Sunday 12 December 2021

తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు

తెలుగులో బ్లాగింగ్ చేస్తున్న మిత్రులందరికీ తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు.

వీవెన్ గారి ట్వీట్ ద్వారా తెలిసింది నాకు... డిసెంబర్ రెండో ఆదివారం "తెలుగు బ్లాగుల దినోత్సవం" అని. వారికి నా ధన్యవాదాలు.  

కట్ చేస్తే - 

బ్లాగింగ్ నాకిష్టం. చాలా ఇష్టం.

ఎంత ఇష్టమంటే... ఒక ఎడిక్షనంత ఇష్టం.

ఇంగ్లిష్ నవలల్లో వర్ణించే ఒక మాండ్రెక్స్ మత్తంత ఇష్టం. 

అంత వ్యామోహం. అంత పిచ్చి. అంత ఆనందం. 

నేను రాస్తున్నది సినిమాలు కావచ్చు, సక్సెస్ సైన్స్ కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు, నా సొంత గొడవ కావచ్చు.

నేను రాస్తున్నది టైమ్‌పాస్ టిడ్ బిట్స్ లాంటిది కావొచ్చు. ఎందుకూ పనికిరాని చెత్తాచెదారం కావొచ్చు. ఎక్కడో ఏ కొంచెమో పనికొచ్చే ఏదైనా మంచి విషయం కూడా కావొచ్చు.

కానీ, అలా రాస్తున్నంత సేపూ నన్ను నేను మర్చిపోతాను. నా పీకలమీదున్న ఎంతో వత్తిడిని, ఎన్నో కష్టాల్నీ కూడా పూర్తిగా మర్చిపోతాను.

ఒక మత్తులో మునిగిపోతాను.

ఆ మత్తు అలాగే ఉండిపోతే బాగుండు అనిపించేంత ఆనందంలో మునిగిపోతాను...

దురదృష్టవశాత్తు, ఇలా రాసే ఆనందాన్ని నేనెప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. అదే నేను చేసిన పెద్ద పొరపాటు. ఈ పొరపాటు చేయకపోయుంటే తప్పకుండా నేనొక మంచి పాపులర్ రైటర్ అయ్యుండేవాన్ని.

కానీ, ఎందుకో అలా అనుకోలేదెప్పుడూ.

కట్ చేస్తే - 

రాయడం అనేది నాకు సంబంధించినంతవరకూ... ఒక థెరపీ. ఒక యోగా. ఒక ఆనందం. ఒక కళ. ఒక గిఫ్ట్. 

మై ఫస్ట్ లవ్... నా తొలి ప్రేమ. 

నిజానికి ఇదేమంత గొప్ప విషయం కాదు. అనుకుంటే ఎవరైనా రాయగలరు. కానీ, అందరూ అనుకోరు. అందరివల్లా కాదు. 

జీవితంలో ఏవైనా ఊహించని జెర్క్‌లు వచ్చినప్పుడు నిజంగా నన్ను కాపాడేది ఈ థెరపీనే. ఈ యోగానే. 

నేను రాయాలనుకున్న కొన్ని పుస్తకాల గురించి, స్క్రిప్టుల గురించి, ఇంకెన్నో క్రియేటివ్ థింగ్స్ గురించి, నేను చేస్తున్న ఎన్నో ఫ్రీలాన్సింగ్ పనుల గురించీ... నాకు మొట్టమొదటగా ఒక కొత్త ఐడియా మెరిసేది కూడా... ఇలా బ్లాగింగ్ చేస్తున్నప్పుడే.  

ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

బై ది వే, మొన్న ఏప్రిల్‌లో నాకు  కరోనా వచ్చినప్పుడు కూడా, ఎలాంటి భయం లేకుండా నేను బయటపడటానికి నాకు ఎక్కువగా ఉపయోగపడింది కూడా ఈ బ్లాగింగ్ థెరపీనే. 

ఇప్పుడు ప్రొఫెషనల్‌గా కూడా... నా క్రియేటివ్ యాక్టివిటీ మొత్తానికి ఒక హబ్‌లా పనిచేస్తూ, నాకెంతో సహాయపడుతోంది నా బ్లాగింగ్.  

ఇందాకే చెప్పినట్టు - నాకెంతో ప్రియమైన నా రాసే అలవాటుని, నా బ్లాగింగ్‌నీ నేను నిజంగా పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఈ అలవాటు మాత్రం నన్నెప్పుడూ కంటికిరెప్పలా చూసుకొంది.

ఒక నిజమైన స్నేహితునిలా, ఒక ప్రేయసిలా, ఒక తల్లిలా.

అనుక్షణం నా వెంటే ఉంది. 

నా చివరి క్షణం వరకు నేనూ వదలను. 
***

#TeluguBlogs #NagnaChitram #NaganaChitramTeluguBlog #TeluguBlogsDay #TeluguBloggers #TeluguBlogging #TeluguBlogulaDinotsavam #Blogging #BloggingTherapy

7 comments:

  1. బ్లాగు అన్నది వెబ్ లాగింగ్ అన్నదానికి క్లుప్తీకరణ. లాగింగ్ అంటే ఏదైనా ఏక్టివిటీ గురించిన రన్నింగ్ రికార్డు.

    బ్లాగు మాధ్యమం మననిమనం ఆవిష్కరించుకొనే గొప్ప ప్రయత్నం. సరియైన దృక్పథంతో చేస్తే దానికి తప్పకుండా సాహిత్య విలువ ఉంటుంది. పదిమందికీ ఉపకరించే సావుకాశం ఉంది.

    దురదృష్టవశాత్తు ఈబ్లాగుమాధ్యమ విలువ గురించి సరైన అవగాహన లేని వాళ్ళ సంఖ్య హెచ్చుకావటంతో అనర్ధం జరుగుతున్న సంగతి గమనార్హం.

    చివరికి బ్లాగులను రాజకీయప్రచారాలకూ యుధ్ధాలకూ వాడేవారూ, కేవలం పాపులారిటీ కోసం వివాదాస్పద టపాలు వ్యాఖ్యలు వ్రాసేవాళ్ళూ కాపీపేష్టు వేష్టు వ్రాతలవారూ వగైరా సజ్జుతో నిండిపోయి తెలుగు బ్లాగు లోకం గబ్బుపడుతున్నది. ఇది చాలా విచారించవలసిన సంగతి.

    గతకాలము మేలు వచ్ఛుకాలము కంటెన్


    ReplyDelete
    Replies
    1. మనిషి పుట్టినప్పటినుంచీ మంచి, చెడు రెండూ ఉన్నాయి. అవెప్పుడూ ఉంటాయి. వాటిల్లో మనకు ఏది కావాలో దాన్ని గురించి పట్టించుకోవడమే మనం చేయగలిగింది అని నా భావన.

      మీ కామెంట్‌కు ధన్యవాదాలండీ!

      Delete
  2. 1970s1980s దశకాలలో అయితే మీరు యండమూరి మల్లాది గారు లాగా ప్రముఖ రచయిత అయి ఉండేవారు. మీ రచనా శైలి బాగుంటుంది. ఇప్పటి తరం లో తెలుగు నవలలకు, కథ లకు, మంచి రచయిత లకు ఎక్కువ ఆదరణ లేదు అనిపిస్తుంది. Web series, short films, movies, gossip websites etc however bad they maybe, have more patronage than a well written book.

    ReplyDelete
    Replies
    1. మీ కామెంట్ నాకు పెద్ద కాంప్లిమెంట్. ధన్యవాదాలు. నిజంగా రాసివుంటే గనుక ఆ స్థాయిలోనే కృషిచేసేవాణ్ణి.

      ఇక, మీరు ఇంగ్లిష్‌లో రాసిన చివరి వాక్యాం చాలా విలువైంది. అది పచ్చి వాస్తవం.

      ఒక్క మనదేశంలోనే చదివే అలవాటు దాదాపు చచ్చిపోయింది. ఎన్నో అభివృద్ధి చెందిన దేశాల్లో, మనకంటే అభివృధ్ధి చెందని దేశాల్లో మాత్రం స్టాటిస్టిక్స్ ప్రకారం పుస్తక పఠనం ఇంకా పెరిగింది. కిండిల్ లాంటి డిజిటల్ గాడ్జెట్స్ వచ్చినా కూడా ఫిజికల్ పుస్తకాల సేల్స్ తగ్గలేదు. ఇంకా పెరిగింది అని అమెజాన్, బార్న్స్ & నోబెల్ లెక్కలు చెప్తున్నాయి.

      నాకు ఒకే ఒక్క ఫిక్షన్ రాయాలని ఉంది. రాస్తాను. అలాగే - నిజంగా పనికొచ్చే నాన్ ఫిక్షన్ కూడా రాయాలన్న ప్లాన్ ఉంది. అది కూడా చేస్తాను. Best sellers only!😊😊 I'm a hardcore positive guy.😊

      Thanks a bunch once again for the comment Buchiki gaaru!

      Delete
    2. మనోహర్ గారూ, ప్రసక్తి వచ్చింది కాబట్టి అంటున్నాను. నేనూ ఒక చాలాపెద్ద ఫిక్షన్ ఒకటి వ్రాయాలని అనుకుంటూ అనుకుంటూనే కాలం గడుపుతున్నాను. నమ్ముతారో నమ్మరో, అది వ్రాయాలన్న తలపుతోటే పదకొండేళ్ళ క్రితం బ్లాగింగ్ మొదలు పెట్టాను. అంతపెద్ద ప్లణాళికను వ్రాయటానికి బ్లాగు మాధ్యమం సరిపోదని సంశయిస్తున్నాను. అలాంటి బిగ్ రైటింగ్ కోసం పనికివచ్చే సాఫ్టువేరు ఏమన్నా మీకు తెలిస్తే చెప్పండి. తొందరగా వ్రాయాలి. పెద్దవాడినైపోతున్నాను మరి.

      Delete
    3. సర్, మీరు ఇప్పుడు మొదలెట్టినా చాలు. ఒక సంవత్సరంలోపలే మీరనుకుంటున్న ఫిక్షన్ రాయగలరు. ఇందులో ఎలాంటి అతిశయోక్తిలేదు.

      బ్లాగ్‌ను మించింది లేదు. మొబైల్‌లో "కీప్" కూడా పెట్టుకోండి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ఎక్కడైనా వెయిట్ చేస్తున్నప్పుడు కూడా దాన్లో మీరు రాసిపెట్టుకోవచ్చు. తర్వాత, బ్లాగులోకి కాపీ పేస్ట్ చెయ్యొచ్చు. (నా బ్లాగుల్లో 40% అలా కీప్‌లో రాసుకున్నవే!).

      బెస్ట్ విషెస్.

      Delete
  3. శ్యామలీయం గారూ! రామాయణం కూడా ఫిక్షనే, డిఫరెంట్ వే లో రాసి చూడండి.

    ReplyDelete