Tuesday 14 December 2021

నేను పరిచయం చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు - 2

"నేను పరిచయం చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు" టైటిల్‌తో, వారం క్రితం నేను చేసిన పాడ్ కాస్ట్ మొదటి భాగంలోనే చెప్పాను... ఇదంతా ఇప్పుడు గుర్తుకుతెచ్చుకొని పాడ్‌కాస్ట్ చెయ్యటం అనేది... ముందు నాకోసం. తర్వాత నా లైక్‌మైండెడ్ కోసం.  

నేనిప్పటివరకు చేసిన మూడు సినిమాల్లో కనీసం ఒక 20 మంది కొత్తవాళ్లను ప్రధాన పాత్రల్లో ఇంట్రడ్యూస్ చేశాను. లిటరల్లీ, ఇంకో 40 మందిని చిన్న చిన్న పాత్రల్లో పరిచయం చేశాను.  వీళ్ళల్లో చాలా మంది ఇప్పుడు వివిధ భాషల్లో నటిస్తూ, వివిధ స్థాయిల్లో బిజీగా ఉన్నారు. వీరిలో కొందరి గురించి ముందు ఎపిసోడ్‌లో చెప్పాను. 

ఇంకొందరి గురించి ఇంకో రెండు మూడు ఎపిసోడ్స్ చెయ్యాలనుకుంటున్నాను. తప్పక చేస్తాను. 

ఇప్పుడీ ఎపిసోడ్‌లో - సిల్వర్ స్క్రీన్‌కు నేను పరిచయం చేసిన అమిత్ కుమార్ గురించి కొన్ని విశేషాలు చెప్తున్నాను. 

అలాగే - నేను పరిచయం చేసిన హీరోయిన్ నవ్య (నయన హర్షిత) గురించి, మ్యూజిక్ డైరెక్టర్ ధర్మతేజ గురించి కూడా కొన్ని విశేషాలు తర్వాతి ఎపిసోడ్సా్‌లో షేర్ చేస్తాను.

ఇక - నేను పరిచయం చెయ్యలేదు... కాని, నా సినిమాకోసం అప్పుడు నా టీంలో పనిచేసిన మా కోడైరెక్టర్ వేణు గురించి, కెమెరామన్ శంకర్ గురించి, కోరియోగ్రాఫర్ నిక్సన్ గురించి కూడా కొన్ని విశేషాలు తర్వాతి ఎపిసోడ్సా్‌లో షేర్ చేసుకుంటాను. అవన్నీ చాలా మంచి జ్ఞాపకాలు.    

మొన్నే చెప్పినట్టు - ఇదంతా ఎందుకంటే, పెద్ద రీజన్ లేదు. జస్ట్ నాస్తాల్జియా. 

నేను మళ్ళీ రెగ్యులర్‌గా సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకొని, చేయబోతున్న సందర్భంగా, మళ్ళీ పూర్తిస్థాయిలో, ఆ మూడ్‌లోకి పూర్తిగా దిగిపోడానికి, ఇలాంటి పాజిటివ్ జ్ఞాపకాలు ఒక మంచి డ్రైవ్‌లా పనికొస్తాయి (అని నా నమ్మకం).    

కట్ చేస్తే -    

ఇప్పుడు విలన్‌గా, కో-విలన్‌గా దాదాపు అన్ని భాషల్లో బిజీగా పనిచేస్తున్న అమిత్ కుమార్ ను నా మొదటి సినిమా "కల"లో మెయిన్ విలన్‌గా నేనే పరిచయం చేశాను. 

ఈ మధ్య అమిత్ తివారి అని టైటిల్స్‌లో వేసుకుంటున్నాడు. 

చాలా మంచి ఆర్టిస్టు. 

అప్పుడు మా ఆఫీసుకి వచ్చిన ఫోటోల్లో అమిత్ ఫోటో చూడగానే "ఇతనే మన సినిమాలో విలన్" అని డిసైడయ్యాను. ఆ తర్వాతే అతని మ్యానేజర్ నరేష్‌ను పిలిపించి మాట్లాడాను. తర్వాత అమిత్ ముంబై నుంచి వచ్చాడు . అయితే - ముంబైలో పుట్టి పెరిగినా, అమిత్ తెలుగువాడే కావడం విశేషం. అమిత్ వాళ్ళ బంధువులంతా హైదరాబాద్ లోని నారాయణగూడలో ఉంటారు.

అమిత్ కు యాక్టింగ్ మీద ఎంత ప్యాషన్ అంటే - మా కెమెరామన్ శంకర్ తో సహా, మా టీమ్ అంతా అతను యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా ఇష్టంగా చూసేవాళ్ళు. స్క్రిప్ట్ లో ఆ క్యారెక్టర్ అంత బాగా వచ్చింది. అమిత్ సీన్లు కూడా ఆ సినిమాలో చాలా బాగున్నాయి. 

"ఇంకా ఏమైనా చెయ్యాలా సర్... ఇంకా వేరే రకంగా చెయ్యాలా సర్" అని దాదాపు ప్రతి సీన్లో, ప్రతి షాట్ కూ... ఎప్పుడూ అడుగుతుండేవాడు. 

యాక్టింగ్ మీదున్న అతని ప్యాషన్ కు ఇంప్రెస్ అయిపోయి, అతని కోసం స్క్రిప్ట్‌లో లేని సీన్ ఒకటి కొత్తగా క్రియేట్ చేసి, రాసి, సినిమా ముగింపులో యాడ్ చేశాను. అలా చేయడం వల్ల మా హీరో ఫీలయ్యాడు. అమిత్ దగ్గర బాగా డబ్బులు తీసుకున్నానని కూడా కొందరు కామెంట్ చేశారు. అదంతా ఉట్టిదే. 

టు బి ఫ్రాంక్, అమిత్ కుమార్ ను నేను సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేసినందుకు, డబ్బు కాదుకదా... కనీసం ఒక 'యూజ్ అండ్ త్రో' పెన్ను కూడా నేను గిఫ్టుగా తీసుకోలేదు. 

నిజానికి, ఆ సినిమా తర్వాత అతనెప్పుడూ నన్ను కలిసే ప్రయత్నం కూడా చెయ్యలేదు. కాల్స్ కూడా లేవు. ఇండస్ట్రీలో ఇదంతా మామూలే. అది వేరే విషయం.😊

He's a very good actor. మిగిలిన విషయాలు... జస్ట్ ట్రాష్.  నేను పెద్దగా పట్టించుకోను.

అప్పుడు మేం అమిత్ కు ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా చాలా తక్కువే. బహుశా 10,116 అనుకుంటాను. "శాస్త్రానికి" అంటారు కదా అలా... ఒక మంచి ప్రారంభానికి గుర్తుగా, అతనికి అంతా మంచి జరగాలని ఇచ్చిందది. చెక్ ఇచ్చాం. జ్ఞాపకంగా దాన్ని అలాగే దాచిపెట్టుకుంటా అన్నాడు అమిత్. 

ఆనాటి ప్రారంభం నుంచి ఇప్పటివరకు, ఇన్ని వందల సినిమాల్లో, అమిత్ ఒక 10 కోట్లు సంపాదించాడన్నా నేను ఆశ్చర్యపోను.    

ఇక - మా సినిమా జరుగుతున్న టైంలో, మేం ఇద్దరం, అతని మేనేజర్ నరేష్ కలిసి బాగానే తిరిగాం. ఒకసారి ముంబై వెళ్ళినప్పుడు, అక్కడ అమిత్ వాళ్ళ నాన్న మాకు మంచి డిన్నర్ ఇచ్చారు. ఆయన ముంబైలో పెద్ద బిజినెస్ మ్యాన్. చాలా మంచివారు.  

అమిత్, నేను, నరేష్ కలిసి పబ్స్ కు కూడా వెళ్ళేవాళ్ళం. పబ్ అనగానే ఇంకోటి గుర్తొచ్చింది. మా సినిమాలో అమిత్ ఉన్న ఒక పబ్ సీన్ కోసం, అప్పట్లో నానక్ రాం గూడలో ఉన్న "ఎపిక్యురస్" పబ్ లో షూట్ చేసాము.     

ఇదంతా ఎలా ఉన్నా... ఒక్కటి మాత్రం నిజం. తన తొలి చిత్రం లోనే, ఒక ఫుల్ రేంజ్ విలన్‌గా "కల"లో అద్భుతంగా నటించాడు అమిత్. అందులో ఎలాంటి డౌట్ లేదు. 

రిలీజైనప్పటి నుంచి, ఇప్పటివరకు, జెమిని, తేజ చానల్స్ లో  మా ఇద్దరి డెబ్యూ సినిమా "కల" కనీసం ఒక వంద సార్లు టెలికాస్ట్ అయ్యింది. ఈ విషయాన్ని గురించి చెప్తూ, జెమినిలోనే ఒక ఆఫీసర్ అప్పట్లో నాతొ ఇంకో మాట కూడా చెప్పాడు:  

"సార్, మీ ప్రొడ్యూసర్ కు ఎన్ని డబ్బులొచ్చాయో తెలీదు కాని, మా జెమినీ చానెల్ కు మాత్రం, వేసినప్పుడల్లా పండగే. స్పాన్సర్లూ ఎక్కువే, యాడ్స్ కూడా ఎక్కువే!"  

కట్ చేస్తే - 

నా సినిమా తర్వాత - అమిత్ కు వై వి యస్ చౌదరి, పూరి, యస్ యస్ రాజమౌళి, త్రివిక్రమ్ వంటి డైరెక్టర్స్ చాలా మంచి లిఫ్ట్ ఇచ్చారు.  నాకు తెలిసి, గత పదేళ్ళలో - తెలుగులో సినిమాలు తీసిన టాప్ డైరెక్టర్స్ అందరి సినిమాల్లో అమిత్ నటించాడు. 

అయినప్పటికీ - నా ఉద్దేశ్యంలో అమిత్‌కు నా మొదటి సిన్మా "కల"లో వచ్చినంత ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ ఇప్పటివరకు రాలేదు. ఎందుకనో తెలీదు. లేటెస్ట్ గా... ఈ మధ్య మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో అన్నయ్యగా సపోర్టింగ్ రోల్ లో చూసాను. బాగా చేసాడు. ఇక అలాంటి సపోర్టింగ్ రోల్స్ లో కూడా బిజీ అవుతాడు. 

ఇంకా, ఆమధ్య ఎటీటీ కోసం ఆర్జీవీ తీసిన మినీ మూవీ "నేకెడ్"లో కూడా చేసాడు. 

చెప్పాలంటే - తెలుగులో రిలీజవుతున్న ప్రతి మూడో సినిమాలో అమిత్ ఉంటాడు.      

అప్పట్లోనే రెండు మూడు సినిమాల్లో హీరోగా కూడా చేశాడు అమిత్. ఇప్పుడు కూడా... ఏదో "నల్లమల" అనే ఒక సినిమాలో హీరోగా చేస్తున్నాడు. 

యాక్టర్ గా... ఫిలిం ఇండస్ట్రీలో స్థిరపడాలన్నది అమిత్ కుమార్ డ్రీమ్. మా సినిమా జరుగుతున్నన్ని రోజులూ, ఈ విషయం నాతో ఎన్నోసార్లు షేర్ చేసుకునేవాడు. యాక్టింగ్ మీద తనకున్న ప్యాషన్ తో, తన డిసిప్లిన్ తో ఆ కల సంపూర్ణంగా నిజం చేసుకున్నాడు అమిత్. 

ఇది మామూలు విషయం కాదు. అందరివల్లా సాధ్యం కాదు.

"అమిత్ ను నేను కదా ఇంట్రడ్యూస్ చేసింది"... అని, తెరమీద అతన్ని చూసినప్పుడల్లా గుర్తుకొచ్చి నేను హాపీగా ఫీలవుతాను.  I wish him all the best.

కట్ చేస్తే - 

ఇప్పుడు అతి త్వరలో నేను చేయబోతున్న సినిమాలో - ఫ్రెష్‌గా ఒక అయిదు జంటల్ని పరిచయం చేయబోతున్నాను. ప్రాజెక్టు వివరాలు చెప్పడానికి ఇంకా టైముంది. 

ఆసక్తి, అవసరమైన అర్హతలు, ఆ రేంజ్ ప్యాషన్ ఉన్నవాళ్ళు... కేవలం కొత్త హీరోలు, హీరోయిన్స్ మాత్రమే... I repeat... కేవలం కొత్త హీరోలు, హీరోయిన్స్ మాత్రమే... కింద నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి... డి ఎం చేయండి. Strictly no calls please.  

ఆల్ ద బెస్ట్.  
***

– Manohar Chimmani,
Film Director, Nandi Award Winning Writer 

WhatsApp only: +91 9989578125 
*****

This post is the transcript of my recent podcast. 
Here's the podcast Links:

Anchor:

 
Youtube:
https://youtu.be/VxJ0vqNLjpo
***

#AmitKumar #AmitTiwari #VillainAmitKumar #KalaVillain #NewTalent #ManoharChimmani #DirectorManoharChimmani #NavyaNatarajan #NayanaHarshita, #KalaTeluguMovie #KalaTeluguFilm #Kala #Dharmateja #Nixon

No comments:

Post a Comment