Thursday 17 March 2022

మ్యాటర్ ఎప్పుడూ ఫీల్డు కాదు, మన మైండ్‌సెట్!

"మా వాడు చదువుకోవట్లేదు. ఉద్యోగం చేయడు. బిజినెస్ చేయలేడు. ఏ పనీ చేతకాదు. ఎందుకూ పనికిరాడు... కొంచెం నీ దగ్గర డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పెట్టుకో!"

ఒకరోజు పొద్దున్నే గురువుగారు దాసరిగారికి కాల్ చేసి అలా అడిగాట్ట ఆయన స్నేహితుడు! 

బయటివాళ్ల దృష్టిలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అంటే మరీ అంత పనికిరానిదన్నమాట...

ఈ జోక్‌ని స్వయంగా గురువుగారు, దర్శకరత్న దాసరి నారాయణరావుగారు అప్పటి తన బంజారాహిల్స్ ఆఫీసులో నాతో చెప్పారు.

ఒక్క డైరెక్షన్ డిపార్ట్‌మెంటే కాదు. టోటల్‌గా సినీఫీల్డులో పనిచేసేవారంతా ఎందుకూ పనికిరానివాళ్లని ఇతర ఫీల్డులవాళ్ల అభిప్రాయం. 

"చదువుకోవడం చేతకానివాళ్లంతా సినీఫీల్డంటారు!" అని కూడా అంటారు కొంతమంది. 

"అబ్బో సినిమావాళ్లా!" అంటారు కొందరు. మిగిలినవాళ్లంతా ఏదో సొక్కమైనట్టు. వీళ్లేదో చేయరాని పని చేస్తున్నట్టు.

సరే, ఎవరు ఎలా అనుకున్నా ఏం ఫరవాలేదు. "మ్యాటర్ ఎప్పుడూ ఫీల్డు కాదు. మన మైండ్‌సెట్" అనేది కామన్‌సెన్స్.

అయితే మన ప్యాషన్‌తో, మన ప్రొఫెషన్‌తో అవతలి వాళ్లను ఎంత చిన్నస్థాయిలోనయినా సరే ఇబ్బంది పెట్టకూడదు అనేది సినీఫీల్డులో ఉన్న ఎవరైనా విధిగా గుర్తుపెట్టుకోవాల్సిన మరొక కామన్ సెన్స్, మొట్టమొదటి రూల్ కూడా.

కానీ, అప్పుడప్పుడూ ఇది మిస్ అవుతుంటుంది.

ముఖ్యంగా డబ్బు విషయంలో. ఇంకా కొన్ని వ్యక్తిగత ప్రామిస్‌ల విషయంలో. 

తాడిచెట్టు కిందకి వెళ్లినప్పుడు అక్కడ తాగాల్సింది కల్లు. పాలు తాగుతానంటే కుదరదు. చూస్తుంటే జీవితం జస్ట్ అలా చేజారిపోతుంది.

ఫీల్డుది కాదు తప్పు. 

మన కామన్ సెన్స్, మన నిర్ణయాల తప్పే ఎక్కువగా ఉంటుంది.  

బయటికి క్రియేటివిటీ అని, తపస్సు అనీ, ప్యాషన్ అనీ ఎందరో ఎన్నో మాస్కులు వేసుకోవచ్చు. ఒక జాబ్‌లా, ఒక మంచి ఆదాయమార్గంగా, ఒక బిజినెస్‌లా తీసుకున్నప్పుడు మాత్రమే ఏ గొడవా ఉండదు.

బై డిఫాల్ట్... ఫీల్డుకున్న గ్లామర్, సెలెబ్ స్టేటస్ ఎలాగూ ఒక డ్రైవ్‌లా ఎప్పుడూ పనిచేస్తాయి. 

కట్ చేస్తే - 

సినిమా ఇప్పుడొక బిగ్ బిజినెస్. 

స్పెషల్ అప్పియరెన్స్‌లాగా ఎప్పుడో పుష్కరానికో సినిమా కాదు. చిన్నదో, పెద్దదో... ఎప్పుడూ ఏదో ఒక సినిమా చేస్తూ ట్రాక్‌లో ఉండటం చాలా ముఖ్యం.  

మిగిలినవన్నీ అవే ఫాలో అవుతాయి...

And don't forget...
Cinema can fill in the
empty spaces of your life
and your loneliness!

2 comments:

  1. >>బయటికి క్రియేటివిటీ అని, తపస్సు అనీ, ప్యాషన్ అనీ ఎందరో ఎన్నో మాస్కులు వేసుకోవచ్చు. ఒక జాబ్‌లా, ఒక మంచి ఆదాయమార్గంగా, ఒక బిజినెస్‌లా తీసుకున్నప్పుడు మాత్రమే ఏ గొడవా ఉండదు

    Perfect

    ReplyDelete