Monday 12 April 2021

అందరికీ 'ప్లవ' ఉగాది శుభాకాంక్షలు 🙏

మిత్రులు, శ్రేయోభిలాషులు, ప్రియమైన నా బ్లాగ్ పాఠకులందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! 

ఈ తెలుగు సంవత్సరం ఆరంభం నుంచీ మనందరిలో ఆనందం ఇండెక్స్ పైపైకే ఎగరాలనీ, అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా జరగాలనీ, ఆ దిశలో రెట్టించిన ఉత్సాహంతో మనమందరం తగిన కృషి చేయాలనీ, ఇప్పటికే చేయాల్సినవన్నీ చేసేసి హాయిగా రిటైరయి విశ్రాంతి తీసుకుంటున్నవాళ్ళు కూడా మరింత బిందాస్‌గా, ఆరోగ్యంగా ఉండాలనీ, దూరమైన మిత్రులూ బంధువులూ అన్ని ఈగోలూ, గొడవలూ పక్కనపెట్టి ఎప్పట్లా కలిసిపోవాలనీ... మనందరినీ వదలకుండా టెన్షన్ పెడుతున్న కరోనా వైరస్ వెంటనే పత్తాలేకుండా పోవాలనీ... మనస్పూర్తిగా కోరుకొంటూ...

నా బ్లాగ్ పోస్టులన్నీ ఆయా సందర్భాల్లో నా మూడ్ తీసుకెళ్ళినట్టుగా కదిలి రాసినవి. అత్యధిక భాగం నా వ్యక్తిగత అభిప్రాయాలే. ఆలోచనలే. అనుభవాలే.

తెలియక, ఏ పోస్టులోనైనా ఎవరినైనా లేశమాత్రంగా బాధపెట్టినా మన్నించగలరని మనవి. 

కట్ చేస్తే - 

బ్లాగింగ్ మీద నాకున్న అపరిమిత వ్యామోహానికి పొడిగింపే నా కొత్త వెబ్ మ్యాగజైన్ Manoharam.in.

సినిమాలైనా, సక్సెస్ సైన్స్ అయినా, వ్యక్తిగత అనుభవాలూ ఫీలింగ్స్ అయినా... ఇకనుంచీ నా బ్లాగింగ్ అంతా ఈ మ్యాగజైన్‌లోనే. 

ఎందరో మహానుభావులు... అందరికీ ఉగాది శుభాకాంక్షలతో - 
మీ
- మనోహర్ చిమ్మని 🙏

4 comments:

  1. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు !"

    ReplyDelete
    Replies
    1. Thank you! Wish you the same.

      Wear mask. Stay home, stay safe.

      Delete
  2. మీకు ఉగాది శుభాకాంక్షలు.🌷🙏

    బ్లాగింగ్ చాలా బాగుంది. దీన్నే Outpouring అని కూడా అనవచ్చు. ' కట్ చేస్తే '👌

    మనోహరంలోనే చెయ్యండి.

    ReplyDelete
    Replies
    1. Thank you.

      Wear mask. Stay home, stay safe.

      Delete