Saturday 13 November 2021

బ్లాగింగ్ సినిమా!

వరుసగా తర్వాతి 365 రోజులు... అంటే 2022 నవంబర్ వరకు ఈ బ్లాగ్‌లో ఇంక దాదాపు అన్ని పోస్టులూ సినిమా స్టఫ్‌తోనే నిండి ఉంటాయి. 

ఒక చిన్న కదలిక. ఎప్పుడు, ఎలా వస్తుందన్నది ఇంకా అస్పష్టం. కాని, అతి త్వరలోనే ఉంటుంది.

వరుసగా సినిమాలు చేసే పనిలో, మొట్టమొదటిసారిగా దారుణమైన కన్విక్షన్‌తో ఉన్నాను.

త్వరలోనే ఆ న్యూస్ కూడా పోస్ట్ చేస్తాను.   

కట్ చేస్తే - 

మా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ (#TFDA) ఎన్నికలు ఆదివారం ఉన్నాయి. మొదటి వోట్ వేయటానికి జస్ట్ ఒక 33 గంటల టైం మాత్రమే ఉంది.

ఇవ్వాటితో క్యాంపెయిన్ కూడా అయిపోయింది. రేపు గ్యాప్. ఎల్లుండి ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్. అప్పటికప్పుడే ఇంకో 2 గంటల్లో కౌంటింగ్. ఆతర్వాత ఓ 2 గంటల్లో ఫలితాలు, బహుశా!  

అంతే!  

నమ్మశక్యంగా లేదు కదూ?

నాకూ అలాగే ఉంది. చాలా చప్పగా!😊

మూడు ప్యానెల్స్ పోటీలో ఉన్నాయి. 2200 మంది వోటర్లున్నారు. 

చడీ చప్పుడు లేదు. అసలు క్యాంపెయిన్ కూడా ఎప్పుడు మొదలయింది, ఎప్పుడు పూర్తయ్యింది కూడా నాకే తెలీదు. 

జస్ట్ 800 మంది వోటర్స్ ఉన్న "మా" వాళ్ల క్యాంపెయిన్ ఏ రేంజ్‌లో జరిగింది? చానెల్స్ ఏ రేంజ్‌లో బ్రేకింగ్ న్యూస్‌లిచ్చాయి? ఎన్నిరోజులు నడిచిందా సందడి? ఆ లొల్లి?🙏😊 

మరి 2200 మంది వోటర్స్ ఉన్న మా దర్శకుల అసోసియేషన్ ఎన్నికలు ఏ రేంజ్‌లో, ఎంత అరాచకంగా జరగాలి?😜😊 

అసలేం లేదే?

ఉండదు. 3 ప్యానల్స్ రంగంలో ఉన్నా, వాటిలో ఏ ఒక్క ప్యానెల్ నెగ్గినా... మళ్ళీ అందరం ఒక్కటే. ఈ డిసిప్లిన్ గురించి మా వాళ్ళు ముందే మాకు చెప్పారు.     

మేం దర్శకులం.

క్రియేటివిటీ ఒక్కటే మేం పట్టించుకొనేది. మిగిలిందంతా ఉట్టి ట్రాష్.     

కట్ చేస్తే - 

సరదాగా రాసిన పోస్ట్ ఇది.

"మా" వాళ్ళు చూసి మరింత సరదాగా నవ్వుకోవాలని రాసిన పోస్ట్ ఇది.  

ఆదివారం ఉదయం నేను వోటెయ్యబోతున్నాను. నేను వోటేసిన ప్యానెలే గెలుస్తుంది.😊 గెలవని ప్యానెల్స్‌లో నుంచి కూడా ఒకరిద్దరు అభ్యర్థులు వారికున్న సొంత ఇమేజ్‌తో గెలవ్వొచ్చు. 

గెలవని ప్యానెల్స్ వాళ్ళు కూడా గెలిచినట్టే నేను భావిస్తాను. ఎన్నికల్లో పాల్గొనటమే వారి తొలిగెలుపు కాబట్టి.    

పోటీచేస్తున్న దర్శక మిత్రులు, గౌరవ సీనియర్ దర్శకులు అందరికీ నా బెస్ట్ విషెస్...  

No comments:

Post a Comment