Saturday 5 March 2022

సాధించగలిగేవాడికి అదొక మెకన్నాస్ గోల్డ్!

సినిమా పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు... ఎన్నడూ లేనన్ని అవకాశాలు ఇప్పుడు కొత్తవారికి ఉన్నాయి. 

తను ఎన్నుకున్న విభాగంలో ఏ కొంచెం స్పార్క్ ఉన్నా, సిన్సియర్‌గా... 'కొంచెం స్మార్ట్‌'గా... ప్రయత్నిస్తే - ప్రతి ఒక్కరికీ తప్పకుండా ఆ 'ఒక్క చాన్స్' దొరుకుతుంది. 

ఆ తర్వాత దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారు... ఆ మొదటి చాన్స్‌తో మరిన్ని అవకాశాలు ఎలా సంపాదించుకొంటారు, ఆ తర్వాత కూడా ఫీల్డులో ఎలా కొనసాగుతారు... వంటివన్నీ ఒక్కొక్కరి పర్సనల్ టాలెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. 

నెట్‌వర్కింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, పాజిటివ్ యాటిట్యూడ్, ఏది ఏమైనా సరే అనుకున్న లక్ష్యం నుంచి ఫోకస్ మరల్చకపోవడం... వంటి కొన్ని బేసిక్ లక్షణాలు అందరికీ ఒకలా ఉండవు. 

నిజానికి, 99 శాతం మందికి ఈ లక్షణాలు అసలుండవు. 

కాని, ఇవే ఏ ఫీల్డులో అయినా పైకిరావడానికి చాలా ముఖ్యం. 

సినీ ఫీల్డులో మరీ ముఖ్యం.   

ఈ లక్షణాలన్నీ ఎంతో కొంత ఉండే ఆ ఒక్క శాతం మంది మాత్రమే విన్నర్స్ అవుతారు. వీరిలో కొంతమంది... కనీసం ఆ ట్రాక్‌లోనైనా ఉంటారు. 

ఆ 1% క్లబ్‌లో చేరగల సత్తా ఉన్నవారే అనుకున్నది సాధించగలుగుతారు. ఆ ప్రయత్నంలో పడిపోయినా మళ్ళీ లేస్తారు. లక్ష్యం సాధిస్తారు. గమ్యం చేరుకుంటారు. 

ఒక్క సినిమా ఫీల్డు అనే కాదు... ఏ ఫీల్డులో అయినా సరే, విన్నర్స్ ఎప్పుడూ ఆ 1% క్లబ్‌లోనే ఉంటారు. 

కట్ చేస్తే - 

థాంక్స్ టు కరోనా... ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు చాలా పెరిగాయి. ఒక్క కొత్తవారికనే కాదు. ప్రతి ఒక్కరికీ అవకాశాలు పెరిగాయి. 

ఉదా: ఓటీటీలు, వెబ్ సీరీస్‌లు. 

రెమ్యూనరేషన్స్ పరంగా కూడా... ఒకప్పుడు వేలల్లో ఉన్నవి ఇప్పుడు లక్షల్లోకి చేరుకున్నాయి.. లక్షల్లో ఉండేవి ఇప్పుడు కోట్లల్లోకి ఎగిశాయి. 

పూర్తిగా రెండేళ్ళపాటు అన్నిరకాలుగా అందరినీ బాధపెట్టిన కరోనా కూడా దాదాపు చల్లబడింది కాబట్టి ఇంక ఎవ్వరికీ ఎలాంటి సంకోచాలు, ఆటంకాలు ఉండే అవకాశం లేదు. ఇప్పుడు కూడా దీన్ని ఒక కారణంగా, సాకుగా చెప్పుకొనే సౌకర్యం లేదు. 

సో, ఈ విషయంలో దాదాపు ఆల్ క్లియర్ అన్నట్టే. 

ఇంతకు ముందు సినిమాలు వేరు, ఇప్పుడు సినిమాలు వేరు.

Content is king. Money is the ultimate goal. 

ఈ మార్చి 11 నాడు రిలీజవుతున్న ప్రభాస్ "రాధే శ్యామ్" సినిమా, ఒక్క అమెరికాలోనే 1000 కి పైగా లొకేషన్స్‌లో, 3000 లకు పైగా స్క్రీన్స్‌లో రిలీజవుతోంది! మొత్తం ఒక 11,500 లకు పైగా షోలు వేస్తున్నారు!

ఇండియాలో, హిందీతో కలిపి మొత్తం 5 భాషల్లో దేశవ్యాప్తంగా రిలీజవుతోంది.

సినిమా ఫీల్డంటే... ఇప్పుడు, ఒక భారీ కార్పొరేట్ బిజినెస్. 

ఓవర్‌నైట్‌లో సెలబ్రిటీ స్టేటస్ తెచ్చిపెట్టగల ఒక పోష్ ప్రొఫెషన్. 

సరిగ్గా ఉపయోగించుకోగలిగిన అతి కొద్దిమందికి... ఒక ఎలైట్ వరల్డ్.  

ఓటీటీల్లో రెగ్యులర్‌గా సినిమాలు, వెబ్ సీరీస్‌లు చూడ్డం అనేది కూడా ఇప్పుడు దాదాపు ప్రతి ఇంటా ఒక మామూలు రొటీన్ అయిపోయిన నేపథ్యంలో చాలా విషయాలు అందరికీ తెలుస్తున్నాయి.

థాంక్స్ టు సోషల్ మీడియా... ఫిలిం ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ఇతర సెలెబ్స్ అంతా మరింత దగ్గరైపోయారు. 

చాలా విషయాల్లో అందరూ రియలైజ్ అవుతున్నారు. చాలా విషయాలు అందరికీ  అవగాహనకొస్తున్నాయి. 

'థంబ్‌నెయిల్ బ్యాచ్' ల ఫేక్ కంటెంట్ ఏంటి, రియాలిటీస్ ఏంటి అన్నది చాలామంది తెలుసుకోగలుగుతున్నారు. 

ఈ నేపథ్యంలో... సినిమాల పట్ల, సినీఫీల్డు పట్ల చాలామందిలో ఒకప్పటి దృక్పథాలు చాలా చాలా మారిపోయాయి.    

సినిమాల్లోకి ప్రవేశించడానికి గాని, పంపించడానికి గాని ఇంతకుముందులా ఇప్పుడెవ్వరూ పెద్దగా సంకోచించట్లేదు. 

డబ్బు, క్రేజ్, పాపులారిటీ ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు?

ఇంత లీడ్ ఇస్తూ, చివరగా నేను చెప్పదల్చుకున్న ఫినిషింగ్ టచ్ ఏంటంటే - 

చాలామంది అంటుంటారు... "వాడు సినిమాల్లోకి వెళ్ళి చెడిపోయాడ్రా", "వాడు సినిమాలు తీసి మొత్తం పోగొట్టుకున్నాడ్రా" ఎట్సెట్రా, ఎట్సెట్రా. 

నిజానికి సినిమా ఫీల్డు ఎప్పుడూ మంచిదే. సాధించగలిగేవాడికి అదొక మెకన్నాస్ గోల్డ్. 

వాడుకున్నోనికి వాడుకున్నంత! 

ప్రతి ఫీల్డులో ఉండే రకరకాల నెగెటివిటీ ఇక్కడ కూడా ఉంటుంది. అయినా సరే, ఫోకస్ చెడకుండా జాగ్రత్తపడుతూ, ఈ ఫీల్డుని మన లక్ష్యం కోసం మనం ఎంత బాగా, ఎంత పాజిటివ్‌గా ఉపయోగించుకోగలుగుతాం అన్నదే అసలు పాయింట్.           

Be bold.
Either you will find a way,
or you will create a way.
But you will not create an excuse! 

18 comments:

  1. నాకొక సందేహం ఉంది కాస్త వివరిస్తారా?
    హీరో రెమ్యునరేషన్ దాదాపు 10 కోట్లు ఉంటుంది. ఓటిటి లో విడుదల చేస్తే మహా అయితే 30 కోట్లు (అమెజాన్ లాంటివి) ఇస్తారేమో ! ప్రొడ్యూసర్ కి లాభం ఏమిటి ? ఖర్చులు కూడా రావు కదా ? ఎందుకు ఓటిటి కి సినిమాలు ఇస్తున్నారు ?

    ReplyDelete
    Replies
    1. హీరో రెమ్యూనరేషన్ 10 కోట్లు ఉన్న సినిమాకు కనీసం ఇంకో 25 కోట్లు మేకింగ్‌కు అవుతుంది. మొత్తం ఒక 35 కోట్లు అయ్యిందనుకొంటే, ఓటీటీల్లో ఈ స్థాయి సినిమాలకు 60 నుంచి 70 కోట్ల వరకు మార్కెట్ అవుతోంది.

      ఓటీటీలో 35 కు 40 కోట్లు వచ్చినా ప్రొడ్యూసర్‌కు పెద్ద లాభమే. ఎందుకంటే, థియేటర్స్‌లో రిలీజ్ చేసినప్పుడు, సినిమా హిట్ అయితే మాత్రమే అన్ని డబ్బులొస్తాయి. అది చాలా అరుదుగా, కేవలం ఒక 2%-5% సినిమాలకు మాత్రమే జరిగే పని.

      సో, ఓటీటీల్లో ప్రొడ్యూసర్‌కు డబ్బులు ముందు చేతిలోకొస్తాయి.

      థియేటర్ రిలీజ్ విషయంలో అలా కాదు. బయ్యర్స్ కొనుక్కోవాలి. ఎవరూ కొనుక్కోకపోతే, ఇంకో 5 కోట్లు పెట్టి తనే స్వయంగా రిలీజ్ చేసుకోవాలి. భారీ హీరోలైతే తప్ప, ప్రొడ్యూసర్‌కు రిస్క్ చాలా ఉంటుంది.

      ఇక, మనం బయట చదివే బ్లాక్‌బస్టర్ రికార్డ్ కలెక్షన్స్ వంటి అంకెల్లో కూడా చాలావరకు నిజాలుండవు. ఆ అంకెల ప్రకారం చూసుకున్నా, చివరికి ప్రొడ్యూసర్ చేతికి వచ్చేది ఆ మొత్త కలెక్షన్లో ఒక 35% ఉంటే ఎక్కువ!

      (అమెజాన్ వాళ్లకు అంత రిటర్న్స్ ఎలా వస్తాయి అని మాత్రం అడక్కండి. అది ఒక పెద్ద గేమ్! దాని గురించి చిన్నగా రాయాలంటే కష్టం.)

      ఈ సమాచారం సరిపోతుందనుకుంటాను, మీ సందేహ నివృత్తికి... నీహారిక గారు!

      Delete
    2. పదికోట్లు తీసుకునే హీరోలకి ఓటిటీల్లో 25 కోట్లు ఇచ్చే వాల్యూ లేదు. మీరెక్కడో పొరపడ్డారు.

      Delete
    3. సుమారు 10 కోట్లు తీసుకుంటున్న హీరోలెవరో మీకు తెలుసు అనుకుంటాను. కొన్ని నెలల క్రితం, ఆ స్థాయి హీరో ఒకరి సినిమాకు 70 కోట్లు కూడా వచ్చింది. నేను మా సినిమా "ఇన్‌సైడర్ ట్రేడ్ న్యూస్" మీదనే ఆధారాపడతాను.

      హీరోల పేర్లు, సినిమాల పేర్లు నేను చెప్పకూడదు కాబట్టి మిగిలింది మీరే స్టడీ చేయండి.🙂👍 Thank you Chiru garu.

      Delete
  2. నీహారిక గారి సందేహం సబబైనదే. మీ వివరణ కూడా చక్కగా బాగుంది. కాకపోతే 10 కోట్లు అంటూ నీహారిక గారు తక్కువ అంచనా వేస్తున్నారేమో - ఈ కాలపు హీరోల రెమ్యూనరేషన్ చుక్కలు తాకుతుంటుందని వినవస్తుంటుంది.

    సరే, నీహారిక గారి సందేహం, మీ జవాబు సీరియస్ అంశాలు లెండి గానీ సరదాగా నేనో ప్రశ్న అడుగుతాను 🙂, ఆ రంగం వ్యక్తి కాబట్టి మీకు తెలిసిన మేరకు చెప్పండి (that is, *మీకు అభ్యంతరం లేకపోతే నే సుమండీ* 🙂), థాంక్స్ 👇.
    ——————-
    మహేష్ బాబు నటించిన “అతడు” సినిమాలో కాంట్రాక్ట్ హత్యలు (సుపారీ అనాలేమో?) చేసే ఓ వ్యక్తిని .. పట్టుబడిన తరువాత .. సిబిఐ ఆఫీసర్ పాత్ర ప్రకాష్ రాజ్ అడుగుతాడు హత్య చెయ్యడానికి ఎంత డబ్బు తీసుకుంటారు అని. కోటి, కోటిన్నర లాంటి జవాబు వస్తుంది. ముందు ఆశ్చర్యపోయి, తరువాత తేరుకుని అంత డబ్బు ఎక్కడ దాస్తారు అని తిరిగి ప్రకాష్ రాజ్ ప్రశ్న వేస్తాడు 🙂. ఆ సీన్ మీకు తెలుసుగా?

    ఇప్పుడు నా సందేహం కూడా అదే 👆- వృత్తి వేరయినా 🙂 రెమ్యూనరేషన్ గా అన్నేసి కోట్లు తీసుకునే సినిమా హీరోలు (దర్శకులు కూడా) ఆ డబ్బుని ఎక్కడ దాస్తారు అని (ముఖ్యంగా దాంట్లో అధిక శాతం నలుపే అని అనుకుంటున్నాను?) ?? 🙂🙂

    ReplyDelete
    Replies
    1. ఒక్క సినిమావాళ్లే కాదండి రావు గారు... అంతంత సంపాదించేవాళ్ళు ఇతర ఫీల్డుల్లో, వ్యాపారాల్లో కూడా చాలామంది ఉంటారు. అయితే - అదంతా నలుపా, తెలుపా, ఎక్కడ దాస్తారు, ఏం చేస్తారు అన్న విషయంలో నేనేం చెప్పలేను మీకు. అది పూర్తిగా నా పరిధిలో లేని అంశం.

      'నలుపు' గురించి ఇంత బాహాటంగా అడిగిన మీకు ధన్యవాదాలు.🙏🙂

      Delete
    2. చాకచక్యంగా, లౌక్యంగా జవాబు ఇచ్చారు 👌🙂, ఎంతైనా రచయిత కదా 🙂. Thanks anyway 🙂.

      “నలుపు” గురించి “బాహాటంగా“ ఈనాడు నేను అడిగేదేముంది మనోహర్ గారూ, అది జగమెరిగిన సత్యం - cash bill ఇవ్వకుండా Estimate / Quotation అంటూ ఓ కాగితం ముక్క ఇచ్చే హార్డ్-వేర్ వ్యాపారులు, పక్కా బిల్ కావాలంటే టాక్స్ పడుతుంది అని తప్పించుకునే ఇతర వ్యాపారులు, మా కంపెనీలో ఆడిట్ జరుగుతోంది కాబట్టి ప్రస్తుతానికి అసలు బిల్లే ఇవ్వలేం అన్న ఓ ప్రముఖ కంపెనీ వారి షాపు (నా స్వానుభవం), 50:50 దాటి ఇప్పుడు 60:40 అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు … అబ్బో, ఎన్నెన్ని రకాలు, మీకు తెలియనిదా ? మరి సినిమావాళ్ళేమన్నా మినహాయింపా, వాళ్ళూ మానవమాత్రులేగా పాపం?

      అయినా నేను “అధిక శాతం” అన్నానే గానీ. ఎంత శాతం అని అడగలేదుగా 🙂🙂.

      సరే, ఎవరి మార్గాలు / జాగ్రత్తలు / గుంభనలు వారికుంటాయి లెండి, అది సహజమే 😉.

      పైగా Black is beautiful అన్నారు కూడా 🙂 - fairness cream లు అమ్ముకునే కంపెనీలు ఒప్పుకోరేమో గానీ.

      Delete
    3. Agree with you totally Rao garu! Yes, black is not only beautiful, but also much effective too!

      Thanks for your comments.

      By the way -
      మనలో మాట... మీదైనా సరే, మీకు తెలిసినవారిదైనా సరే... బ్లాక్ ఐనా ఓకే, వైట్ అయినా ఓకే... నాక్కొంత అడ్జస్ట్ చెయ్యండి, ఒక సంవత్సరానికి మాత్రమే. ఆర్జీవీలా నేను సొంతంగా ఒక భారీ ప్రొడక్షన్ హౌజ్ పెట్టే పనుల్లో బిజీగా ఉన్నాను. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసే దానితో పోల్చినా కొంత ఎక్కువే నానుంచి లాభాలుంటాయి మీకు. మిగిలిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకుందాం. ఇది సీరియస్‌గానే రాస్తున్నానండి, రావు గారు! నా నంబర్ పక్కనే నా "About Me" లో ఉంటుంది. ఒక్క వాట్సాప్ చెయ్యండి. నేనే మీకు కాల్ చేస్తాను.

      ధన్యవాదాలు!🙏🙂

      Delete
  3. బ్లాక్ మనీ ఎలాదాచుకోవాలో అర్ధంకాక.. ఇండైరెక్టుగా మీ సలహా అడిగారు. ఫిల్మ్ లో ఇన్వెస్ట్ చెయ్యమని చెప్పండి.

    ReplyDelete
    Replies
    1. పైన రావు గారిని ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాను.

      మీకు కూడా అదే నా రిక్వెస్టు! మీరు కాకపోతే, ఇంట్రెస్ట్ ఉన్న ఇంకొకరెవరినైనా కనెక్ట్ చెయ్యండి. అఫీషియల్‌గా మీకు వచ్చేది మీక్కూడా వస్తుంది. 😊👍

      If you wanna discuss anything more on this, plz ping me on my number given in my "About Me" on the blog. I will get back to you.

      Thanks for your comments, Chiru garu.

      Delete
    2. అల్రెడీ మీ డిటైల్స్ కొందరు నిర్మాతలకి పంపించేశాను. నాకు కమీషన్ వద్దులేండి. మీ క్రియేటివిటీ కి సరైన వేదిక దొరకితే చాలు..

      Delete
    3. నిర్మాతలకా?!... మీ ప్రయత్నం వృధా.

      కొత్తగా ఈ వైపు రావాలన్న ఆసక్తి వున్నవాళ్లయితే ఓకే.

      Anyways, thanks a bunch for your initiative to help me, Chiru Dreams gaaru!😊👍

      Delete
  4. @VNR గారు,
    అంబానీ ఎక్కడ దాస్తాడంటారు ?
    For example కి 10 కోట్లు అన్నాను కానీ సమంతా కే 10 కోట్లు ఇస్తారంట. మేము టాక్స్ లు కడుతున్నాం అంటున్నారుగా...white అయినట్లే. ఇంద్రభవనం లాంటి ఇళ్ళు కట్టుకుంటే ఎక్కడ మిగులుతాయి ? వాటిని చూసుకోడానికి ఎక్కడలేని ఖర్చులు సరిపోవు. మహేష్ బాబు ఇల్లు, అల్లు అర్జున్ ఇల్లు నెట్ లో దొరుకుతాయి.చూడండి. ఎంత చెట్టుకి అంత గాలి.

    సల్మాన్ ఖాన్ ఒక్కడే తన రెమ్యునరేషన్ లో 10 శాతం మాత్రం ఉంచుకుని, టాక్స్ లు కట్టగా మిగిలింది మొత్తం దానం చేసేస్తారు. రతన్ టాటా కూడా దానం చేస్తారు కాబట్టి ప్రపంచ ధనికుల జాబితాలో ఆయన పేరు ఉండదు.

    ReplyDelete
    Replies
    1. Very true, నీహారిక గారు!

      ఎంత చెట్టుకి అంత గాలి.

      షారుఖ్ ఖాన్ కూడా ఇంకో విధంగా చాలా గ్రేట్. అసలతను రెమ్యూనరేషన్ ఒక్క పైసా తీసుకోడు! నమ్మలేం. కాని నిజం. ఆ డబ్బుని ఎంతైతే అంత... తను చెప్పిన చారిటీస్‌కు ఇమ్మని చెప్తాడు.

      తను ఎలా బ్రతుకుతాడు అంటే... కేవలం స్పాన్సర్‌షిప్స్, ప్రమోషన్స్, కార్పొరేట్-ప్రైవేట్ షోలు, యాడ్స్, ఐఫా వంటి కార్యక్రమాల్లో యాంకరింగ్ వంటివి చేయడం ద్వారా వచ్చే భారీ రెమ్యూనరేషన్స్‌తో!

      Thanks for your comments.



      Delete
  5. https://youtu.be/gyl771NSojQ
    జీవితం లో క్లారిటీ ఉన్న వ్యక్తులు డబ్బుని ఇలా ఖర్చు చేస్తారు.

    ReplyDelete
    Replies
    1. Awesome video!

      Big Thanks for sharing the link, Niharika garu.

      Delete
  6. అయ్యా మనోహర్ గారు,
    Chiru Dreams గారు గిల్లి పెట్టినంత మాత్రాన
    …. రిటైర్ అయినవాడిని నేను సినిమాలకు పెట్టుబడి ఎక్కడ నుంచి తెచ్చి పెట్టగలను స్వామీ🙁 ?

    స్తోమత, ఆసక్తి, సాహసం గలవారు ఎవరయినా నా పరిచయస్తులలో ఉన్నారేమో చూడాలి.

    కాబట్టి …. ఈసారికిలా పోనిద్దాం 🙂.

    ReplyDelete
  7. "స్తోమత, ఆసక్తి, సాహసం గలవారు ఎవరయినా నా పరిచయస్తులలో ఉన్నారేమో చూడాలి"...🙏

    మాష్టారూ, ఇదేదో చూడండి. మీకు మస్త్ తాయిలాలుంటాయి...🙂👍

    Thank you, Rao garu!

    ReplyDelete