Sunday 26 December 2021

ఈ పూల దారులు, ఆ నీలి తారలు

I like gardening. It’s a place where I find myself when I need to lose myself. 
– Alice Sebold in “Above and beyond”.

నిజంగా ఇంత అందంగా ఈ హోం గార్డినింగ్ చెయ్యటానికి చాలా ఓపిక కావాలి. ఇది కూడా ఒక మంచి క్రియేటివ్ టాలెంటే. 

గార్డెనింగ్ అనేది మనకిష్టమైన రంగులతో సృష్టించుకొనే ఆర్ట్, పెయింటింగ్ లాంటి మరొక కళారూపం. ప్రపంచంలో ఉన్న ఎన్నెన్నో హాబీల్లో స్వచ్ఛతను, సంతోషాన్ని సమపాళ్లలో ఇచ్చే హాబీ ఇదొక్కటే.  

ప్యూర్ ప్లెజర్‌ అన్నమాట. 

ఇది నేర్చుకొంటే వచ్చే అభిరుచి కాదు. ఎంతో ఆసక్తి, ప్యాషన్ సహజంగా ఉండాలి. ఒకసారి దీనికి ఎడిక్ట్ అయితే చాలు, చివరి క్షణం వరకూ మానుకోలేరు. ప్రపంచంలోని ఏ డ్రగ్ కూడా దీన్ని మించిన 'హై' ఇవ్వలేదు. అయితే - ఇది సిగరెట్స్, మందు, డ్రగ్స్ లాంటి నెగెటివ్ ఎడిక్షన్ కాదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక పాజిటివ్ ఎడిక్షన్.  

ఇంకో కోణంలో మనం గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే - ఈ అభిరుచి ఉన్నవాళ్ళు మానసికంగా చాలా మెచ్యూర్డ్‌గా, కామ్‌గా ఉంటారు. లోపల ఇంకేమైనా అసంతృప్తి, బాధలు, కష్టాలు ఉన్నా సరే... కామ్‌గా, కంటెంటెడ్‌గా సులభంగా ఉండగలుగుతారు.

ఈ హాబీ ఉన్నవాళ్ళలో వయస్సు కూడా అంత త్వరగా దగ్గరికి రాదు. కనీసం ఒక పదేళ్ళు తక్కువగా కనిపిస్తారు. 

ఒక నిర్ణయం తీసుకుంటే ఇక దాన్నించి వెనక్కివెళ్ళలేరు. అవసరమైతే బండరాయిలా ఉంటారు. అదే వారి శక్తి.   

గార్డెనింగ్‌ను "గ్రాండ్ టీచర్" అని కూడా అంటారు. ఎలాంటి క్లాసులు తీసుకోకుండానే ఎన్నో నేర్పిస్తుంది. వాటిల్లో చాలా ముఖ్యమైనది - ఓపిక. ఈ గ్రాండ్ టీచరే నేర్పించే ఇంకెన్నో ముఖ్యమైన విషయాల్లో ఒకటి - నమ్మకం.   

హోం గార్డెనింగ్ నాకు చాలా ఇష్టం. హైద్రాబాద్‌లోని బిజీ జీవితం, ఎప్పుడూ వెంటాడే ఏదో ఒక స్ట్రెస్ నన్ను దీన్నుంచి చాలా దూరంగా విసిరేశాయి. అయితే, చెప్పుకోడానికి ఇదొక సాకు మాత్రమే. నిజంగా చేయాలనుకొంటే ఏదీ దేనికీ అడ్డు కాదు. 

ఏదేమైనా, ఈ ప్యాషన్ ఉన్నవాళ్ళంటే నాకు చాలా గౌరవం, ఇష్టం. నేను చేయలేకపోతున్నానే అని ఏ మూలో చిన్న బాధ.   

కట్ చేస్తే - 

నాకున్న లిమిటెడ్ సర్కిల్లో ఇంతమంచి హాబీని, మారిషస్‌లో షూటింగ్ చేస్తున్న సమయంలో, అక్కడ ఒక నేటివ్ తెలుగువారింట్లో చూశాను. పాండిచ్చేరిలో ఒక డాక్టర్ ఇంట్లో చూశాను. మణికొండలో ఈమధ్యే ఒక ఆర్టిస్ట్ ఇంట్లో చూశాను. 

మళ్ళీ దాదాపు అంతే ఫాంటాబ్యులస్ స్థాయిలో ఈ హోమ్ గార్డెనింగ్ ప్యాషన్‌ను ఇంకొక చోట చూశాను. అయితే - ఈ ప్యాషనేట్ గార్డెనర్ నా స్టుడెంట్ కావడం నేను చాలా గర్వంగా, సంతోషంగా ఫీలయ్యే విషయం. 

I wish my student a very happy Green, Gardenish & Gorgeous Birthday! 
***

#HappyBirthday #MyStudent #ManoharChimmani #Nagnachitram #MyBlog #TeluguBlog #Gardening #HomeGardening #GoGreen #GoingGreen #HobbyGardener 

No comments:

Post a Comment