Wednesday 23 February 2022

ఒక దార్శనిక కార్యశీలి విజయం!

పాతాళం నుంచి శిఖరాగ్రానికి ఎగిసి ప్రవహించిన గోదావరి జలాలతో... తెలంగాణలోని 13 జిల్లాల దాహార్తిని తీరుస్తూ, 11.29 లక్షల ఎకరాల సాగుకు నీరు అందించబోతున్న 50 టిఎంసిల మల్లన్నసాగర్ జలాశయం ఒక మహాద్భుతం. 

ప్రపంచంలోనే అతిపెద్ద బహుళదశల ఎత్తిపోతల నీటిప్రాజెక్టు - కాళేశ్వరం ప్రాజెక్టు. దీనికి కేంద్రం నుంచి ఒక్క పైసా సహకారం లేదు.

రాష్ట్రంలోని ప్రతిపక్షాల నుంచి, అభివృద్ధి నిరోధకుల నుంచి ప్రతి దశలో దీన్ని ఆపడానికి వందల కేసులు, వెయ్యి రాజకీయాలు. 

అయినాసరే, పూనుకొని, అన్నిటినీ ఎదుర్కొంటూ, ముందుకే ఉరికించి, కేవలం నాలుగేళ్ళలో ప్రాజెక్టుని పూర్తిచేసి చూపించటం అనేది నభూతో నభవిష్యతి!    

ఈ మల్లన్నసాగర్ ఇంజినీరింగ్ మహాద్భుతాన్ని నేడు జాతికి అంకితం చేస్తున్న సందర్భంగా... తెలంగాణ ఉద్యమశక్తి, తెలంగాణ సాధకుడు, దార్శనిక కార్యశీలి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హార్దిక శుభాకాంక్షలు! 

ప్రాజెక్టు కోసం అహోరాత్రులు శ్రమించిన ప్రభుత్వ యంత్రాంగానికి, సిబ్బందికి, శ్రామికులకు, తెలంగాణ ప్రజలకు శుభాభినందనలు. 

ముఖ్యంగా... కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా కలిసివచ్చిన ఈ సందర్భానికి జయహో!!  

4 comments:

  1. > కేవలం నాలుగేళ్ళలో ప్రాజెక్టుని పూర్తిచేసి చూపించటం అనేది నభూతో నభవిష్యతి!
    పోలవరం ప్రాజెక్టుతో పోల్చి చూడండి. దానిని మన నేతల రాజకీయాల దొంగాటలు ఎలా భ్రష్టుపట్టిస్తున్నాయో చూడండి.

    ReplyDelete
  2. ఫైసల్ మీరు చూసుకోండీ, మిగితాది నాకొదిలెయ్యండి అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రతిపక్షనేత... తెలుగు రాష్ట్రాలంటేనే ఏదో పురుగుల్ని చూసినట్టుచూసే ప్రధానమంత్రీ.. ఎందుకు పూర్తౌతాయండీ పనులు?

    ReplyDelete