Friday 11 June 2021

కెమికల్ ఇంజినీరింగ్‌లో కరోనా!

సుమారు ఒక నెల క్రితం అనుకుంటాను... ఒక ఇంగ్లిష్ కార్టూన్ చూశాను. ఆ కార్టూన్లో ఒక డాక్టర్, పేషెంట్ మధ్య సంభాషణ ఇలా ఉంటుంది:

పేషెంట్: డాక్టర్, ఈ కరోనా ఇంకెప్పుడు పోతుందంటారు?
డాక్టర్: సారీ, నేను జర్నలిస్టును కాదు. నాకు తెలియదు!

నిజంగా ఇప్పుడు అలాగే ఉంది మీడియాలో పరిస్థితి. 

సుమారు ఒక సంవత్సరం క్రితం ఒక ప్రముఖ స్వామీజీ కూడా "మే 5 వ తేదీ కల్లా కరోనా పూర్తిగా ఈ భూమ్మీదే లేకుండా మాయమైపోతుంది" అని జోస్యం చెప్పాడు. 

అప్పటి మే పోయింది, ఇంకో మే కూడా మొన్ననే పోయింది. కరోనా మాత్రం ఇంకా అలాగే ఉంది! 

ఇక సోషల్ మీడియాలో, వాట్సాపుల్లో చెప్పే అవసరం లేదు. కరోనా రాకుండా మనం ఏం తినాలో, ఏం త్రాగాలో, ఏం చెయ్యాలో, ఏం చెయ్యద్దో... వేలకొద్దీ సలహాలు, సూచనల లిస్టులూ, సందేశాలూ!  

కట్ చేస్తే - 

ఆమధ్య ఎంపిసిలో బయాలజీ అని, బయాలజీలో ఫిజిక్స్ అని పాలిటిక్స్‌లో ఒక మంచి సెటైర్ కొద్దిరోజులు మనందరినీ బాగా నవ్వించింది. 

ఈ కోవిడ్ లాక్‌డౌన్ నేపథ్యంలో - ఇప్పుడు అలాంటిదే ఇంకో కొత్త "సెటైర్ వేరియెంట్" తాజాగా ఎంట్రీ ఇచ్చింది.  

కోవిడ్‌తో ప్రత్యక్షంగా పోరాడుతున్న డాక్టర్లు, దాని మీద నిరంతరం పరిశోధనలు చేస్తున్న వైరాలజిస్టులు, మైక్రోబయాలజిస్టులు, సంబంధిత ఇతర సైంటిస్టులు ఏం మాట్లాడటం లేదు కాని - వీటన్నింటితో ఎలాంటి సంబంధంలేని కెమికల్ ఇంజినీర్లు, ఇంకొందరు నిత్యం 'వాగేడిక్ట్స్' మాత్రం కరోనా వైరస్ 101 వేరియెంట్స్ గురించి చెప్తున్నారు. అవన్నీ ఇండియా మీద దాడిచేస్తాయంటున్నారు. WHO కి, ICMR కి సలహాలిస్తున్నారు. చివరకు,  థర్డ్ వేవ్ వచ్చి 'ఇంటికొక్కరు చచ్చిపోతారు' అని ప్రజల్ని ప్యానిక్ చేస్తున్నారు!  

అసలు వీళ్లంతా ఏ అధారిటీతో ఇంత బాహాటంగా నోటికొచ్చినవి చెప్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు? 

ఇలాంటి చెత్తను వాగించడానికి టీవీ చానెల్స్, యూట్యూబ్ చానెల్స్ పోటీపడుతుండటం ఒక పెద్ద విషాదం. 

అధారిటీ లేని వ్యక్తులు ఇలాంటి నానా చెత్త వాగి, ప్రజల్ని ప్యానిక్‌కు గురిచేస్తుంటే వెంటనే యాక్షన్ తీసుకొనే చట్టాలు, యంత్రాంగం మన దేశంలో లేకపోవటం మరింత పెద్ద విషాదం. 

4 comments:

 1. వాల్లకి కావల్సిన పార్టీ అధికారంలోకి వచ్చేదాకా.. మీడియా ఇలాంటి హర్రర్ సినిమాలు ప్రసారం చేస్తూనే వుంటుంది.

  ReplyDelete
  Replies
  1. కావచ్చు.
   Thanks for your comment...

   Delete
 2. అవునండీ. టీ వీ 5 లో ఒకరు అలాగే చెప్పారు. నేను ఆ ఛానెల్ చూడను. ఎవరో ఫార్వాడ్ చేస్తే చూసాను. వెధవ వాగుడు వాడున్ను...ఇంకొకడు బాక్స్ ఆఫీస్ టివి లో వాగుతుంటాడు. మావారు పందుల పెంపకం చూసినంత తన్మయత్వంతో వింటుంటారు. ఖర్మ !

  ReplyDelete
  Replies
  1. Yes. ఈమధ్య మరీ టూమచ్ అయిపోయిందండి. Thanks for your comment...

   Delete