Friday 26 February 2021

కొన్నిటిని ఎప్పుడూ గుర్తుచేసుకోవద్దు!

ఎందుకంటే - ఏదైతే వద్దనుకొంటామో అదే మళ్ళీ మళ్లీ కళ్లముందుకొచ్చి మరింత బాధపడతాం. మానసికంగా బలహీనపడతాం. మళ్ళీ కొన్నిరోజులు అదే నెగెటివిటీ. 

మన నిర్ణయం తప్పో, అవతలివాళ్ల బాధ్యతారాహిత్యం తప్పో, నిర్లక్ష్యమో, నోటికొచ్చిన అబద్ధాలు వినీ వినీ చివరికి నాకంటే చిన్నవాళ్లచేత "ఒకడు" అనిపించుకోడమో, ఆ స్థాయికి మనం పడిపోవడమో... మొత్తానికి అంతా అయిపోయింది. 

నా జీవితం మొత్తంలో అత్యంత చెత్త ప్రొఫెషనల్ నిర్ణయం అదే. ఆ నిర్ణయం వల్ల అనవసరంగా చాలామందికి దూరమయ్యాను. ఒకరిద్దరికి శత్రువయ్యాను. ఒక అరడజన్ మంది కలిసి చేసిన నష్టం కంటే కనీసం 10 రెట్ల నష్టం జరిగింది. ఎంతో డబ్బు నష్టం. సోషల్‌గా అవమానాలు. పరోక్షంగా ఈ కారణంగా నాకెంతో దగ్గరి మనుషులను కూడా కోల్పోయాను.

అన్నిటినీ మించి, నా జీవితంలోని ఎంతో విలువైన ఈ దశలో ఆరేళ్ళ కాలం... అది తిరిగి రాదు.      

ఈరోజుకి ఆరేళ్లు. సంతోషంగా ఆ జ్ఞాపకానికి సమాధి కట్టేస్తున్నాను. 

ఎవ్వరిమీదా ఎలాంటి కోపం లేదు. ఎలాంటి నెగెటివిటీ లేదు. ఉండదు. ఉండబోదు.  

నా నిర్ణయానికి, దాని పరిణామాలకి నేనే బాధ్యత వహించడం కరెక్టు. అదే చేస్తున్నాను. నేను కోల్పోయిన ఫ్రీడమ్‌ను మళ్ళీ వెనక్కి తెచ్చుకోడానికి కొంత కాలం నాకీ సంఘర్షణ తప్పదు.

ఇలాంటి పర్సనల్ ఇంట్రాస్పెక్షన్‌కు కూడా ఇదే చివరి రోజు.

ది ఎండ్. 

షిఫ్ట్ డిలీట్. 

అంతా మన మంచికే. అందరూ మనవాళ్లే. 

ఎవ్వరూ ఎవ్వరికి మిత్రులు కారు, శత్రువులు కారు. పరిస్థితులే మనుషుల్ని మిత్రుల్నీ శత్రువుల్నీ చేస్తాయి. కాని, ఆ పరిస్థితుల్ని సృష్టించేది కూడా ఆ మనిషే అన్న విషయం మర్చిపోవద్దు.   
- మహాభారతం   

3 comments:


  1. Very nice post. I simply stumbled upon your web blog and wanted to mention that I have really loved surfing around your blog posts.
    Digital Marketing In Telugu

    ReplyDelete
  2. This is the best blog post I have read till date. I'm glad to be here.
    Best Web designing company in Hyderabad

    ReplyDelete