Friday 2 July 2021

Waiting sucks!

మార్చి చివర్లో, 'మే 6 నుంచి మంచి రోజులు' అన్నారు. అప్పటిదాకా ఆగుదాం అన్నారు. ఆ ఏముందిలే ఈ కొద్దిరోజులు అనుకున్నాము, నేనూ నా టీమ్. 

తర్వాత ఏప్రిల్ మూడోవారంలో అనుకుంటాను... సెకండ్ వేవ్  వచ్చి విశ్వరూపం చూపించింది. తర్వాత నాకు కోవిడ్ వచ్చింది. రాకూడనివాళ్లకు కూడా వచ్చింది. అందరికీ తగ్గేలోపు, అప్పటిదాకా మేం ఎదురుచూస్తూవున్న 'మే 6' ఎక్కడికో కొట్టుకు పోయింది.

ఇప్పుడు అందరం ఓకే. అన్నీ ఓకే. కాని మంచిరోజులు ఇప్పుడు లేవు!

ఆగస్టు 9 తర్వాత నుంచి ఏది చేసినా బాగుంటుందట. పట్టిందల్లా బంగారమేనట. సో, మేం ప్రారంభించబోయే పనులు కూడా బంగారం అవ్వాలని, ఆగస్టు 9 తర్వాత పెట్టే ముహూర్తం కోసం అందరం ఎదురుచూస్తున్నాం. 

కట్ చేస్తే -

వీటన్నిటితో సంబంధం లేకుండా - ఈ డేట్స్ చెబుతున్నవాళ్ళూ, వింటున్నవాళ్ళూ అందరం  తింటున్నాం, తిరుగుతున్నాం, మిగతా ఏ పనులూ ఆగటం లేదు. 


ఇంతకుముందులా గుడ్డిగా ఏదో ఒక్క సోర్స్ మీదే నమ్మకం పెట్టుకొని లేదు నా టీమ్. ఈ ఒక్క విషయంలో వారు నాకు అప్పుడప్పుడూ మంచి క్లాస్ పీకుతుంటారు. అది అవసరం కూడా.     

A story should have a beginning, a middle, and an end… but not necessarily in that order.
– Jean-Luc Godard 

6 comments:

  1. Blog spot అనే వేదికను చాలా బాగా
    ఉపయోగించుకుంటున్నారు. 👌👌

    ReplyDelete
    Replies
    1. కొత్త ప్రాజెక్టు స్టార్ట్ అయ్యాక ఇంక చాలా ఉంటుంది... Thanks for your comment! 🙂🙂

      Delete
  2. ఆషాడమాసం అనేది కొత్తగా పెళ్ళయిన వారికి, పెళ్ళిచేసుకోబోయే వారికి మంచిది కాదు అన్నారు కానీ ఇతరత్రా పనులకు కాదేమో అని నా ఉద్దేశ్యం.
    ఏలిననాటి శని ఏడేళ్ళు ఉంటుందంటారు. అలా అని ఏడేళ్ళు ఏ పనీ చేయకుండా కూర్చోలేము కదా? ఆడవాళ్ళే టమాటా పచ్చడి వీడియో యూట్యూబ్ లో పెట్టి లక్షలు సంపాదిస్తుంటే.. మీరు ఓ రెండు నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీసి పడెయ్యొచ్చు కదా ?
    మీలాంటి టాలెంటెడ్ ఆర్టిష్టులు మీనమేషాలు లెక్కలేయకూడదు.

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పింది నిజమే. అయితే షార్ట్ ఫిల్మ్ తీయాల్సిన అవసరం లేదు (నా విషయంలో). ఆల్రెడీ పనులు ప్రారంభించాను. ఈ లెక్కలతో పెట్టుకుంటే నాకు కుదరదు.

      Thanks for your comment. 🙂

      Delete