1926 లో చలం "మైదానం" రాశాడు. నా ఫేవరేట్ ప్రపంచస్థాయి రచయితల్లో చలం ముందు వరసలో ఉంటాడు. ఆకాలంలోనే ఆయన రాయగలిగిన ఆ అందమైన తెలుగు శైలిని ఇప్పుడు 2020 ల్లో కూడా ఎవ్వరూ రాయడం లేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.
అలాంటి చలం... ఆరోజుల్లోనే... ఎంత అగ్రెసివ్, ఎంత అన్‌ట్రెడిషనల్ టాపిక్స్ పైన రచనలు చేశాడో అందరికీ తెలిసిందే. ఆ టాపిక్స్ అప్పుడే కాదు, ఇప్పటి మన హిపోక్రసీ నేపథ్య సమాజంలో కూడా సంచలనాత్మకమైనవే!
అలాంటి రచయిత కూడా చివరికి స్పిరిచువాలిటీ అంటూ రమణ మహర్షి ఆశ్రమం చేరాడు.
ఈ స్పిరిచువల్ "ట్రాన్స్‌ఫార్మేషన్" కేవలం క్రియేటివ్ రంగాలవారిలోనే వస్తుందని కాదు. చరిత్రలో అలెక్జాండర్ వంటి రారాజు నుంచి, సాధారణ రొటీన్ మనుషుల విషయంలోనూ జరుగుతుంది.
లైఫ్ అంతా ఉవ్వెత్తు కెరటాల్లా రకరకాలుగా ఎగిసిపడి, మిడిసిపడి, యుధ్ధాలు చేసి, దేన్నీ లెక్కచేయకుండా ఎన్నోరకాలుగా ఎంజాయ్ చేసి, చివరాఖరికి వచ్చేటప్పటికి స్పిరిచువాలిటీ అంటారెందుకు అన్నది నా హంబుల్ కొష్చన్!
అయితే - నేనిప్పుడు ఇలాంటి లాజిక్స్ గురించి అసలు పట్టించుకోవడం లేదు.
మిగిలిన ఒకటి రెండు బాధ్యతలు, కమిట్‌మెంట్స్ త్వరత్వరగా ముగించుకొని, ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా ఫ్రీ అయిపోయి... నేను కోరుకొన్న ఫ్రీడంతో బ్రతకాలని చాలా పనులు ఒకేసారి చేస్తున్నాను.
ఆ పనులన్నీ అలా చేస్తూనే - మినిమలిజమ్ వైపు, లాప్‌టాప్ లైఫ్‌స్టైల్ వైపు ఏకకాలంలో ప్రయాణిస్తున్నాను కూడా.
After all, spirituality is a personal thing.
No comments:
Post a Comment