Sunday 26 September 2021

ఈ వీకెండ్ రత్నాకర్ నుంచి నాకు కాల్ రాలేదు!

జీవితం నీటిబుడగ లాంటిది...

నా వెబ్ మ్యాగజైన్ గురించి టెక్నికల్‌గా నాకు అప్పుడప్పుడూ సహాయపడుతూ, మొన్న 15 వ తేదీవరకు నాతో టచ్‌లోనే ఉన్న రత్నాకర్ 21 వ తేదీ చనిపోయాడు. 

ఇప్పుడు రత్నాకర్ నుంచి మళ్ళీ నాకు కాల్ రాదు అంటే నమ్మలేకపోతున్నాను.

గుంటూరు నవోదయ విద్యాలయలో నా విద్యార్ఠి రత్నాకర్ నా కంటే చాలా చాలా చిన్నవాడు. హైద్రాబాద్‌లో జాబ్ చేస్తున్నాడు. 

గర్వం లేదు. నెగెటివ్ థింకింగ్ లేదు. మిత భాషి. దైవం పట్ల నమ్మకం, ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువ. టెన్షన్స్ పెట్టుకొనే పనులు చెయ్యడు. 

అతనికే కార్డియాక్ అరెస్ట్ అట! 

అంతే, మళ్ళీ కోలుకోలేదు.

అతను చేస్తున్న ఉద్యోగంలోనో, పర్సనల్‌గా జీవితంలోనో ఎంత స్ట్రెస్ లేకపోతే ఇలా అవుద్ది?

అసలెప్పుడిలా జరిగింది... ఎప్పుడు  హాస్పిటల్లో ఉన్నాడు... ఎప్పుడు శాశ్వతంగా పోయాడు... ఇదంతా నాకు తెలియదు. 

మొన్నొకరోజు ఉదయం మొబైల్ ఓపెన్ చెయ్యగానే ఫేస్‌బుక్ ఫీడ్‌లో ముందు కనిపించింది ఈ వార్త.  

ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. 

ఈ మధ్య నా వెబ్ మ్యాగజైన్ ప్రయోగాలప్పుడు మళ్ళీ కనెక్ట్ అయ్యాడు రత్నాకర్. అంతకు ముందు నాకు మా బేగంపేట్ ఆఫీస్ దగ్గర అప్పుడప్పుడు కనిపించేవాడు. 

దాదాపు ప్రతి వీకెండ్‌కి ఒక 2 నిమిషాలైనా కాల్ చేసి పలుకరిస్తాడు రత్నాకర్.

ఏదన్నా టెక్నికల్ డౌట్ ఉందా... ఇంకేదైనా అవసరముందా సర్ అని కనుక్కుంటాడు.

ఇంక ఎలాంటి చిన్న చిన్న డౌట్స్ కూడా కనుక్కునే పనిలేకుండా, 100% నేనే చేసుకొనే క్రియేటివ్ ప్లాట్‌ఫామ్ ఒకటి కొత్తగా కల్పించుకున్నాను అనీ, "ఆల్ ఓకే" అనీ... ఈ వీకెండ్ రత్నాకర్‌తో హాపీగా చెప్పాలనుకున్నాను.   

కాని, చూడండి... ఈ వీకెండ్ రత్నాకర్ నుంచి నాకు కాల్ రాలేదు. ఇక రాదు. 

Rest in peace Ratnakar! 

3 comments:

  1. మీ రెప్పడైనా ఒక నది వరదప్రవాహాన్ని చూసారా?
    అందులో ఎన్నో కొట్టకొని వస్తూ ఉంటాయి.
    కలుస్తూ ఉంటాయి. కలిసి కొంతసేపో ఎక్కువసేపో ప్రయాణించి విడిపోతాయి. మరలా వేటితోనో అవి కలుస్తూ విడిపోతూ ఉంటాయి.

    రైలు ప్రయాణాల్లో. మనతో ఎందరో కలుస్తూ విడిపోతూ ఉంటారు అలాగే.

    మనజీవితాలూ అఃతే. కాలనదీప్రవాహంలో కలయికలూ రైలుప్రయాణాల్లో కలయికలూ మనమధ్య స్నేహబాంధవ్యాలు.

    అంతేనండీ.

    ReplyDelete
  2. Shocked nd sad...life s a bubble...may his soul rest in peace...amen..

    ReplyDelete