Friday 29 October 2021

స్వచ్ఛమైన ఆ చిరునవ్వుకు శ్రధ్ధాంజలి!

జస్ట్ రెండురోజుల క్రితమే నేనొక మిత్రునితో చెపాను... "మనకు ఎంతో టైమ్ ఉందని అనుకోకు. ఉన్న టైమ్‌ని మాత్రం కనీసం 10X స్పీడ్‌లో పనిచేసుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ గడిపేద్దాం" అని. 

నిన్న రాత్రే 'ఓషో' కొటేషన్ ఒకటి నా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాను: "The real question is not whether life exists after death. The real question is whether you are alive before death."

ఎప్పుడో ఏదో చేస్తాం, ఇంకా టైముందిలే అని అనుకోడానికి లేదు. చిన్నవో పెద్దవో తప్పక పూర్తిచేయాల్సిన బాధ్యతలు, పనులు వెంటనే పూర్తయ్యేలా అన్నీ ప్లాన్ చేసుకోవటం, అలా పని చేయటం చాలా అవసరం అని నా ఉద్దేశ్యం. 

ఇలాంటి జ్ఞానోదయం నాకు అవటానికి ప్రధాన కారణం... కరోనా వైరస్, నిన్నమొన్నటిదాకా మనకు రకరకాలుగా చుక్కలు చూపించిన లాక్‌డౌన్. 

సో, థాంక్స్ టు లాక్‌డౌన్... నాలో చాలా మార్పు వచ్చింది.

So much to do. So little time!  

కట్ చేస్తే - 

ఇవ్వాళ ఉదయం పునీత్ రాజ్‌కుమార్ విషాద వార్త పెద్ద షాక్. 

స్వచ్ఛమైన ఆ చిరునవ్వును మళ్ళీ చూడలేం. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కుటుంబానికి, మిత్రులకు, ఫ్యాన్స్‌కు నా ప్రగాఢ సానుభూతి. 🙏 

చావు ఎవరికైనా తప్పదు. దాన్ని నివారించలేం. కాని, దానికి కూడా కొన్ని బేసిక్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది అప్పుడప్పుడు. 

ఒక బాంబ్ పేలటం కాదు. ఒక యాక్సిడెంట్ కాదు. ఒక సునామీ కాదు. రోజూలాగే క్యాజువల్‌గా జిమ్‌కు వెళ్ళినవాడు ఇంటికి తిరిగివచ్చే నమ్మకం కూడా లేదు. 

లాక్‌డౌన్‌లో ఎందరో నాకు తెలిసినవాళ్ళు, నాకంటే చిన్నవాళ్ళూ... చూస్తుండగా అలా పిట్టల్లా రాలిపోయారు. 

చావు ఎలాగూ ఎవరికైనా తప్పదు. కాని, ఇలాంటివి మనకు ఎక్కువ సమయం లేదు అన్న విషయాన్ని, మన బాధ్యతల చిట్టాను గుర్తుచేస్తూ ఒక్కసారిగా షేక్ చేస్తాయి.

ఇలా నేనీ ఈ బ్లాగ్ పోస్ట్ రాయడం నెగెటివ్ థింకింగ్ కాదు...

"మనకున్న సమయాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవడంలో ఏమాత్రం అశ్రద్ధ చూపొద్దు... ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ, మరింత త్వరపడాలి" అని నన్ను నేను అలర్ట్ చేసుకోవడం.

మిత్రులు, శ్రేయోభిలాషులను వారు చేయాల్సి వున్న అసలు పనులమీద నుంచి దృష్టి మరల్చవద్దంటూ, ఉన్నన్ని రోజులూ జీవితాన్ని తనివితీరా జీవించాలంటూ... ఫ్రెండ్లీగా మోటివేట్ చేయటం.

ఆర్జీవీ కూడా ఇవ్వాళ ఇలాంటి ట్వీట్ పెట్టాడంటే... ఎందుకు పెట్టడు? అతను కూడా మనిషే. అతనికీ చావుంది. ఇలాంటి విషాదవార్తలకు ఎవరైనా షాకవుతారు. ఇలాగే స్పందిస్తారు.    

"Apart from the shocking tragedy that Puneeth Rajkumar's sudden death is, it is also a scary and terrifying eye opening truth that any of us can die anytime. So it is best to live life on a fast forward mode, while we are still alive." - Ram Gopal Varma  

No comments:

Post a Comment