Wednesday 9 February 2022

ఎమ్మే-పీహెచ్‌డీలు చదివిన వ్యక్తులు కూడా...

"Religion is a man made thing" అన్న మాటను నేను బాగా నమ్ముతాను. దేవుడు అన్న కాన్‌సెప్ట్ అందులో భాగమే.

పై వాక్యాన్ని ఎంత బాగా నమ్ముతానో, అంత కంటే బాగా నేను నమ్మే నిజం ఇంకోటి కూడా ఉంది.

అది... మనకు తెలియని ఏదో ఒక "శక్తి".

ఆ శక్తి లేకుండా మనమంతా లేము. మన చుట్టూ ఉన్న ఈ అద్భుతమైన ప్రకృతీ లేదు.

ఆ శక్తి రూపం మనకు తెలియదు. ఆ శక్తి ఉద్దేశ్యం ఏంటో కూడా మనకు తెలియదు.

ఎవరికి వారు ఏదో ఒక పేరు పెట్టుకొని ఆ శక్తిని నమ్మడంలో తప్పేమీ లేదు. ఇంకొకరిని ఇబ్బంది పెట్టనంతవరకూ నిజంగా అదొక మంచి డిసిప్లిన్.

నేను కన్వీనియెంట్‌గా ఫీలయ్యి, నాకు నచ్చిన ఒక పేరుతో, ఆ శక్తిని నేనూ నమ్ముతున్నాను. అది వేరే విషయం. 

ఒక్క దేవుడనే కాదు... ఏ విషయంలో ఐనా అంతే. 

మనం కన్వీనియెంట్‌గా ఫీలైన విషయాలతోనే మనం కనెక్ట్ అవుతాం. మనుషుల విషయంలో కూడా అంతే. మనం కంఫర్ట్‌గా ఫీలైన వ్యక్తులే ఎక్కువగా మన జీవితంలో ఉంటారు. 

ఇదంతా ఎలా ఉన్నా .. శతాబ్దాలుగా చాలా మంది మహామహులైన రచయితలు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, మేధావులమనుకున్నవారి విషయంలో నేను చదివి తెలుసుకొన్న, ఇటీవలికాలంలో వ్యక్తిగతంగా గమనించిన పచ్చి నిజం కూడా ఇంకోటుంది.

అసలు దేవుడు అన్న కాన్‌సెప్ట్‌నే నమ్మకుండా, జీవిత పర్యంతం విశృంఖలంగా గడిపిన ఎందరో చివరికి ఏదో ఒక ఆధ్యాత్మిక ఆశ్రమంలో చేరిపోయారు! 

అంటే - అందులో ఏదో ఆనందమో, ఓదార్పో, ఇంకేదో మనకు అవసరమైన పాజిటివ్ ఫీలింగో ఉంది.  

సో, మళ్లీ మనం కొత్తగా ఒక చక్రాన్ని కనిపెట్టాల్సిన అవసరం లేదు. అనుభవం మీద అన్నీ మనకే తెలుస్తాయి. అందుకే ఈ విషయంలో అనవసరంగా లాజిక్కుల జోలికి పోవడం వృధా. ఆ సమయాన్ని మరోవిధంగా సద్వినియోగం చేసుకోవడం బెటర్. 

కట్ చేస్తే - 

ప్రపంచంలోని చాలా అభివృధ్ధిచెందిన దేశాల్లో - మతం గురించి పెద్దగా పట్టించుకోవడం అనేది అత్యంత వేగంగా తగ్గిపోతోంది. 

ఈమధ్యే నేను ఎక్కడో చదివిన ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం - అత్యధికశాతం అభివృధ్ధి చెందిన దేశాల్లో మతాన్ని పట్టించుకొనేవారి సంఖ్య సరాసరి 40 శాతానికి పడిపోయింది అంటే నమ్మశక్యం కాదు. (It was also tweeted by: @ValaAfshar, Boston, couple of months back.).   

మనం గమనించాల్సిన ఇంకో నిజం ఏంటంటే - మతం నేపథ్యంలో ఇప్పటికీ గొడవల్లో ఉన్న దేశాల్లో, దాదాపు అన్ని దేశాలు అన్నివిధాలుగా వెనుకబడి ఉన్నవే. ఇంకా వెనక్కిపోతున్నవే.  

మతం ఒక నమ్మకం. పూర్తిగా వ్యక్తిగతం. 

అది మనిషి ఎదుగుదలకు ఉపయోగపడే సాధనం కావాలి కాని, ఇంకొకరిని బాధించే ఆయుధం కాకూడదు. 

దురదృష్టవశాత్తు, మన చుట్టూ జరుగుతున్నది మాత్రం అలా లేదు. 

నాకు వ్యక్తిగతంగా తెలిసిన కొందరు ఎమ్మే-పీహెచ్‌డీలు చదివిన వ్యక్తులు కూడా కనీసం ప్రాథమికస్థాయి ఆలోచన లేకుండా, చాలా గుడ్డిగా, ఏవేవో వాట్సాప్ మెసేజ్‌లు ఫార్వార్డ్ చేస్తుంటే నేను నమ్మలేకపోతున్నాను. 

ఇలాంటివి కళ్ళముందు చూస్తుంటేనే అనిపిస్తుంది... మన దేశానికి ఫ్రీడం వచ్చి 74 ఏళ్ళు దాటినా, మనం ఇంకా ఒక 'అభివృధ్ధి చెందుతున్న దేశం' గానే ఉన్నామంటే అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు.          

6 comments:

  1. నాకు తెలిసిన జనాలు , మోస్ట్ developed కంట్రీస్ లో పనిచేసిన జనాలు కూడా వాట్సాప్ లో మెసేజ్ లని నమ్మడం చూసాక, మన దేశ విద్యా విధానం , మన సంస్కృతీ మీద పెద్ద అనుమానం వస్తుంది . అసలు హిజాబ్ తో ఇప్పటివరకు లేని ప్రాబ్లెమ్ ఇప్పుడెందుకు .
    హిందువులు పసుపు రాసుకోరా ?, అయ్యప్ప మాలలు వేసుకోరా ? గాజులు , మెట్టెలు పెట్టుకోరా , చేతికి దారాలు , బొట్లు , మరి ఇవన్నీ ఏంటి ? దేశాన్ని ముక్కలు ముక్కలు చేసి బీజేపీ ఏం బావుకుంటుంది . ?? ఆ స్టూడెంట్స్ లో ఆ విష బీజాలు ఎందుకు నాటడం .
    అంత అవసరం ఏమొచ్చింది . ఎక్కడో ఏదో ఒక మూల బీజేపీ మీద ఉన్న ఆశ , అసహ్యం గా మారిపోతుంది .
    కాండ్రించి వాళ్ళ మొహాల మీదా ఊయాలి

    ReplyDelete
    Replies
    1. అక్కడ ఎన్నికల కోసం ఇక్కడ చిచ్చు.

      Delete
    2. అద్భుతంగా వచ్చిన అవకాశం. రెండు టర్మ్స్! ఎలాంటి అలయెన్స్ టెన్షన్స్ లేవు. ఏ స్థాయిలో దేశాన్ని అభివృధ్ధి చేయొచ్చు!... ఈ ఒక్కటి తప్ప, మిగిలిన పనికిరానివన్నీ చేస్తున్నారు.

      Venkat garu & Bonagiri garu... Thanks for your comments.

      Delete
  2. మన దేశంలో ప్రజలకి కూడ ప్రశాంతంగా ఉండడం ఇష్టం ఉండదు. ఏదో రకంగా కొట్టుకు చావకపోతే నిద్ర పట్టదు.

    ReplyDelete
    Replies
    1. సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో, రాముని పేరుతో జరుగుతున్న సైకో దాడులకి దేశభక్తి అని పేరు పెట్టేశారు. అన్నిట్లో పాకిస్థాన్ కన్నా ఎంతో ఉన్నత స్థానంలో వున్న మనం.. ఉగ్రవాదంలో మాత్రం ఎందుకు తక్కువగా ఉండాలనేమో? శ్యామలీయం గారి లాంటి భక్తులకి.. రాముడ్ని ఇంత నీచంగా వాడుకునేవాళ్ళని చూసి కడుపు తరుక్కుపోతుంది. దేశప్రధాని ఇలాంటి వాటిని ఖండించపోవడం.. సంఘవిద్రోహశక్తులకి బూస్టర్ డోస్.

      Delete
    2. Very true, Chiru dreams garu. Thank for the comment.

      Delete