అమ్మతో పోల్చినపుడు-
కనీస గుర్తింపుకు కూడా నోచుకోని,
ఏదీ పట్టించుకోని-
పిచ్చివాడు,
ఏదీ పట్టించుకోని-
పిచ్చివాడు,
కష్టజీవి,
త్యాగమూర్తి,
మౌని,
ప్రేమి...
నాన్న.
తన చివరి నిమిషం వరకూ
పిల్లలూ కుటుంబం కోసమే
ఆలోచించే వ్యక్తి,
శ్రమించే శక్తి...
నాన్న.
తరతరాలుగా అమ్మకు వచ్చిన గుర్తింపు
ఎందుకనో నాన్నకు రాలేదు.
మరో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే -
చాలా మంది విషయంలో...
తండ్రి విలువ తెలుసుకునేటప్పటికి
ఆ తండ్రి ఉండడు!
ఇది మగపిల్లలకు ఇంకో శాపం...
కట్ చేస్తే -
"అసలు ఈ ఫాదర్స్ డేలు, మదర్స్ డేలు ఏంటి?... మన కల్చర్ కాదు... మనం తల్లిదండ్రుల్ని ప్రతిరోజూ గుర్తుంచుకోవాలి... గుర్తు చేసుకోవాలి... వారిపైన ప్రేమను వర్షించాలి... వారిని 365 రోజులూ పూజించాలి... అదీ మన సంస్కృతి" అని కొందరు అంటుంటారు.
వారి భావనలు వారివి. గౌరవిస్తాను.
నా ఉద్దేశ్యంలో మాత్రం ఇలాంటి 'డే' లు ఉండాలి. ఉండి తీరాలి.
నా ఉద్దేశ్యంలో మాత్రం ఇలాంటి 'డే' లు ఉండాలి. ఉండి తీరాలి.
మన హిపోక్రసీ పక్కన పెట్టి, రెండు నిమిషాలు ఆలోచిస్తే చాలు. మొత్తం కళ్లముందు కనిపిస్తుంది.
ఒకే ఇంట్లో కళ్ళముందున్న ముసలి తల్లిదండ్రుల వైపు కళ్ళెత్తి కూడా చూడలేని కొడుకులున్న కాలం ఇది... ఎక్కడో ఊళ్ళో ఉన్న తల్లిదండ్రులను చూడ్డానికి సంవత్సరానికి ఒక్కసారో, రెండుసార్లో చుట్టపుచూపుగా కొడుకులు వెళ్తున్న కాలం ఇది... విదేశాల్లో ఉండి, తండ్రి చనిపోయినా రాలేకపోతున్న రోజులు ఇవి... నిజంగా మనసులో ప్రేమ ఉన్నా, పట్టించుకోనీయని వత్తిళ్ల మధ్య పిల్లలు నలుగుతున్న కాలం ఇది...
కేవలం 1% మాత్రమే ఇందుకు బహుశా మినహాయింపు అనుకుంటాను. వారికి మాత్రం హాట్సాఫ్...
ఇలాంటి పరిస్థితుల్లో - సంవత్సరానికి ఒక రోజు 'ఫాదర్స్ డే' అనో, 'మదర్స్ డే' అనో ఉంటే తప్పేంటి?
కనీసం ఆ ఒక్క రోజైనా నిజమైన ప్రేమతో కొందరు, సమాజం కోసం కొందరు, ఫేస్‌బుక్ పోస్టుల కోసం కొందరు... వారి తల్లిదండ్రులను కొంతసేపైనా ఖచ్చితంగా గుర్తుచేసుకుంటారు.
ఒక ఫోన్ చేస్తారు. వెళ్ళి కలుస్తారు. సెల్ఫీలు తీసుకుంటారు. ఫేస్‌బుక్‌లో ఫోటోలు పెడతారు. జ్ఞాపకాలు నెమరేసుకుంటారు. అర్థరాత్రి పూట ఇలా బ్లాగులు రాసుకొంటూ గతించిపోయిన నాన్నని గుర్తు తెచ్చుకుంటారు.
ఒక ఫోన్ చేస్తారు. వెళ్ళి కలుస్తారు. సెల్ఫీలు తీసుకుంటారు. ఫేస్‌బుక్‌లో ఫోటోలు పెడతారు. జ్ఞాపకాలు నెమరేసుకుంటారు. అర్థరాత్రి పూట ఇలా బ్లాగులు రాసుకొంటూ గతించిపోయిన నాన్నని గుర్తు తెచ్చుకుంటారు.
అసలు పూర్తిగా మర్చిపోయేకంటే, ఇది మంచిదే కదా!
Happy Father's Day to All Awesome Sons and Daughters, and Their Fathers !!
Happy Father's Day to All Awesome Sons and Daughters, and Their Fathers !!
నిజం చెప్పేరు
ReplyDeleteThank you.
Delete