Saturday 25 December 2021

ఈ బ్లాగ్ నాకు చాలా ఇచ్చింది

సినిమా ప్యాషనేట్స్ అయిన కొంతమంది లైక్‌మైండెడ్ మిత్రుల నెట్‌వర్క్‌ను సృష్టించుకొనే ప్రయత్నంలో భాగంగానే ముందు నేనీ బ్లాగ్‌ను సృష్టించాను. 

ఊరికే సినిమా టిడ్‌బిట్స్, రొటీన్ వార్తల్లాంటివి రాయకుండా... నా అనుభవంలో నాకు తెలిసిన ఫిలిం ఇండస్ట్రీ లోపలి విషయాలను లైటర్‌వీన్‌లో రాస్తూ పంచుకోవాలన్నది నా ఆలోచన. అందుకే, ఈ బ్లాగ్‌కు నగ్నచిత్రం అని పేరు పెట్టాను.  

దీన్ని కొంచెం సీరియస్‌గా, కొంచెం ఈజీగా, కొంచెం కేర్‌లెస్‌గా తీసుకొంటూ, ఎప్పుడో తోచినప్పుడు మాత్రం ఒక పోస్ట్ ఏదో రాయాలి కాబట్టి రాస్తాను అన్నట్టుగా అలా రాస్తూపోయాను. 

నెమ్మదిగా బ్లాగింగ్ ఎంత శక్తివంతమైందో నాకర్థమైంది. నా దినచర్యలో భాగమైంది. 

తర్వాత్తర్వాత, నా ఫ్రీలాన్సింగ్ క్రియేటివ్ యాక్టివిటీ మొత్తానికి దీన్నే ఒక "హబ్‌"లా ఉపయోగించుకొంటూ, ఏ ఒక్కదానికీ పరిమితం చేయకుండా అన్నీ దీన్లోనే రాయడం ప్రారంభించాను. 

21 ఆగస్టు 2012 నాడు, అనుకోకుండా సృష్టించిన ఈ "నగ్నచిత్రం" వయస్సు 9 ఏళ్ళు దాటింది.

ఇవాళ్టికి సరిగ్గా 3409 రోజుల ఆత్మీయ స్నేహం మా ఇద్దరిదీ!       

కట్ చేస్తే - 

మనం ఎంత వద్దనుకొన్నా - చాలాసార్లు మనం రాసుకోకూడని, రాసుకోవాల్సిన అవసరం లేని వ్యక్తిగత విషయాలు, మరీ వ్యక్తిగతమైన కొన్ని సెన్సిటివ్ ఆలోచనలు కూడా మన బ్లాగ్ పోస్టుల్లో బాహాటంగా వచ్చేస్తుంటాయి. 

తర్వాతెప్పుడో ఒక 2, 3 ఏళ్ల తర్వాత చూసుకున్నప్పుడు - నేను ఇలా రాశానా? అసలు ఇదెందుకు రాశాను? ఇది రాయాల్సింది కాదు... ఇలా అనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని బ్లాగుల విషయంలో మరీ సిల్లీగా అనిపిస్తుంది. 

కాని - అదంతే. 

ఏం తప్పుకాదు. బ్లాగ్ ఇలాగే రాయాలని కాని, బ్లాగ్‌లో ఇవి మాత్రమే రాయాలని కాని ఎలాంటి రూల్స్ లేవు. 

మనవాళ్ళు ఎవరైనా చదివితే ఏమనుకుంటారు? బయటివారైనా సరే, చదివి ఏమనుకుంటారో... అనే ఇలాంటి ఘర్షణ ఎప్పుడూ ఉంటుంది. 

"అసలు అలాంటి ఎవరేమనుకుంటారో అన్న ఘర్షణ, భయం లేకుండా నేను అసలు ఒక్క బ్లాగ్ పోస్ట్ కూడా ఇప్పటివరకు పోస్ట్ చేయలేదు" అంటాడు జేమ్స్ ఆల్టుచర్. 

నా బ్లాగులో కూడా అలాంటి మరీ ఇబ్బందికరమైన టూ మచ్ పర్సనల్ థింగ్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని ప్రొఫెషనల్లీ పర్సనల్ పోస్టులు, కొన్ని మరీ ఓపెన్ సెల్ఫ్ ప్రమోషన్స్!

అయితే - జేమ్స్ ఆల్టుచర్ లాగే, నేను కూడా వాటి గురించి ఇప్పుడు అసలు పట్టించుకోవటం లేదు. 

మన జీవితంలోని మంచి, చెడుల గురించి... సుఖ సంతోషాల గురించీ మనకి మనం నెమరేసుకొంటూ, ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎప్పటికప్పుడు చాలా ఉంటుంది. 

ఇలాంటి "ఫ్లో రైటింగ్" వల్ల శాస్త్రీయంగా చాలా లాభాలున్నాయి.  

ఈ లాభాలు పొందటం కోసం నాకు దొరికిన ఒక అద్భుత సాధనం - బ్లాగింగ్. 

నమ్మరు కాని, బ్లాగింగ్ నిజంగా మనకు ఆరోగ్యాన్నిస్తుంది. మనల్ని ఆరోగ్యంగా ఉండనిస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. భౌతికంగానే కాదు, మానసికంగా కూడా. 

ఎవరేమనుకుంటారో అన్న మైండ్‌సెట్ లోంచి బయటపడగలిగితే చాలు... బ్లాగింగ్, మనతో మనం మాట్లాడుకోడానికి ఒక మంచి ఔట్‌లెట్‌లా పనిచేస్తుంది. ఎలాంటి హిపోక్రసీ, ఇన్‌హిబిషన్స్ లేకుండా అన్నీ పంచుకోగలిగిన ఒక అత్యంత ఆత్మీయమైన అతిదగ్గరి స్నేహితురాలు అవుతుంది. 

“No matter who you are, no matter what you do, no matter who your audience is: 30 percent will love it, 30 percent will hate it, and 40 percent won't care. Stick with the people who love you and don't spend a single second on the rest. Life will be better that way.”

Welcome to my beautiful world of Creative Souls!  
***

#Nagnachitram #MyBlog #TeluguBlog #ManoharChimmani #BloggingHobby #ILoveBlogging #GoBlogIt #BloggersWorld #BlogAddict 

No comments:

Post a Comment