Sunday 17 October 2021

నడిగర్ సంఘం - AMMA - MAA

"Cine'MAA'  people proved to the audience, that they are actually a CIRCUS!" - RGV

కరోనా లాక్‌డౌన్ సమయంలో - తమిళంలో మణిరత్నం తలపెట్టిన "నవరస" 9 భాగాల వెబ్  సీరీస్ (నెట్‌ఫ్లిక్స్) కోసం, ఆయన కోరిన ప్రతి ఒక్క తమిళ ఆర్టిస్ట్, టెక్నీషియన్ ఫ్రీగా పనిచేశారు. 

సుమారు 17 కోట్ల ఆదాయం వచ్చింది. దాంతో 12,000 మంది సినిమా వర్కర్స్‌కు 6 నెలలపాటు బ్రతకడానికి సరిపడా సపోర్ట్ ఇచ్చారు!  

ఆ వివరాలు ఈ వీడియోలో చూడొచ్చు:  https://youtu.be/zBkiefvQJ6I

కట్ చేస్తే - 

తెలుగు సినీ ఆర్టిస్టులకు MAA (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఉన్నట్టే, తమిళ ఆర్టిస్టుల కోసం "నడిగర్ సంఘం" ఉంది. మళయాళంలో AMMA (అసోసియేషన్ ఆఫ్ మళయాళం మూవీ ఆర్టిస్ట్స్) ఉంది. 

మళయాళం AMMA, గత ఫిబ్రవరిలో ఇలాంటిదే ఒక భారీ చారిటీ ఫండ్‌రైజింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. AMMAలో ఉన్న దాదాపు 140 మంది టాప్, మిడ్ రేంజ్, ఇతర ప్రముఖ ఆర్టిస్టులతో ఒక కమర్షియల్ థ్రిల్లర్ సినిమా ప్లాన్ చేసింది. 

ఈ సినిమాకోసం మమ్ముట్టి, మోహన్‌లాల్ కూడా ఫ్రీగా పనిచేస్తున్నారు. 

కమర్షియల్ సినిమా కాబట్టి ఇంచుమించు ఓ 15-20 కోట్లయినా వస్తాయి. ఈ డబ్బుతో కరోనా టైమ్‌లో బాధపడ్డ ఇండస్ట్రీ వర్కర్స్‌కు, ఇతరత్రా బాధల్లో ఉన్న AMMA ఆర్టిస్టులకు ఈ డబ్బు ద్వారా సహాయం చేస్తున్నారు. 

ఈ సినిమా ప్రకటన సమయంలోనే, అంటే మొన్న ఫిబ్రవరిలో, AMMA వారి కొత్త బిల్డింగ్ కాంప్లెక్స్ కొచ్చిలో ప్రారంభించారు.  

స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ సౌకర్యాలన్నీ ఉన్న ఈ బిల్డింగ్ కాంప్లెక్స్‌లో – AMMA మెంబర్ ఆర్టిస్టుల కోసం 150 సీటర్స్ మినీ థియేటర్ ఉంది. కథా చర్చల కోసం ప్రత్యేకంగా కొన్ని క్యాబిన్స్ కూడా ఏర్పాటు చేశారు.

AMMA ఏర్పాటైన 25 ఏళ్ల తర్వాత – 2019 లో – ఈ నూతన భవన సముదాయం నిర్మాణం ప్రారంభించారు. సరిగ్గా 18 నెలల్లోనే అద్భుతంగా నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ భవనంలోనే ఇప్పుడు అసోసియేషన్ సమావేశాలన్నీ జరుగుతున్నాయి. 

తమిళం, మళయాళం ఫిలిం ఇండస్ట్రీల్లో కూడా ఆయా ఆర్టిస్టుల అసోసియేషన్లకు రెగ్యులర్‌గా ఎన్నికలు జరుగుతున్నాయి.  కాని, ఇక్కడ "మా"లో జరిగినంత రచ్చ ఈ రెండుచోట్లా ఎప్పుడూ జరగలేదనుకుంటాను.  

కరోనా సమయంలో - తెలుగు ఇండస్ట్రీలో కూడా కొన్ని చారిటీ కార్యక్రమాలు బాగానే జరిగాయి కాని, పైన చెప్పిన స్థాయిలో ఏం జరిగినట్టులేదు. 

అయితే - మొన్నటి  MAA ఎలక్షన్లు మాత్రం పీక్స్! 

ఇలాంటి విషయాల్లో "మా"కు ఎవ్వరూ పోటీ రారు, రాలేరని... బాగా ప్రూవ్ చేసుకున్నారు.  

వీళ్ల గొడవంతా రోజూ టీవీ చానెల్స్‌లో, సోషల్ మీడియాలో చూస్తూ... "మీ సినిమావాళ్ళు మరీ ఇట్లనా?!.." అంటూ ప్రతిఒక్కరూ ఏదో ఒక ఎగతాళి మాట అనటం... కామన్ అయిపొయింది. 

అసలు MAA ఎలక్షన్లకు, మిగిలిన 23 క్రాఫ్టుల్లో పనిచేసేవారికీ ఎలాంటి సంబంధం లేకపోయినా, "మీ సినిమావాళ్ళు...",  "మీ సినిమావాళ్ళు..." అంటూ రోజూ నానా సెటైర్స్ వినాల్సి వచ్చింది.

ఎలక్షన్లు అయిపోయినా... ఆ గొడవ ఇంకా ముగిసినట్టులేదు!  

చివరికి MAA రెండు ముక్కలు కూడా కావొచ్చు అంటున్నారు. 

ఎన్ని ముక్కలైనా చేస్కోవచ్చు, అది వారిష్టం. కాని, మరీ ఇంతలా ఇజ్జత్ తీసుకోకపోతే బావుంటుంది. 

వాళ్ళ మాటల్లోనే చెప్పాలంటే... కొంచెం... "డీసెన్సీ, డిగ్నిటీ" కూడా అవసరం. 

4 comments:

 1. "మా" కెందుకీ న్యూసెన్స్.?. అని అనిపించింది

  ReplyDelete
  Replies
  1. నిజంగా అంత హైప్ చెయ్యాల్సిన విషయం కాదిది. కాని చానెల్స్ చేస్తాయి. వాటి TRP అవసరం వాటికుంది. :-)

   Thanks for the comment.

   Delete
 2. కొన్ని నాన్సెన్సులనుంచి దృష్టి మళ్ళించేందుకు కొన్ని న్యూసెన్సులు పనికిరావచ్చు
  కొత్త "news"ence సృష్టించేందుకు కొంత నాన్సెన్స్ క్రియేట్ అయ్యుండొచ్చు 😆

  ReplyDelete
  Replies
  1. మీరన్నది కూడా నిజం కావచ్చు. చెప్పలేం!

   "మా"లో ఇది నిజంగా ఇలా జరిగే వ్యవహారమే. నేపథ్యంలోని అసలు విషయం వేరే అని నేను విన్నాను. కాని, 900 మందికి సంబంధించిన ఈ చిన్న అంశాన్ని ఒక అంతర్జాతీయ సమస్యగా రోజులతరబడి చానెల్స్ ఊదరగొట్టటం మాత్రం సరైంది కాదు. మీరన్నట్టు వారికి ఇంకేదైనా అవసరం ఉండొచ్చు.👍😊

   Thanks for the comment.

   Delete