Sunday 5 December 2021

నేను పరిచయం చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు - 1

నేనిప్పటివరకు చేసిన మూడు సినిమాల్లో కనీసం ఒక 20 మంది కొత్తవాళ్లను ప్రధాన పాత్రల్లో ఇంట్రడ్యూస్ చేశాను. ఇంకో 40 మందిని చిన్న చిన్న పాత్రల్లో పరిచయం చేశాను.  వీళ్ళల్లో చాలా మంది ఇప్పుడు వివిధ భాషల్లో నటిస్తూ, మోడలింగ్ చేస్తూ, బిజినెస్ చేస్తూ, వివిధ స్థాయిల్లో బిజీగా ఉన్నారు. 

వీళ్లల్లో కొందరి గురించి ఓ రెండు మూడు ఎపిసోడ్స్ చేద్దామనుకుంటున్నాను. 

ఇదంతా ఎందుకంటే - పెద్ద రీజన్ లేదు. జస్ట్ నాస్తాల్జియా. 

నేను మళ్ళీ రెగ్యులర్‌గా సినిమాలు చేయబోతున్న సందర్భంగా, మళ్ళీ పూర్తిస్థాయిలో ఆ మూడ్‌లోకి వెళ్లిపోడానికి ఇలాంటి జ్ఞాపకాలు ఒక మంచి డ్రైవ్‌లా నాకు ఉపయోగపడతాయని జస్ట్ అలా ఒక ఫీలింగ్... అంతే. 

నా మొదటి సినిమా "కల"లో హీరోగా చేసిన రాజా అప్పటికే రెండు, మూడు సినిమాలు చేసి ఉన్నాడు. రామానాయుడు "విజయం" అపజయం తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు నా సినిమాకు బుక్ చేసుకున్నాం. తర్వాత శేఖర్ కమ్ముల "ఆనంద్"లో బుక్ అయ్యాడు. 

ఈ సినిమా ద్వారా నేను కొత్తగా సిల్వర్ స్క్రీన్‌కు పరిచయం చేసినవారిలో హీరోయిన్ నయన హర్షిత (నవ్య), విలన్ అమిత్ కుమార్ ఉన్నారు. 

నవ్య తర్వాత చాలా తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ సినిమాల్లో చేసింది. ప్రస్తుతం ఒక బిజినెస్ వుమన్‌గా బెంగుళూరులో వుంది. సినిమాలు కూడా చేస్తోంది.

నేను విలన్ గా పరిచయం చేసిన అమిత్ కుమార్ (అమిత్ తివారీ) ఇప్పుడు  విలన్ గా, సైడ్ విలన్‌గా  నాలుగు భాషల్లో బిజీగా పనిచేస్తున్నాడు. అంతకు ముందు రెండు మూడు సినిమాల్లో హీరోగా కూడా చేశాడు. ఇప్పుడు కూడా "నల్లమల" అనే సినిమాలో హీరోగా చేస్తున్నాడు. లేటెస్ట్‌గా మొన్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్" సినిమాలో అన్నగా చేశాడు. 

నా అంచనా ప్రకారం, ఈ రేంజ్ ఆర్టిస్టులకు రెమ్యూనరేషన్, కాల్‌షీట్‌కు యావరేజ్‌న ఒక యాభైవేలకు తక్కువుండదు. ఈ పదేళ్లలో ఎన్ని కోట్లు సంపాదించి వుంటాడో జస్ట్ అలా గెస్ చేయండి. :-)

అమిత్ మంచి ఆర్టిస్టు. మా సినిమా జరిగినన్నాళ్ళూ చాలా క్లోజ్‌గా, ఆత్మీయంగా ఉండేవాడు. అతని గురించి మరోసారి వివరంగా చెప్తాను.  

ఇంకా... నా మొదటి సినిమాలో మంజూష, కరుణ, అంజూ అస్రానీ మొదలైనవారిని పరిచయం చేశాను. వీళ్లల్లో ఒకరిద్దరు మంచి యాంకర్స్‌గా, ప్రోగ్రాం ప్రజెంటర్స్‌గా, ఇంటర్వ్యూయర్స్‌గా ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. వీళ్లల్లో ఒకమ్మాయి తను నటించిన ఒక ట్రావెల్ సీరియల్‌లో భాగంగా దాదాపు ప్రపంచంలోని ముఖ్యమైన దేశాలన్నీ చుట్టేసి వచ్చింది.  ఒకమ్మాయి ఈమధ్యే BMW కొనుక్కుంది. 

ఈ సినిమాలోనే మణిశర్మకు కజిన్ ధర్మతేజను మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేశాను. అతనికి వేటూరి గారి దయవల్ల అప్పట్లో పాన్‌లు బాగా తినటం అలవాటయ్యింది. మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరిగినన్నాళ్ళూ ధర్మతేజ మా అఫీసుకో, స్టుడియోకో వస్తున్నపుడల్లా నాకూ ఓ నాలుగు పాన్లు తెచ్చి తినిపించేవాడు.😊 అంత క్లోజ్‌గా ఉండేవాళ్ళం మేం. మంచి ఫ్రెండ్. 

ధర్మతేజ మంచి టాలెంటెడ్, ఇండస్ట్రీలో  చాలా హై రేంజ్ పరిచయాలు కూడా ఎక్కువే. మరెందుకనో వెనకే ఉండిపోయాడు. ఇతని మీద కూడా ఒక ఎపిసోడ్ ప్రత్యేకంగా చెయ్యాలి. 

ఈ సినిమా ద్వారా భాస్కర్‌ను ఎడిటర్‌గా పరిచయం చేశాను. కోలా భాస్కర్ అనుకుంటాను. మళ్ళీ ఎక్కువగా కలవలేదు మేము. ఎడిటర్‌గా అతనింకా ఫీల్డులో  బిజీగానే ఉన్నాడు. 

లారెన్స్ అసిస్టెంట్ శాంతిని ఈ సినిమా ద్వారా కోరియోగ్రాఫర్‌గా ఇంట్రడ్యూస్ చేశాను. శాంతి హైలీ టాలెంటెడ్. పిచ్చి ఎనర్జీ. మంచి ఫ్రెండ్. ఈ సినిమా తర్వాత వెంటనే తనకు మణిరత్నం "యువ"లో, పవన్ కళ్యాణ్ "గుడుంబా శంకర్"లో అవకాశాలొచ్చాయి. ఆ తర్వాత, తమిళంలో చాలా బిజీగా పనిచేసింది 'శాంతి మాస్టర్'. 

నేను బాగుండాలని, రెగ్యులర్‌గా సినిమాలు చెయ్యాలనీ ఎప్పుడూ అంటూండేది శాంతి. తమిళనాడులో ఏదో గుడి పేరు చెప్తుండేది ఎప్పుడూ. "నా మాట మీద మీరు ఒక్కసారి ఆ గుడికి వెళ్ళి రండి సర్" అని చాలాసార్లు చెప్పింది. శాంతి గురించి కూడా తర్వాత వివరంగా ఒక బ్లాగో, పాడ్‌కాస్టో తప్పక చేస్తాను. 

నేనేం నాస్తికున్ని కాదు. అయినా ఇవన్నీ పెద్దగా నమ్మను. నా వ్యక్తిగత కారణాలవల్ల నేను రెగ్యులర్‌గా సినిమాలు చెయ్యలేకపోయాను. ఇప్పుడు మాత్రం రెగ్యులర్‌గా సినిమాలు చేస్తాను. ఆ పనిలోనే చాలా బిజీగా ఉన్నాను.    

నా తర్వాతి ప్రాజెక్టులు... "అలా", "స్విమ్మింగ్‌పూల్" సినిమాల్లో నేను పరిచయం చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ గురించి ఇంకోసారి, ఇంకో ఎపిసోడ్‌లో చెప్తాను.  

కట్ చేస్తే - 

ఇప్పుడు అతి త్వరలో నేను చేయబోతున్న సినిమాలో - ఫ్రెష్‌గా ఒక అయిదు జంటల్ని పరిచయం చేయబోతున్నాను. ప్రాజెక్టు వివరాలు చెప్పడానికి ఇంకా టైముంది. 

ఆసక్తి, అవసరమైన అర్హతలు, ఆ రేంజ్ ప్యాషన్ ఉన్నవాళ్ళు... కింద నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి... డి ఎం చేయండి.

ఆల్ ద బెస్ట్.  

Film Director, Nandi Award Winning Writer 

WhatsApp only: +91 9989578125 
^^^^^
^^^^^

Transcript of my podcast. Links:

Anchor:


Youtube:

6 comments:

  1. “డి ఎం” అంటే?
    “ఎనర్జీ” అంటే వినోద రంగం వారి పరిభాషలో అర్థం ఏమిటండి (నిజంగా తెలియక అడుగుతున్నాను)? టీవీ షో ల్లో - ముఖ్యంగా “జడ్జిలు” గా వచ్చే వ్యక్తులు ఎక్కువగా ఉపయోగించే పదం.

    మీ దగ్గర నేర్చుకోవడానికి ఆసక్తితో బాటు maximum వయసు పరిమితి ఏమన్నా ఉందా?
    Thanks.

    ReplyDelete
    Replies
    1. "డి ఎం" అంటే Direct Message.
      అంటే పబ్లిగ్గా అందరూ చూసేలా కాకుండా - పర్సనల్‌గా ఎమెయిల్‌కు గాని, వాట్సాప్ నంబర్‌కు గాని, ట్విట్టర్/ఫేస్‌బుక్ మెసేజ్ బాక్సుల్లోకి మెసేజ్ పెట్టడం అన్నమాట.
      Thanks for your comment andi Rao garu. :-)

      Delete
    2. 61 సంవత్సరాల వయస్సులో బాలకృష్ణ "అఖండ"లో చూపిన యాక్టివ్‌నెస్‌ను ఎనర్జీ అంటాం. చిరంజీవి (66), రజినీకాంత్ (70) లు కూడా అంతే. వారిలో అంత "ఎనర్జీ" ఉంది.

      ఏదో పనిచెయ్యాలి కబట్టి చేశాం అన్నట్టు కాకుండా... నిజంగా ఆసక్తితో, ప్యాషన్‌తో, ఎలాంటి సమయంలోనైనా ఉత్సాహంతో పనిచేసేవాళ్ల ఎనర్జీ నిజమైన ఎనర్జీ. నేను ఆ పదం వాడింది ఈ అర్థంలోనే అండి. ఇంకే అర్థాలూ నాకు తెలిసి లేవు.

      ---

      నాదగ్గర కోచింగ్ తీసుకోడానికి మీకిదే నా ఆహ్వానం! ఎలాంటి వయోపరిమితి లేదు. ఫీజు కడితే చాలు. 🙏🙂 అమితాబ్ బచ్చన్ 79 ఏళ్ల వయస్సులో ఇప్పటికీ ఎంత యాక్టివ్‌గా 365 రోజులూ పనిచేస్తున్నాడు?! మీరూ ఏదైనా చెయ్యగలరు, చెయ్యాలనుకుంటే. Age is just number.

      Thanks for your comment & inquiry sir.

      Delete
    3. email: mchimmani10x@gmail.com
      Whatsapp: +91 9989578125

      Delete