Monday 18 October 2021

రెడ్ వైన్ ఎందుకు మంచిది?

సుమారు పాతికేళ్లక్రితం నేను ఆలిండియా రేడియో, కర్నూలు ఎఫ్ ఎం లో పనిచేస్తున్నప్పుడు, నా కొలీగ్ అపోలిన్ డిసౌజా, నేనూ ఒక బ్యాంక్ మేనేజర్ ఇంట్లో రెంట్‌కి ఉండేవాళ్లం. 

కింది గదిలో డిసౌజా, పైన పెంట్ హౌజ్‌లో నేను. 

అప్పుడు ఇద్దరం బాచిలర్సే. 

పైన పెంట్ హౌజ్ కాబట్టి డిసౌజా కంటే నాకు 'ఫ్రీడం' కొంచెం ఎక్కువగా ఉండేది. 

వన్ ఫైన్ మార్నింగ్ డిసౌజా నా రూమ్‌కు వచ్చి చెప్పాడు: "మనం రెడ్ వైన్ తయారుచేసుకుందాం. పైన నీ రూం అయితే ఓనర్స్‌తో ప్రాబ్లం ఉండదు" అన్నాడు. 

డిసౌజా నేపథ్యం కొంకణ్ ఏరియాలోని మంగుళూరు. అక్కడి పద్ధతుల ప్రకారం ఈ రెడ్ వైన్ కల్చర్ డిసౌజాకు బాగా తెలుసు. 

క్యూరియాసిటీతో ఓకే చెప్పాను. 

కట్ చేస్తే - 

మార్కెట్‌కు వెళ్ళి ద్రాక్ష, రెండు కొత్త కుండలు ఎట్సెట్రా సరంజామా కొనుక్కొచ్చాము. "మంచి క్వాలిటీ రెడ్ వైన్ ఇంట్లోనే తయారు చేసుకోడం ఎలా?" అంటూ మా ప్రాసెస్ మొదలైంది.   

దాదాలు ఒక నెలరోజులపాటు (ఇంకా ఎక్కువేనేమో, గుర్తులేదు సరిగ్గా) ఒక కుండలోంచి ఇంకో కుండలోకి, అట్నుంచి ఇటు... ఇట్నుంచి అటూ... దాన్ని దొర్లించి దొర్లించి... మొత్తానికి మస్త్ రెడ్ వైన్ తయారుచేసుకున్నాం. 

అలా మేం తయారుచేసుకున్న రెడ్ వైన్‌ను బాటిల్స్‌లో నింపుకొని... రోజూ ఆఫీస్ నుంచి వచ్చాక కొంచెం కొంచెం సిప్ చేస్తూ, అమృతంలా ఫీలవుతూ ఓ నెలపాటు త్రాగాం. 

అలా... రెడ్ వైన్ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి మా డిసౌజా. 

కట్ చేస్తే -   

ప్రపంచంలోని చాలా దేశాల సంస్కృతుల్లో, ఈరోజుకి కూడా, వారి డైనింగ్ టేబుల్ మీద ఒక రెడ్‌వైన్ బాటిల్ ఉంటుంది. ప్రతిరోజూ వారి డిన్నర్‌లో ఆహారంతోపాటు, వైన్ కూడా ఒక విడదీయరాని భాగం. 

మన దేశంలో కూడా, కొంకణ్ ప్రాంతంలో ఈ సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతోంది. కార్వార్, మంగళూరు వంటి ప్రాంతాల్లో పండుగలకు, పెళ్ళిళ్లకు మన ఇళ్లల్లో ప్రత్యేకంగా పిండివంటలు ఎలాగైతే చేసుకుంటామో, వారి ఇళ్లల్లో వైన్ కూడా అలా తయారు చేసుకుంటారు, సేవిస్తారు.

ప్రధానంగా నల్లటి ద్రాక్షపళ్లను మెత్తగా నలిపి, మరి కొన్ని పదార్థాలను అందులో కలిపి, కొన్ని రోజులపాటు ఒక పద్ధతి ప్రకారంగా ప్రాసెస్ చేస్తే వచ్చేదే ఈ రెడ్ వైన్.

వైన్‌లో 15% కంటే తక్కువ ఆల్కహాల్ ఉంటుంది. మిగిలిన లిక్కర్స్‌లో 30% కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉంటుంది. సంబంధిత నిపుణులు చెప్తున్నా దాని ప్రకారం... వైన్ ఆరోగ్యానికి మంచిది అని చెప్పడానికి ప్రధానంగా ఇదొక్కటే కారణం కాదు. ఇంకెన్నో ఉన్నాయి. వాటిల్లో ఒక 3, 4 లాభాల గురించి మాత్రం ఇక్కడ చూద్దాం:

1. గుండె సంబంధిత వ్యాధులు రావడాన్ని రెడ్ వైన్ అరికడుతుంది. సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్ (CDP) గైడ్‌లైన్స్ ప్రకారం ఆడవాళ్ళయితే రోజూ ఒక గ్లాస్ వైన్ తీసుకోవచ్చు. మగవాళ్లయితే 2 గ్లాసులవరకు తీసుకోవచ్చు. వైన్‌కు సంబంధించినంతవరకు, దీన్ని "మాడరేట్ డ్రింకింగ్" అంటారు. (1 వైన్ గ్లాస్ = 147 ఎం ఎల్).
2. గ్లకోమా, కాటరాక్ట్ వంటి దృష్టిలోపాలు వైన్ తీసుకోడంవల్ల (వయసు మీద పడ్డా) అంత త్వరగా రావు.
3. జ్ఞాపకశక్తికి రెడ్ వైన్ చాలా మంచిది. మీకు ఎంత వయసొచ్చినా, అల్జీమర్స్ మీ జోలికి రావడానికే భయపడుతుంది. మధ్య యుగాలనుంచి, ఇప్పటివరకు వివిధ మోనాస్ట్రీల్లో ‘మాంక్స్’ ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి రెడ్ వైనే కారణం అని చరిత్ర, అధ్యయనాలు చెప్తూ వస్తున్నాయి.
4. రెగ్యులర్‌గా వైన్ తీసుకొనేవారి వయస్సు చెప్పటం కష్టం. మీ లుక్ , మీ గ్లామర్, మీ అందం… వీటిమీద రెడ్ వైన్ ఎఫెక్ట్ అంత పాజిటివ్‌గా ఉంటుంది!

పైన చెప్పిన 4 లాభాలకు శాస్త్రీయ అధ్యయనాల సపోర్ట్ మీకు గూగుల్‌లో కొడితే వందల్లో  కనిపిస్తాయి. 


ఇంకా పెద్ద లిస్టు ఉంది. కాని, పర్సనల్ గా నాకు నచ్చిన నాలుగు లాభాలు మాత్రమే ఇక్కడ లిస్టు చేశాను. ఇప్పటికీ, సోషల్‌గా ఎప్పుడైనా గ్లాస్ పట్టుకోవాల్సిన అవసరం వస్తే మాత్రం, నేను రెడ్ వైన్ మాత్రమే ప్రిఫర్ చేస్తాను.  

అదలా ఉంచితే - ప్రపంచంలోని టాప్ 10 హాప్పీయెస్ట్ కంట్రీస్‌లో, ప్రతి ఇంట్లో, ఈ రెడ్ వైన్ అనేది డైనింగ్ టేబుల్ మీదుండే ఒక మామూలు తప్పనిసరి పానీయం అంటేనే మనకు మొత్తం సీన్ అర్థమైపోతుంది.

వార్నింగ్: ‘మాడరేట్’ అన్న పదాన్ని ముందు అర్థం చేసుకొని, ఒకసారి డాక్టర్ సలహా కూడా తీసుకొని, ఆ తర్వాతే రెడ్ వైన్ సిప్ చేయండి. తర్వాత నా పూచీ లేదు.🙏🙂

11 comments:

 1. మిమ్మల్ని మీటవ్వాలి అనుకునేవాళ్ళకి ఏదో హింట్ ఇచ్చినట్టుందీ? 🙂

  ReplyDelete
  Replies
  1. ఓ... అలా అనిపించిందా!?

   నేను ఈ బ్లాగ్ పోస్ట్ అలాంటి ఉద్దేశ్యంతో రాయలేదు. బోర్ కొడుతుంటే, సినిమా టాపిక్ కాకుండా ఇంకేదైనా ఇప్పటివరకు ఈ బ్లాగ్‌లో రాయని టాపిక్ రాయాలనుకున్నాను. అప్పుడు మెరిసిన టాపిక్ ఇది. అంతకంటే ఏం లేదు. 🙂🙂

   Delete
 2. "துந்டி போகாதே.." పాట ఉండే మూవీ.. ఆఁ గుర్తుకు వచ్చింది సర్.. "హుషారు" లో మిత్రగణం "кавоом" తయారు చేసినట్టు మీరు తయారు చేశారా సర్.. ఏదైతేనేమి.. లైఫ్ ను "தல்லி போகாதே எநயும்.." అంటు బతిమిలాడెంత దాక తెచ్చుకోకపోతే అదే మంచిది..

  హుషారూ, அச்சம் எந்பது மடமயாடா మూవిలకు గాను గాత్ర దానం చేసిన సిద్ శ్రీరామ్ గారికి మరియు చిమ్మణి మనోహర్ గారికి క్షమాపణలతో..!

  ReplyDelete
  Replies
  1. మీరు కోట్ చేసిన తమిళం ఏంటో నాకు చదవటం రాదు కాబట్టి, నాకు విషయం ఏం అర్థం కాలేదు. అర్థమయ్యేట్టు చెప్తే సంతోషిస్తాను. :-)

   Delete
  2. తప్పకుండ సర్:

   "తుండి పోగాదే../ఉండి పోరాదే" పాట ఉండే మూవీ.. ఆఁ గుర్తుకు వచ్చింది సర్.. "హుషారు" లో ఆయా మిత్రగణం "кавоом" తయారు చేసినట్టు మీరూ తయారు చేశారా సర్.. ఏదైతేనేమి.. లైఫ్ ను "తల్లి పోగాదే ఎనయుం../వెళ్ళి పొమాకే " అంటు బతిమిలాడెంత దాక తెచ్చుకోకపోతే అదే మంచిది..

   హుషారూ, అచ్చం ఎన్‌బదు మడమయాడ/సాహసం శ్వాసగా సాగిపో మూవిలకు గాను గాత్ర దానం చేసిన సిద్ శ్రీరామ్ గారికి మరియు చిమ్మణి మనోహర్ గారికి క్షమాపణలతో..!

   అంతే..!
   ~శ్రీత ధరణి

   Delete
  3. https://youtu.be/TM8GCe-dnMg
   https://youtu.be/PiL5UTTTrxk

   Delete
  4. శ్రీత ధరణి గారికి, చిరు డ్రీమ్స్ గారికి, రాకేశ్ గారికి many thanks.

   Delete
 3. తమిళ పదాలకు అనువాదంతో...

  துந்டி போகாதே. (తూండీ పోగాదే, నిరుత్సాహపడవద్దు) . " పాట ఉండే మూవీ.. ఆఁ గుర్తుకు వచ్చింది సర్.. "హుషారు" లో మిత్రగణం "кавоом" తయారు చేసినట్టు మీరు తయారు చేశారా సర్.. ఏదైతేనేమి.. లైఫ్ ను "தல்லி போகாதே எநயும்..(తల్లీ పోగాదే ఎనయుమ్- తోసుకుని పోవద్దు ఇంకా) " అంటు బతిమిలాడెంత దాక తెచ్చుకోకపోతే అదే మంచిది..

  హుషారూ, அச்சம் எந்பது மடமயாடா (అచ్ఛమ్ ఎన్-బదు మడమయడా, పిరికితనం అన్నది మూర్ఖమురా). మూవిలకు గాను గాత్ర దానం చేసిన సిద్ శ్రీరామ్ గారికి మరియు చిమ్మణి మనోహర్ గారికి క్షమాపణలతో..!

  ReplyDelete
  Replies
  1. ಧನ್ಯವಾದಗಳು ರಾಕೇಷ್ ಆವರೇ. ತುಂಬ ಧನ್ಯವಾದಗಳು ಮತ್ತು ಅಭಿವಾದ.

   Delete
  2. మీకు కూడా ತುಂಬ ಧನ್ಯವಾದಗಳು!! :-)

   Delete