Saturday 9 October 2021

మానవ సంబంధాలన్నీ మార్కెటింగ్ సంబంధాలే!

సోషల్ మీడియా అంటే జస్ట్ సూక్తి ముక్తావళేనా?... అనిపిస్తుంది అప్పుడప్పుడూ. కాని కాదు. 

సోషల్ మీడియాలో సగానికిపైగా కొటేషన్లు, సూక్తులే కనిపిస్తాయి. మిగిలిన సగం రాజకీయాలు, సినిమాలు, ఫ్యాన్స్ ట్రోల్స్, ఇతర స్టఫ్ ఉంటుంది.

కాని, వీటన్నిటి మధ్య – అరుదుగా – అక్కడక్కడా – నిజంగా మనల్ని ఇన్‌స్పైర్ చేసే విషయాలు, ‘సాధ్యమే కదా’ అనిపించే విజయాలు కనిపిస్తాయి.

సెల్ఫ్ మోటివేషన్ కోసం, డల్ అయి డిప్రెషన్‌లోకి వెళ్లనీయని ఒకలాంటి డ్రైవ్ కోసం... అప్పుడప్పుడూ నేను కూడా నాకు నచ్చిన కొన్ని కొటేషన్స్, నాకు ఆ సమయంలో, ఆ మూడ్‌లో తోచిన కొన్ని మాటలు ఏవేవో నా సొషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పోస్ట్ చేస్తుంటాను. 

వీటన్నిటిలోనూ – నాకు తెలిసిన తేడా ఒక్కటే… 
ఎడాలిసెంట్ వయస్సులో పెట్టే కొటేషన్స్, రాసే రాతలు వేరు. జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ళు, ఎంజాయ్ చేసిన అనేక అనుభవాల నేపథ్యంలో రాసే రాతలు, పోస్ట్ చేసే కొటేషన్స్ వేరు.

ఇవన్నీ కూడా సమాజంలో మన చుట్టూ ఉన్న వివిధరకాల వ్యక్తుల, వ్యక్తిత్వాల నేపథ్యంలో పుడతాయి. అప్రయత్నంగా సేకరించబడతాయి. 

వీటిలో ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చాలన్న రూలేమీ లేదు. అయితే – ఏది మనకు నిజంగా ఉపయోగపడుతుందన్నది మన విచక్షణా జ్ఞానం పైన, మన వ్యక్తిత్వం, మన జీవనశైలి పైన, జీవితాన్ని మనం చూసే దృక్పథం పైన ఆధారపడి ఉంటుంది.

అయితే - కొన్ని విషయాల్లో ఒడ్డున ఉండి సలహాలు, సూచనలు ఇవ్వడం… సామెతలు, కొటేషన్స్ పోస్ట్ చేయడం చాలా సులభం. కాని, దిగినప్పుడే తెలుస్తుంది అసలు లోతెంతో.

కట్ చేస్తే –

సోషల్ మీడియాలో కొంత సెల్ఫ్ మార్కెటింగ్ కూడా ఉంటుంది. మన వాయిస్‌ను, మన బ్రాండ్‌ను, మన వృత్తిపరమైన అవసరాలను ఒక స్థాయిలో ప్రచారం చేసుకొనే అవకాశం సొషల్ మీడియా మనకు ఉచితంగా ఇస్తుంది.

అంతే కాదు – ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కేవలం ఈ సోషల్‌మీడియాలోని వివిధ ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగించుకొంటూ మిలియన్లు సంపాదించుకొంటున్నారు. ఇందులో మన షేర్ ఎక్కడ, ఎంత అనేది మనమే నిర్ణయించుకోవాలి. 

ఈ నేపథ్యంలో - ప్రొఫెషనల్‌గా నాకూ అవసరం కాబట్టి నేను కూడా కొన్నిసార్లు ఈ సెల్ఫ్ మార్కెటింగ్ అనబడే ‘సొంత డబ్బా’ పోస్టులు, ఫోటోలు పెడుతుంటాను. చాలాసార్లు అవి నేను ఊహించని స్థాయిలో, నాకు కూడా తెలియకుండా షేర్ చేయబడుతుంటాయి. 

ఈ ఒక్క విషయంలో సోషల్ మీడియా అంటే నాకు ఎక్కడలేని అభిమానం, ప్రేమ, అన్నీ. :-)

సొషల్ మీడియా ఇంకో అద్భుతమైన గొప్పతనం ఏంటంటే – ఎప్పుడో దశాబ్దాల క్రితం మనకు దూరమైన మన స్నేహితులను, బంధువులను, శ్రేయోభిలాషులను, మనకు అంతకుముందు ఎప్పుడూ పరిచయం లేని లైక్-మైండెడ్ మిత్రులనూ దగ్గర చేస్తుంది. 

ఫేస్‌బుక్ అయితే, మనం మర్చిపోయే అవకాశం ఉన్న ఎన్నో జ్ఞాపకాలను ప్రతిరోజూ మెమొరీస్ రూపంలో గుర్తుచేస్తుంది. ఈ విషయంలో కూడా సోషల్ మీడియా అంటే నాకు పిచ్చి ఇష్టం.

పాజిటివ్ యాంగిల్‌లో చూడగలిగితే, ఉపయోగించుకోగలిగితే – సోషల్ మీడియా వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అయితే దీన్ని మనం ఎలా ఉపయోగించుకొంటాం అన్నది నిజంగా మనకి మనం వేసుకోవాల్సిన ఒక మిలియన్ డాలర్ కొశ్చన్.

After all... మానవ సంబంధాలన్నీ మార్కెటింగ్ సంబంధాలే! 

“Think about what people are doing on Facebook today. They’re keeping up with their friends and family, but they’re also building an image and identity for themselves, which in a sense is their brand. They’re connecting with the audience that they want to connect to. It’s almost a disadvantage if you’re not on it now.”
— Mark Zuckerberg

No comments:

Post a Comment