Monday 8 November 2021

జై భీమ్!

జై భీమ్ ఒక మంచి సినిమా. ఒక కన్విక్షన్‌తో డైరెక్టర్ జ్ఞానవేల్ చాలా బాగా తీశాడు. సూర్య, లిజోమోల్ జోస్ బాగా నటించారు. 

ఐ ఎం డి బి లో 39 వేలమంది 9.6/10 పాయింట్స్ ఇచ్చారు. అన్ని చానల్స్, పేపర్స్, మ్యాగజైన్స్, వెబ్ సైట్స్‌లో 3.5 నుంచి 4.5 దాకా స్టార్స్ ఇచ్చారు.  

సుమారు 40 కోట్ల బడ్జెట్‌తో తీసిన జై భీమ్‌కు అమెజాన్ ప్రైమ్ నుంచి అంతకు రెండింతల ధర పలికిందని సినీ మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. 

జై భీమ్ విషయంలో ముందు మనం మెచ్చుకోవాల్సిందీ, అభినందించాల్సిందీ దర్శకుడు జ్ఞానవేల్‌ను... ఇలాంటి కథ చేయాలని ముందుకు వచ్చినందుకు. 

తర్వాత అప్రిషియేట్ చేయాల్సింది జ్యోతిక, సూర్యలను. నిర్మాతలుగా వారిద్దరూ జ్ఞానవేల్‌కు అన్నిరకాలా అంత బాగా సహకరించినందుకు.  

సినిమా కోర్ట్ కేసుల్లో చిక్కుకున్నా, కోవిడ్ వల్ల ఆగిపోయినా, మరేదో కారణంగా ఇంకా రిలీజ్ ఆలస్యమైనా - సరైన టైంలో సరైన నిర్ణయం వారు తీసుకోకపోయినా వారికి చాలా నష్టం జరిగేది. 

ప్రైమ్‌లో రిలీజ్ అయినా ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. 

ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేయకపోవటం అనేది నిర్మాతలు తీసుకొన్న గొప్ప నిర్ణయం. ప్రైమ్ ప్రేక్షకులు వేరే. మెయిన్ స్ట్రీం ప్రేక్షకులు వేరే.  

చెప్పాలంటే - మొత్తం మెయిన్‌స్ట్రీం ప్రేక్షకుల్లో ప్రైంలో చూసే ప్రేక్షకుల సంఖ్య 30% కూడా ఉండదు. ఈ పాయింటాఫ్ వ్యూలో నిర్మాతల నిర్ణయం చాలా వ్యూహాత్మకమైనదని చెప్పాల్సి ఉంటుంది. 

నేషనల్ అవార్డులు కనీసం ఒక 3 అయినా వస్తాయి.

లిజోమోల్ జోస్ ఈ సినిమా ద్వారా బయటికి వచ్చిన ఒక అద్భుతం. ఒక మ్యాజిక్.   

జై భీమ్ టీమ్‌కు హార్టీ కంగ్రాట్స్!

కట్ చేస్తే -             

ఒక మాస్ హిస్టీరియా గురించి చెప్పుకుందాం.

ఇది అప్పుడప్పుడూ అలా బయటపడుతుంటుంది. 

ఒక స్కై లాబ్. ఒక  Y2K. ఒక ఎమర్జెన్సీ. ఒక అన్నా హజారే. ఒక ఆ పార్టీ. ఒక  ఈ పార్టీ. ఒక పి ఎం. ఒక సి ఎం. ఇప్పుడు... ఒక సినిమా. 

వీటన్నిటికీ  లాజికల్ రీజన్స్ ఉంటాయి. కాని, ఆ లాజిక్స్ కు అతీతంగా అందరం ఏదో అలా మందలా హడావుడి పడిపోతుంటాం. మన చదువులు, మన మేధావిత్వం, పిల్లాడు కూడా అర్థం చేసుకొనే కొన్ని బిజినెస్ బేసిక్స్... అన్నీ అలా మూలన పడేస్తాం. అంతే.

ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. అది కూడా ఫ్రీ కాబట్టి అందరూ రాస్తున్నారు. 

ఇంటికో మేధావి. ఇంటికో క్రిటిక్. 

అంతకన్నా ఏం చెప్పలేం. 

వేరే భాషలో వచ్చిన ఒక మంచి సినిమాని అద్భుతం అని మెచ్చుకోవడంలో తప్పులేదు. కాని, దాని మెచ్చుకొంటూ, దాంతో పోలుస్తూ, మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక క్రిమినల్ లా చూడటం కరెక్ట్ ఎలా అవుతుంది?  

తెలుగులో అసలెన్నడూ మంచి సినిమాలు రాలేదా?  

అసలు మంచి సినిమాకు నిర్వచనం చెప్పేదెవరు?

అసలీ మంచి చెడు అనే తూనిక రాళ్ళను ఎవరు క్రియేట్ చేస్తారు? 

ఇదంతా... నథింగ్ బట్, సంపూర్ణ అవగాహనారాహిత్యం. 

ఒక "దాసి" వచ్చింది. ఒక "రంగుల కల" వచ్చింది. 

ఎంతమంది ఆదరించారు?

ఎన్ని ఇలాంటి రివ్యూలు రాశారు? 

సినిమా తీసిన డబ్బులయినా తిరిగొచ్చాయా బి నర్సింగరావుగారికి? 

మళ్లీ ఎలా తీస్తాడాయన ఇంకో సినిమా?

అంతకు ముందు నర్సింగరావు గారే తీసిన "మా భూమి" పూర్తికావడానికి, రిలీజ్ చేయడానికి... ఎంతమంది ఎన్నెన్ని అమ్ముకోవాల్సి వచ్చింది?  ఆకాలంలో మాభూమిని ఎంతో కొంత ఆదరించారు కాబట్టి ఆయన బ్రతికి బట్ట కట్టారు. ఇంకో 2, 3 సినిమాలు తీసారు. ఆ తర్వాతేమయింది?

మీకు తెలుసా... అల్లాణి శ్రీధర్ "కొమరం భీమ్" సినిమా రిలీజ్ కావడానికి 20 ఏళ్ళు పట్టింది. 

అది కూడా హైదరాబాద్ లోని ఒకే ఒక్క థియేటర్‌లో.   

ఎంతమంది చూశారు? 

ఎంతమంది రివ్యూలు రాశారు? 

అసలు "కొమరం భీమ్" నారాయణగూడాలోని ఒక థియేటర్లో రిలీజైన విషయం ఎంతమందికి తెలుసు?

ఏ భాషలో అయినా అక్కడి భౌగోళిక, సాంఘిక పరిస్థితులను బట్టి ప్రేక్షకుల అభిరుచులుంటాయి. వీటి ఆధారంగానే సినిమాల నిర్మాణం జరుగుతుంది. అరుదుగా కొన్ని అద్భుత సినిమాలు కూడా వస్తుంటాయి. ఈ అద్భుత సినిమాల జోనర్ ఏదైనా కావచ్చు.  

ఆఫ్ బీట్ సినిమాలు, సీరియస్ సినిమాలు, ఆర్ట్ సినిమాలే మంచి సినిమాలా? 

మళయాలం, తమిళం, బెంగాలీలో లాగా మనదగ్గర సినిమాలు రావు అంటే... ఏం చెప్తాం?

30 ఏళ్ల క్రితమే తెలుగులో "అంకురం" రాలేదా? ఆ కథ గుర్తుందా?   

వీళ్ళు చెప్పే భాషల్లో కూడా 100 సినిమాల్లో ఒకటో రెండో జై భీమ్‌ లాంటి సీరియస్ సినిమాలొస్తాయి  అంతే. మిగిలినవన్నీ పక్కా కమర్షియల్ సినిమాలే కదా...   

డెభ్భైల్లో, ఎనభైల్లో, మొన్న మొన్న తొంభైల్లో కూడా... తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో లెక్కలేనన్ని హాట్ సీన్‌లతో, వారం వారం ఎన్ని సెక్స్ సినిమాలు రాలేదు? వాటి డబ్బింగ్ వెర్షన్స్ ను "ఆమె మధుర రాత్రులు", సత్రంలో ఒకరాత్రి", "షకీలా నైట్స్" వంటి పేర్లతో ఎన్ని వందల సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఎగబడి చూడలేదు?  

సినిమా ప్రాథమికంగా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా. 

కోట్ల రూపాయలు, కొందరి జీవితాలతో వ్యాపారం. 

ఒక్కో ప్రాంతంలో, ఒక్కో సమయంలో, ఒక్కో బిజినెస్ ట్రెండ్ లో... ఒక్కోరకమైన సినిమాలకు ఆదరణ ఉంటుంది. బాలీవుడ్ తో సహా దేశంలోని అన్ని భాషల ఫిలిం ఇండస్ట్రీలు... కొలాబొరేషన్ కోసం, ఇన్‌స్పిరేషన్ కోసం... ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తున్నాయన్న నిజం ఎంతమందికి తెలుసు?  

తెలుగు సినిమాలు ఇప్పుడు ఇంగ్లిష్, చైనీస్, జపనీస్, కొరియన్, థాయ్ వంటి ప్రపంచభాషలతో కలిపి మొత్తం 8, 9 భాషల్లో... ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయన్న విషయం ఎంతమందికి తెలుసు? 

హిందీలో తొలి వంద కోట్ల కలెక్షన్  సినిమాను తీసింది తెలుగు నిర్మాతే. దేశంలోనే తొలి వెయ్యి కోట్ల కలెక్షన్  సినిమా తీసింది కూడా తెలుగు దర్శక నిర్మాతలే. 

ఇరాన్ సినిమాలు అద్భుతంగా ఉంటాయని, అలాంటి సినిమాలు ఇక్కడ ఇండియాలో రావటం లేదంటే ఎలా?

"తెలుగు సినిమాల్లో ఏముంటుంది?"... "తెలుగు సినిమా బాగుపడదు"... "తెలుగు సినిమాను ఎవ్వడు బాగు చెయ్యలేడు"... 

ఇలాంటి సినిక్ అభిప్రాయాలు ఉన్నవాళ్లను చూసి జాలి పడకతప్పదు. 

టికెట్ కొని, సినిమా చూసేవాడికి తాను చూసిన సినిమాను విమర్శించే హక్కు వంద శాతం ఉంటుంది. కాని, ఏడాదికో రెండేళ్లకో ఒక సినిమా చూసే కొందరు సోకాల్డ్ మేధావులు, సోషల్ మీడియా రచయితలు అసలు ఏమీ తెలియకుండానే "తెలుగు సినిమాను ఎవ్వడు బాగుచెయ్యలేడు" తరహా స్టేట్‌మెంట్లు ఇవ్వటం మూర్ఖత్వం.

ఒక్క "జై భీమ్" సినిమా చూసి, అసలు తెలుగులో మంచి సినిమాలే రానట్టు మాట్లాడ్డం అనేది మూర్ఖత్వానికి పరాకాష్ట.  

తెలుగులోనే కాదు... ప్రపంచంలోని ఏ భాషలోని ఫిలిం ఇండస్ట్రీలో అయినా కేవలం 2-3% మాత్రమే సాంఘిక స్పృహతో కూడిన సందేశాత్మక సినిమాలొస్తాయి. మిగిలినవన్నీ వినోదాత్మక కమర్షియల్ సినిమాలే ఉంటాయి. తెలుగు సినిమా అయినా, తమిళ సినిమా అయినా అంతే.  

సరే, తెలుగు సినిమా మంచిదా చెడ్డదా పక్కన పెడదాం. మీరు తెలుగు సినిమానే చూడండి అని ఎవ్వరూ మిమ్మల్ని ఫోర్స్ చెయ్యటం లేదు. అంత బలవంతంగా మీకు నచ్చని తెలుగు సినిమాలు చూడాల్సిన అవసరం లేదు. 

సినిమా అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా అందరికీ అందుబాటులో ఉన్న ఒక పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా. ప్రపంచంలోని ఏ భాషలో వచ్చిన సినిమానైనా... ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ... ఇంట్లో కూర్చొని, మనకు నచ్చిన సినిమాను, మనకు ఇష్టమొచ్చిన టైం లో చూడొచ్చు.  

"ఆగ్రాలోని తాజ్‌మహల్ లాగా హైద్రాబాద్‌లో చార్మినార్ ఎందుకు లేదు?" అని ఎవరైనా అడిగితే, ఏం సమాధానం చెప్తాం? 

ముందు... అలా అడిగిన వ్యక్తి మానసిక స్థితిని గురించి ఆలోచిస్తాం. 

ఇదీ అంతే.  

జై భీమ్! 

^^^
Written & podcast on 7th Nov 2021. Here's the link: https://youtu.be/rvlh7OQaNgc 

6 comments:

  1. Well written. Agree with you Manohar Garu.

    ReplyDelete
    Replies
    1. Thank you, Buchiki garu. దురదృష్టవశాత్తు కొందరికి నేను రాసిన పాయింట్ అర్థం కావటం లేదు. :-)

      Delete
  2. You have a valid point. Telugu has great films like Ankuram. However here big market heroes like Pawan Kalyan are making films with lot of calculations in mind, which is spoiling the orinal flavour (ex: Pink remake). Here big heroes need honesty in narrating the stories. What is harm if heroes like PK, MB and NTR make good films with some lower budget. In Telugu in big legue heroes Nag and Venky are way better than others, who are open to experiment somewhat with lower budgets.Heroes need to change mindset of 100 cr with and every film, then good pictures would come automatically.

    ReplyDelete
  3. There is anti Hindu activism agenda in such movies. The negative real life character of Anthonysamy becomes Guru Murthy in the movie.

    One more example. In sherni movie Vidya balan real life Hindu forest officer character of KM Abharana becomes Vidya Vincent. Positive characters are depicted as Non Hindu and negative characters are made Hindu. There is a clear agenda to project Hindus in poor light through movies

    ReplyDelete
    Replies
    1. I too heard about this. A point to study in depth.

      Thanks again for your comment, Buchiki garu.

      Delete