Friday 4 February 2022

When Politics Decides Your Future...

రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సెన్సేషనల్ ప్రెస్‌మీట్ చూసిన తర్వాత వెంటనే ఏదో ఒక పోస్ట్ పెట్టాలనిపించింది.

కాని, ఎందుకో ఆ పని వెంటనే చేయలేకపోయాను. 

ఈమధ్య న్యూస్‌పేపర్ల ఎడిట్ పేజేలకు పొలిటికల్ ఆర్టికిల్స్ గాని, సోషల్ మీడియాలో పొలిటికల్ పోస్టులుగానీ అసలు రాయటం లేదు నేను. 

గత కొంతకాలంగా ప్రొఫెషనల్‌గా ఒక నమ్మశక్యం కాని స్టకప్‌లో ఉండిపోయి, ఊపిరాడని స్ట్రెస్‌లో గిలగిలా కొట్టుకొంటూ చాలా పనులు చేస్తున్నాను. దానికి తోడు, కరోనా కూడా ఇంకో రెండేళ్ళు మింగేసింది. 

కొంచెం ఫ్రీ అయి, ఏదో ఒక చిన్న ప్రాజెక్ట్ ప్రారంభించి, ఫ్రీ మైండ్‌తో మళ్ళీ ఈవైపు పూర్తిస్థాయిలో వద్దామనుకొన్నాను. అందుకే పొలిటికల్ కంటెంట్ ఏదీ ఈమధ్య అసలు రాయలేదు నేను. 

అయితే - మొన్నటి తన ప్రెస్‌మీట్ ద్వారా కేసీఆర్ గారు ఒక చాలెంజ్ విసిరినట్టనిపించింది... "రాయకుండా ఉండగలవా?" అని.

కట్ చేస్తే - 

రాత్రికి రాత్రే లేచి కూర్చొని సింగిల్ ఫ్లోలో ఓ ఆర్టికిల్ రాసేసి పడుకొన్నాను. మధ్యాహ్నం ఎప్పుడో నా ఫేస్‌బుక్ వాల్ మీద పోస్ట్ చేశాను. కొన్ని గంటల తేడాతో, అదే వ్యాసం ఇవాళ నమస్తే తెలంగాణలో పబ్లిష్ అయ్యింది. 

ఆర్టికిల్‌ను మెచ్చుకొంటూ సౌతాఫ్రికా నుంచి, యూయస్ నుంచి, యూకే నుంచి, ఢిల్లీ నుంచి, జైపూర్ నుంచి, ఔరంగాబాద్ నుంచి, షోలాపూర్ నుంచి, ఏపీలోని కొన్ని జిల్లాల నుంచి, తెలంగాణ నలుమూలల నుంచి కాల్స్ వచ్చాయి. లోకల్‌గా హైద్రాబాద్, వరంగల్ నుంచి కూడా... నేను ఊహించని కొందరు పెద్దవారి నుంచి, అంతకుముందు నాకెప్పుడూ వ్యక్తిగతంగా పరిచయం లేని ఇంకొందరు స్పెషల్ పీపుల్ నుంచి, తెలిసిన మిత్రులనుంచి... "చాలా బాగా రాశావు" అంటూ అభినందనలు వచ్చాయి. 

Credit goes to KCR!

వివిధ కారణాల వల్ల వీరిలో చాలామంది పేర్లు ఇక్కడ నేను ప్రస్తావించడం సాధ్యం కాదు. సో, నేనా పని చేయటం లేదు.  

అయితే - మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ మిత్రులు, 78 ఏళ్ల వెటరన్ ఒకరు మిర్యాలగూడ నుంచి కాల్ చేసి నాతో ఒక 20 నిమిషాలు మాట్లాడ్దం ఒక గొప్ప అనుభూతి. అలాగే, కరీంనగర్ నుంచి ఒక రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి కాల్ చేసి మాట్లాడ్డం నన్ను బాగా ఇన్‌స్పయిర్ చేసింది. 

వీరందరికీ కేసీఆర్ గారి తర్వాతి స్టెప్ పట్ల ఒక క్లియర్ విజన్ ఉంది. అది నాకు బాగా నచ్చింది.

అందరికీ ధన్యవాదాలు. 

పనులు పనులే. సినిమాలు సినిమాలే. 

మెడమీదున్న ఒకటీఅరా ప్రొఫెషనల్ టెన్షన్స్ నుంచి కూడా చాలా చాలా త్వరలో ఫ్రీ అవదల్చుకున్నాను. అవుతాను. 

Mission will continue till the goal is reached. 

రాస్తూ ఉంటాను. 

ఎందుకంటే - కేసీఆర్ గురించి రాస్తే వచ్చే ఆ కిక్కే వేరప్పా!

5 comments:

  1. ఆంధ్రామహాప్రభువులు జగన్మోహనుల వారి గురించి వ్రాస్తే మరింత కిక్కు వస్తుందేమో ఆలోచించండి. ఉభయ తెలుగు ప్రభువులను గురించీ వ్రాస్తూ ఉంటే నిత్యమూ నిక్కముగా కిక్కు మీద కిక్కు, కిక్కు మీద కిక్కు.

    ReplyDelete
    Replies
    1. సారీ అండి. నాకు తెలియని విషయాల గురించి, నాకిష్టం లేని విషయాల గురించి నేను రాయలేనండి.

      మీరాపని చేయొచ్చు. మీకు అనుభవం ఉంది, సమయమూ ఉంది.😊

      Delete
    2. మంచి రిపార్టీ ఇచ్చారు! (కానీ నాకూ సమయం చాలదండీ)

      Delete
  2. పాపం శ్యామలీయం గారు. తన బ్లాగులో పప్పు, సాంబర్ తినీ తినీ బోర్ కొట్టి, కాస్త మసాలా ఫుడ్డు తిందామని ఇక్కడికొస్తే.. మీరేంటండీ అలా అనేశారూ??😁😁

    ReplyDelete
    Replies
    1. Chiru Dreams,

      భలేవారండీ మీరు!😊
      సరదాగా మీరూ రాయండి అన్నాను. శ్యామలీయం గారంటే నాకు చాలా గౌరవం.

      Delete