ఇప్పుడు నేను మళ్లీ ఒక రెండేళ్ళో, మూడేళ్ళో వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నాను. వాటిలో మొదటిది కొన్ని వారాల్లో ప్రారంభమై, ఏకధాటిగా ఒకే షెడ్యూల్లో షూటింగ్ పూర్తిచేసుకుంటుంది.
ఇంతకుముందులా సినిమాల మీద ప్యాషన్ కాదు. అవసరం.
అత్యంత వేగంగా నేను కోరుకొన్న ఫ్రీడం ఈ ఒక్క పని నుంచే నాకు సాధ్యమవుతుంది. ఇదొక్కటే ఇప్పుడు నాకు బాగా ఉపయోగపడే ప్లాట్‌ఫామ్. ఇదొక్కటే అంత ఎఫెక్టివ్ అండ్ పవర్‌ఫుల్ ప్లాట్‌ఫామ్.
అనుకోని ఒక చిన్న సెట్‌బ్యాక్‌తో అనవసరంగా ఇంత మంచి ప్లాట్‌ఫామ్‌ను బాగా అశ్రధ్ధ చేశాను. అసలు పట్టించుకోలేదు.
నేను సినిమాల్లో ఉన్నన్ని రోజులు కొన్ని పనులు చేయలేను అని మొన్నటివరకూ అనుకొనేవాణ్ణి. కానీ అది నిజం కాదని నేనే ప్రాక్టికల్‌గా తెలుసుకున్నాను.
ఎవరో ఏదో అనుకుంటారనో, లేదంటే మనం చేసే ఒక పని, మనమే చేసే ఇంకోపనిమీద వ్యతిరేక ప్రభావం చూపిస్తుందనో అనుకోవడం ఉట్టి అవివేకం. దేని దారి దానిదే.
మన గురించి అనుకునేవాళ్లెవరూ మన ఫోన్ బిల్స్ కట్టరు, మన ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయరు. అవసరంలో మనల్ని ఆదుకోరు. అలాంటి ఎవరో ఏదో అనుకుంటారని మనం అనుకోవడం పెద్ద ఫూలిష్‌నెస్.
ఈ యాంగిల్లో చూసినప్పుడు, అనవసరంగా మనల్ని మనమే అణగతొక్కేసుకుంటున్నామన్నమాట!
అదొక పనికిరాని మైండ్‌సెట్. జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో మనకు అడుగడుగునా అడ్డుపడే మైండ్‌సెట్. జీవితంలో ఆనందాన్ని అనుభవించనివ్వని మైండ్‌సెట్.
మర్చిపో.
ఎవరైనా, ఎన్ని పనులైనా, ఏకకాలంలో చేయొచ్చు. అది ఆయా వ్యక్తుల సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచస్థాయిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ అంతా ఏకకాలంలో ఎన్నోరకాల పనుల్లో, వృత్తుల్లో, వ్యాపకాల్లో, వ్యాపారాల్లో మునిగితేలుతున్నవాళ్లే!
మన ప్రయారిటీలనుబట్టి, ఏయే పనులు ఎప్పుడు చేయాలో, అప్పుడు అలా వాటికవే జరుగుతూపోతుంటాయి. అలా చేయడానికి మనం అతి సహజంగా అలవాటుపడిపోతాం.
ఇప్పుడు నేనొక అరడజన్ పనుల్ని అత్యంత వేగంగా, విజయవంతంగా చేయగలుగుతున్నాను. నేను చేస్తున్న ఏపనీ నా మరోపనికి అడ్డురావడంలేదు. విచిత్రంగా అన్ని పనులూ చాలా ఈజీగా జరిగిపోతున్నాయి.
ఒకప్పుడు నేను చేయడానికి ఇష్టపడని పనుల్ని ఇప్పుడు యాడ్స్ ఇచ్చి మరీ చేస్తున్నాను.
నాకే అర్థం కావడం లేదు... ఇంత మార్పు ఏమిటో.
ఇంకోవైపు... "ఇదింక వద్దు" అనుకుంటే చాలు, అది ఇప్పటివరకూ నాకు ఎంత ఇష్టమైనదైనా సరే, ఆ క్షణం గుడ్ బై చెప్పేస్తున్నాను.
ఈ బ్లాగ్ కూడా ఇప్పుడు నిజంగా కొన్నిరోజులే.
ఈ బ్లాగ్ కూడా ఇప్పుడు నిజంగా కొన్నిరోజులే.
అలాగని నా రైటింగ్ హాబీని వదిలేస్తున్నానా? అదెప్పటికీ జరగదు...
ఇదంతా నన్ను ఎటు తీసుకెళ్తోందో తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు.
Minimalism? Law of Least Effort?... ఏమో, తెలీదు.
ఒక్క విషయం మాత్రం గుర్తుకొస్తోంది -
Everything is spiritual in this world.
No comments:
Post a Comment