Saturday 27 November 2021

మాధవీలత స్వచ్చంద సేవకు తోడ్పడుదాం!

అప్పట్లో యూత్ హృదయాల్ని కొల్లగొట్టిన సినిమా "నచ్చావులే" ద్వారా పరిచయమైన హీరోయిన్, పొలిటీషియన్, స్వచ్చంద సేవకురాలు, మంచి మిత్రురాలు... మాధవీలత గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. 

ఆమధ్య ఉన్నట్టుండి ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా ప్రవేశించి, గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్ల్యేగా కూడా పోటీచేసింది మాధవీలత. ఆ సందర్భంగా నేనొక బ్లాగ్ కూడా రాశాను.    

ఇటీవలి కాలంలో ఒక పొలిటీషియన్‌గా, ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా, అనేక విషయాల పట్ల స్పందిస్తూ... ఒక యూట్యూబ్ చానల్ కూడా యమ యాక్టివ్‌గా రన్ చేస్తోంది మాధవీలత. 

ఈ షో కోసం, ఎవరి సహాయం లేకుండా,  "వన్ వుమన్ ఆర్మీ"గా మాధవీలత పడుతున్న కష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఎవరైనా ఇట్టే అర్థంచేసుకోవచ్చు. 

గ్రౌండ్ లెవెల్లో సమాచారం సేకరిస్తుంది, చదువుతుంది, విషయాల్ని అవగాహన చేసుకుంటుంది, విశ్లేషిస్తుంది. చక్కటి భాషలో ఎక్కడా తొణక్కుండా ప్రజెంట్ చేస్తుంది. అవసరమైనప్పుడు ఎలాంటి సంకోచం, భయం లేకుండా ఒక ఫైర్ బ్రాండ్‌గా కూడా మాటలతో శివమెత్తుతుంది. 

ఒక్కరుగా ఇదంత చేయటం అంత చిన్న విషయమేం కాదు.    
 
ఇంత బిజీ యాక్టివిటీ మధ్య... ఓ కొత్త సినిమా ద్వారా, మళ్ళీ మనకు ఒక మంచి టాలెంటెడ్ హీరోయిన్‌గా కూడా త్వరలో కనిపించబోతోంది మాధవీలత.    


కట్ చేస్తే - 

బేసిగ్గా మాధవీలత ఒక వెరీ సెన్సిటివ్ హ్యూమన్ బీయింగ్. "నక్షత్ర ఫౌండేషన్" ద్వారా, గత పదేళ్ళుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చాలా యాక్టివ్‌గా చేస్తోంది మాధవీలత. 

ఇటీవలి వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని చాలా చోట్ల జరిగిన భారీ నష్టం నేపథ్యంలో, నక్షత్ర ఫౌండేషన్ ద్వారా తన వంతుగా వీలైనంత సహాయం చేయాలని సంకల్పించింది మాధవీలత. 

ఆ వివరాల్ని మాధవీలత మాటల్లోనే విందాం. 

ఈ ప్రయత్నంలో మనకు తోచినంత సహాయం చేస్తూ మాధవీలత ప్రయత్నానికి తోడ్పడుదాం. 

No comments:

Post a Comment