Tuesday 15 March 2022

పుతిన్ విధ్వంసం వెనుక - 6

సుమారు 8 గంటల క్రితం... రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌ను ఉద్దేశిస్తూ, 'టెస్లా', 'స్పేస్ ఎక్స్' కంపెనీల అధినేత ఈలన్ మస్క్ ఒక ట్వీట్ పెట్టాడు.   

"నాతో సింగిల్‌గా ఫైట్ చెయ్యమని నేను నీకు చాలెంజ్ విసురుతున్నాను. నీకు సమ్మతమేనా?" అని. 

స్టేక్ ఏంటంటే... యూక్రేన్ అట! 

ఈ ట్వీట్‌ను డైరెక్టుగా రష్యా ప్రెసిడెంట్ ట్విట్టర్ హాండిల్‌కు ట్యాగ్ చేశాడు మస్క్.   

అంటే... ఒకవేళ ఫైట్‌లో పుతిన్ గెలిస్తే, ఈలన్ మస్క్ అతనికి యూక్రేన్‌ను ఇస్తాడన్నమాట. 

ఈలన్ మస్క్ ఒక పెద్ద బిజినెస్ సామ్రాజ్యాధినేత నిజమే. పుతిన్‌తో అసలీ సింగిల్ ఫైట్ చాలెంజ్ ఏంటి? పుతిన్ గెలిస్తే అతనికి మస్క్ యూక్రేన్‌ను స్టేక్‌గా ఇవ్వటమేంటి? 

పరోక్షంగా దీనర్థం ఏంటంటే - వారిద్దరి సింగిల్ ఫైట్‌లో ఈలన్ మస్క్ గెలుస్తాడు. అప్పుడు పుతిన్ యూక్రేన్‌ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. 

ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా... అసలు యూక్రేన్‌ను స్టేక్‌గా పెట్టడానికి ఈలన్ మస్క్ ఎవరు? 

యూక్రేన్ ఏమైనా ఈలన్ మస్క్ కంపెనీలోని ఒక టెస్లా కారా? ఇంకేదైనా ప్రొడక్టా? 

ఈలన్ మస్క్ పుతిన్‌తో సింగిల్ ఫైట్ చెయ్యడానికి... పుతిన్ ఏమైనా మస్క్ కంపెనీల్లో తయారైన ఒక వీడియో గేమ్ క్యారెక్టరా?

ఇంత అర్థం లేని ట్వీట్ పెట్టడానికి ఈలన్ మస్క్ ఏమీ అమెరికా పాత ప్రెసిడెంట్ ట్రంప్ కాదు. మెచ్యూరిటీ లేని ఒక ఎడాలిసెంట్ కుర్రాడు కాదు. 

తన "స్పేస్ ఎక్స్" సామ్రాజ్యం ద్వారా కేవలం కలల్లో మాత్రమే సాధ్యమయ్యే ప్రయోగాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు మస్క్. 

"మార్స్ ట్రిప్ డబ్బున్న ధనికుల కోసం కాదు. జిజ్ఞాస, ధైర్యం ఉన్న ఎక్స్‌ప్లోరర్స్ కోసం. వాళ్ళు తిరిగి రాకపోవచ్చు. అక్కడే అంగారక గ్రహం పైనే చనిపోవచ్చు..." స్పేస్ ఎక్స్ అధినేతగా, ఈలన్ మస్క్ స్థాయి విజన్ ఇది.

అతని డ్రీమ్ ప్రాజెక్టు... అంగారక గ్రహంలో కాలనీలు కట్టడం!

ప్రపంచంలోని ప్రతి భారీ బిజినెస్ మాగ్నెట్ నుంచి, ఒక స్థాయి ఎంట్రప్రెన్యూర్స్ వరకు... అంతా, ఈలన్ మస్క్ బిజినెస్ అప్‌డేట్స్ చూస్తుంటారు. అతని సోషల్ మీడియాను ఫాలో అవుతుంటారు. అతని పుస్తకాలు చదువుతుంటారు. అతని గురించి రాసిన ఆర్టికిల్స్ చదువుతుంటారు. మస్క్ దగ్గినా తుమ్మినా ఒక బ్రేకింగ్ న్యూసే. 

అంత స్థాయి ఉన్న ఈలన్ మస్క్... ఇంత అర్థంలేకుండా ఒక ట్వీట్ పెట్టాడంటే ఏమనుకోవాలి?

50 ఏళ్ళ ఈలన్ మస్క్ పెద్ద ఫైటరేం కాదు. ఒక ప్రపంచస్థాయి బిజినెస్ మాగ్నెట్‌గా స్వీయరక్షణ కోసం ఏవైనా మార్షల్ ఆర్ట్స్‌లో ట్రెయినింగ్ తీసుకొని ఉంటే ఉండొచ్చు.

అంతకన్నా ఇంకేం ఉంటుంది అతని దగ్గర... సింగిల్‌గా పుతిన్‌ను గెలడానికి?

మరి పుతిన్...?  

వయస్సు 69 దాటినా... రోజూ తనకు తెలిసిన అన్ని యుధ్ధ విద్యలు ప్రాక్టీస్ చేస్తాడు. రెజ్లర్. లోడెడ్ గన్‌తో ఎదురెదురుగా నిల్చొని పాల్గొనే "డ్యూయెల్" ఫైట్‌లో ఎన్నోసార్లు పాల్గొని గెల్చి బ్రతికినవాడు. (డ్యూయెల్‌లో ఓడిపోవటం అంటే ఆన్ ది స్పాట్ చావటమే). గతంలో సోవియట్ యూనియన్ ఇన్వాల్వ్ అయిన కొన్ని ప్రపంచదేశాల అంతర్గత రక్షణ, యుధ్ధ వ్యవహారాల్లో ప్రత్యక్షంగా పనిచేసిన వార్ స్ట్రాటజిస్ట్, వార్ ఫైటర్.  సోవియట్ కె జి బి లో ఏజెంట్‌గా పనిచేసినప్పుడు... ఎక్కడో శతృదేశాల్లో, ఒంటరిగా ఎందరినో ఎదుర్కొని హతమార్చిన వందలకొద్దీ సక్సెస్‌ఫుల్ అసైన్‌మెంట్స్ రికార్డ్ ఉన్నవాడు... అలాంటి పుతిన్‌తో ఈలన్ మస్క్ ఎలా సింగిల్‌గా ఫైట్ చేయగలననుకొన్నాడు? 

చేసి, ఎలా గెలుస్తాననుకొన్నాడు? 

ఆమధ్య 2021లో, ఈలన్ మస్క్ 'క్లబ్ హౌజ్‌'లో బాగా యాక్టివ్‌గా ఉంటున్న సమయంలో, ఒకసారి పుతిన్‌ను తనతో చాట్‌కు కూడా ఆహ్వానించిన ఈలన్ మస్క్ మరీ అంత అవివేకా? 

కాదు. 

మరి...?!

ఈలన్ మస్క్ పెట్టిన ఆ ట్వీట్ పుతిన్ పట్ల అతనిలోని అసహనాన్ని తెలుపుతోంది.   

అతనిలోని ఆ అసహనం... రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌ను ఎప్పుడు, ఎలా చంపాలా అని ఎదురుచూస్తున్న మొత్తం పశ్చిమదేశాల అసహనానికి ప్రతిబింబం. ఆయా దేశాల కంట్రోల్‌లో నడుస్తున్న 90 శాతం ప్రపంచ మీడియా అసహనానికి ప్రతిబింబం. 

ప్రపంచ మీడియా అసహనం గురించి... ఇంకో పోస్టులో... 

2 comments:

  1. బాగా చెప్పారండీ.
    మధ్తలో ఈమస్క్ కామెడీ ఏమిటీ?
    ఎంతో ఆలోచించి కదా పుతిన్ ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నదీ?
    ఉక్రెయిన్ లొంగిపోయినా నాశనం ఐనా మధ్యలో ప్రపంచానికి అసహనం ఎందుకు? మస్కో మరొకడో కాస్కో అనటం ఏమిటో!!
    ఒక ప్రక్కన ఉక్రెయిన్ మెల్లగా దిగివస్తోంది. నాటో ఉత్తుత్తి బూకరింపులు చేస్తోంది. ప్రపుచం తమాషా చూస్తోంది. మీడియా పండగ చేసుకుంటోంది.
    ముందుముందు పుతిన్ మరెన్ని మంచిమంచి యుధ్ధాలను తెస్తాడో చూదాం. మన ప్రపంచంలో ఆయనకు సమర్ధకులు ఇంతమంది ఉండగా కోన్ కస్కా మస్క్ లాంటి వాళ్ళ కామెడీలు పుతిన్ తలవెంట్రుకనైనా కదపగలవా ఏమిటి?



    ReplyDelete
    Replies
    1. పుతిన్‌కు పెద్దగా వెంట్రుకలు మిగల్లేదు సర్! :-)



      Delete