అభిమాని. 

ఇంటికి దూరంగా, సుమారు 7700 కిలోమీటర్ల దూరంలో యూకేలో ఎంత బిజీగా ఉంటున్నా కూడా – ఇక్కడి నేలమీద మమకారం ఎక్కువ నవీన్‌కు. తనకిష్టమైన ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం, టీఆరెస్ పార్టీకోసం నిరంతరం సోషల్‌మీడియాలో పిచ్చి యాక్టివ్‌గా పనిచేస్తుంటాడు నవీన్. 

ఇప్పుడు లండన్‌లో తను చేస్తున్న ఐటి రిలేటెడ్ కన్సల్టెన్సీతో పాటు, NRI-TRS-UK లండన్ ఇంచార్జిగా కూడా పనిచేస్తున్నాడు నవీన్. దీంతోపాటు, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూకే (TAUK) ఈవెంట్స్ సెక్రెటరీగా కూడా, అసోసియేషన్ కార్యకలాపాల్లో యాక్టివ్‌గా పాల్గొంటాడు నవీన్.

ఒక స్థాయిలో స్థిరపడ్డ తర్వాత నవీన్‌కు రాజకీయాల్లోకి రావాలని ఉంది కానీ, ప్రత్యక్ష రాజకీయాలు మాత్రం కాదు.


ఒక ఎంట్రప్రెన్యూర్‌గా, భర్తగా, తండ్రిగా, కొడుకుగా తన బాధ్యతలు సంపూర్ణంగా నిర్వహిస్తూనే - సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్‌గా ఉండటం అంత సులభమైన పని కాదు. 

2018 నుంచి, కేవలం నాలుగేళ్ళలో ట్విట్టర్‌లో 100,900 ట్వీట్స్‌తో రికార్డ్ సృష్టించడం అంటే నిజంగా ఒక అద్భుతమే. 

ఈ ట్వీట్స్ అన్నీ ఏవో సినిమా టిడ్‌బిట్సో, పనికిరాని సొంత కవిత్వమో కాదు...

అచ్చంగా తెలంగాణ కోసం, కేసీఆర్ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం... ఎప్పటికప్పుడు వివిధరకాల న్యూస్ సోర్సుల నుంచి తాను చదివి, చూసి తెలుసుకున్న సమాచారం అదంతా.  

ఒక నిబద్ధతతో చేసే యజ్ఞం లాంటి ఈ పనిని, తన సంపూర్ణ ఇష్టంతో, వాలంటరీగా చేస్తున్నాడు... నవీన్. 

"2018 ఎలక్షన్స్ నిజంగా ఒక మర్చిపోలేని అనుభవం. అప్పుడు, తెలంగాణాలోని అన్ని నియోజకవర్గాల కోసం ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా లెక్కలేనన్ని పోస్టులు పెట్టాను. కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆరెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు మొదలైనవాటి గురించి ప్రజలందరికి ఎఫెక్టివ్‌గా తెలిసేలా... చిన్న బ్రేక్ కూడా తీసుకోకుండా... ప్రతిరోజూ సోషల్ మీడియా పవర్‌ను ఎంతవరకు ఉపయోగించుకోవచ్చో అదంతా చేశాను. దీన్ని శ్రమ అని ఎప్పుడూ నేను అనుకోలేదు" అని, నేనడిగిన ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పాడు నవీన్.  


నేనీ బ్లాగ్ రాయడానికి కారణం నవీన్ పోస్ట్ చేసిన 100,900 ట్వీట్స్ అంకె ఒక్కటే కాదు...

తను పుట్టిన గడ్డ తెలంగాణ కోసం... తనకిష్టమైన నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం. ఆయన స్ఠాపించిన పార్టీ తెరాస కోసం... తన చేతనైనంతలో ఏదైనా చేస్తూ ఉండాలని నవీన్‌లో నాకు కనిపించిన తపన.   

ఎంతో గొప్ప కమిట్‌మెంట్ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు.  

ఆ కమిట్‌మెంట్ నవీన్‌లో ఉంది. 

ట్విట్టర్‌లో లక్ష ట్వీట్స్ రికార్డ్ మైలురాయి దాటి, రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తున్న మన భువనగిరి నవీన్‌కు ఈ సందర్భంగా నా హార్దిక అభినందనలు.  

4 comments:

  1. ఈ రోజు పేపర్ లో కే సి ఆర్ గారు ప్రశాంత్ కిషోర్ గారితో భేటీ అయినట్లు చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. కే సి ఆర్ గారికి కూడా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు అవసరమా ? పార్టీ అంత దయనీయ స్థితిలో ఉందా ? తెలియపరచగలరు.

    ReplyDelete
    Replies
    1. నా ఉద్దేశ్యం ప్రకారం కూడా కేసీఆర్ గారికి ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్టుల అవసరం లేదు. ఇక పార్టీ భేషుగ్గా ఉంది. ఇవ్వాళ 21 వసంతాల ప్లీనరీ జరుపుకొంటోంది.

      రాజకీయాల్లో లోపల్లోపల చాలా జరుగుతుంటాయి. కొన్ని లోపలి విషయాలు తెలిసినా మనం నమ్మలేం. ప్రశాంత్ కిషోర్ కేసీఆర్‌తో ఎందుకు పనిచేస్తున్నాడు... కాంగ్రెస్ ఆహ్వానాన్ని ఎందుకు తిరస్కరించాడు... మొన్న ఢిల్లీలో ఏ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిశారు... అసలు మొత్తంగా ఎవరెవరు ఏ లక్ష్యం కోసం పనిచేస్తున్నారు... బయటికి ప్రొజెక్ట్ చేస్తున్నది ఏంటి... ఇవన్నీ చాలా ఉంటాయి. తర్వాత్తరువాత అవే బయటపడి మనమే ఆశ్చర్యపోతాం. :-)

      Delete