Monday 7 February 2022

నా మొదటి సినిమా లేటెస్ట్ జ్ఞాపకం!

మొదటి సినిమా అంటే ఎవరికైనా కొంచెం ఎక్కువ మమకారం ఉంటుంది. నాకు మరీ ఎక్కువ. ఎందుకంటే - దానితో నాకున్న జ్ఞాపకాలు అలాంటివి.  

4 జూన్ 2004 నాడు, అప్పటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ అంతటా భారీగా థియేటర్స్‌లో రిలీజ్ అయింది. నాకు మంచి పేరు తెచ్చింది. ఇండస్ట్రీలో కొన్ని మంచి పరిచయాలు పెరిగాయి. అదంతా ఓకే. 

నాకూ, మా ప్రొడ్యూసర్‌కూ అది మొదటి సినిమా. మా టీమ్‌లో నాతో పనిచేసిన సీనియర్లు ఒకరిద్దరు మాకు కొన్ని జాగ్రత్తలు చెప్పకపోవడం వల్ల కొన్ని పొరపాట్లు జరిగాయి. 

అతి పెద్ద పొరపాటు ఏంటంటే, ఆ సినిమా కాపీ ఫిలిం ప్రింట్ కాని, బేటా టేప్స్ కాని మేము ఒక్క కాపీ కూడా మాతో పెట్టుకోలేదు. ప్రొడ్యూసర్ దగ్గర బేటా టేప్స్ ఉన్నాయనుకున్నాను. అక్కడ కూడా లేవు. 

జెమిని చానెల్లో 100+ సార్లు వచ్చినప్పుడు కూడా కనీసం రికార్డు చేసుకోలేదు. 

ఇప్పటికీ తరచూ జెమినీలో వస్తోంది. కాని, రికార్డ్ చెయ్యలేను. అదో పెద్ద పని. 

రియల్ ఎస్టేట్ లాగా, మా సినిమా శాటిలైట్ రైట్స్‌ను ఎవరో 'థర్డ్ పార్టీ' అప్పట్లోనే ఇద్దరికి అమ్మారట! ఆ ఇష్యూ ఇంకా తెగలేదు. తెగదు. 

అందుకని మా సినిమా డీవీడీలు మార్కెట్లోకి రాలేదు. ఈ ఇష్యూ వల్లనేనేమో, మా సినిమా యూట్యూబ్‌లోకి కూడా అప్‌లోడ్ కాలేదు.  

అప్పట్లో ఒకసారి నా మిత్రుడు, నటుడు దశరథ్ జెమిని వాళ్లకు కాల్ చేసి స్పెషల్‌గా ఈ సినిమా టెలికాస్ట్ చేయించాడు... రికార్డ్ చేద్దామని. 

సినిమా టెలికాస్ట్ అయింది. ఎక్కడో బళ్ళారిలో రికార్డ్ చేశారు. ఎందుకో మాకు మాత్రం కాపీ రాలేదు. కారణం నా మిత్రుడికి కూడా తెలీదనుకుంటాను.         

కట్ చేస్తే - 

మొన్నొక రోజు పాత డీవీడీలు తిరగేస్తుంటే 'క్యామ్ ప్రింట్' అని మాత్రం రాసి ఉన్న ఒక కవర్ కనిపించింది.    

ప్లే చేసి చూశాను.

అది, నా మొదటి సినిమా... కల.  

ఆ సినిమా విడుదలైన మొదట్లో ఒకసారి సారథిలో ఎవరికోసమో వేసినప్పుడు పక్కనుంచి ఈ ప్రింట్ కూడా తీశారని తర్వాతెప్పుడో ఎవరో అంటూంటే విన్నాను. ఆ డీవీడీలు నాదగ్గరికి ఎలా వచ్చాయో నాకు తెలీదు. 

క్యామ్ ప్రింట్ కదా... క్లారిటీ లేదు. అయినా సరే, మొత్తానికి ఒకటంటూ అవశేషం దొరికింది.

నాలుగు పార్ట్‌లు గా ఉంది. దాన్ని ఒకే ఫైల్ చెయ్యమని ఇప్పుడే పంపాను.

బిగ్ కొశ్చన్ ఏంటంటే, రైటర్-డైరెక్టర్‌గా ఇప్పుడు నా మొదటి సినిమా క్యామ్ ప్రింట్‌ను నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే చట్టరీత్యా నేరమా?  

అయితే అయింది. మీరంతా ఉన్నారుగా... నాకేమన్నా అయితే బయటికి తేవడానికి!😊   

13 comments:

 1. నన్నిల్వాల్వ్ చెయ్యకండి రావుగారూ!

  ReplyDelete
 2. Waiting to see your first movie, kindly give us the link as soon as possible.

  ReplyDelete
 3. బయటకు తేగలమో లేదో చెప్పలేను గానీ విజిటింగ్ అవర్స్ లో (“ములాఖాత్” అంటారనుకుంటాను) పండ్లో స్వీట్సో పట్టుకుని పలకరించడానికి మాత్రం వస్తాం.
  😄😄😄😄

  All the best 👍.

  ReplyDelete
  Replies
  1. ఎంతో కొంత ఊరట! థాంక్యూ సర్.😊

   Delete
 4. ఫ్రెండ్షిప్ కొద్దీ అడుగుతున్నా. మీ మూవీ పైరసీ రైట్స్ మాత్రం నాకే ఇవ్వాలి.

  ReplyDelete
 5. నెక్ష్ట్ సినిమాకి మాత్రం విన్నకోటవారే మీ డైలాగ్ రైటర్ కావాలి.

  ReplyDelete
  Replies
  1. మొత్తం కథ-మాటలు వారే ఇచ్చినా ఓకే. ప్రొడ్యూసర్‌ను కనెక్ట్ చేసే బాధ్యత మీరు తీసుకోండి చాలు!😊

   Delete
 6. అయ్యా Chiru Dreams గారు,
  థాంక్యూ, థాంక్యూ 🙂.
  ఇంతకీ పారితోషికం ఎంత? అడ్వాన్సు ఏదీ?
  పోనీ, మీకు దక్కబోయే “పైరసీ రైట్స్” లో 50% ఇచ్చినా సరే, సరిపెట్టుకుందాం - నాకు ఎంట్రీ ఇచ్చే చిత్రం కదా.
  😄😄
  —————————-
  మనోహర్ గారు,
  థాంక్యూ for enhancing the scope of the offer 🙂.
  Chiru Dreams గారికి నామీద అభిమానం ఎక్కువైనట్లుంది. అందువలనే నా పేరు ముందుకు తెచ్చారు. సరే, అదెంత కాదు గనక. వారికి థాంక్స్.

  అసలు సంగతి - నేను ఔత్సాహికుడనే గానీ అనుభవజ్ఞుడను కానండి. నా వల్ల మీకెందుకు నష్టం. ఈసారికిలా పోనిద్దాం. 🙂.


  ReplyDelete
  Replies
  1. డబ్బుదేముందండీ! మాటలు రాసినోడు.. కాసులు రాల్చడా?

   Delete
  2. Chiru Dreams, మీరు అదుర్స్! విషయం అర్థం చేసుకోడానికి నాకు అరసెకన్ పట్టింది.😊

   ఇంకే కావాలి... కానీయండి మరి. మీరే కదిలించాలి. నేను ఓకే...

   Delete
  3. >>అసలు సంగతి - నేను ఔత్సాహికుడనే గానీ అనుభవజ్ఞుడను కానండి. నా వల్ల మీకెందుకు నష్టం. ఈసారికిలా పోనిద్దాం. 🙂.

   ఇండస్ట్రీకి మీలాంటి ఫ్రెష్ టాలెంట్ ఇప్పుడే కావాలి.

   Delete