Monday 7 December 2020

నా బ్లాగింగ్‌కి కొనసాగింపే... మ్యాగజైన్!

‘మనోహరమ్’ డిజిటల్ మ్యాగజైన్ నా రైటింగ్, బ్లాగింగ్ ప్యాషన్‌లో భాగమే.

ఈ లాక్‌డౌన్ ఇంకాస్త రిలీఫ్ ఇచ్చాక, డైరెక్టర్‌గా కూడా ఇకనుంచీ గ్యాప్ లేకుండా సినిమాలు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాను. అన్నీ అనుకున్నట్టు సెట్ చేసుకోగలిగితే, బహుశా జనవరి చివరి వారంలో నా కొత్త సినిమా ప్రారంభం వుంటుంది. 

కట్ చేస్తే –

సక్సెస్ సైన్స్, సినిమాలు, సరదాలే (Mindset, Movies, Masti) ప్రధానంగా – ‘మనోహరమ్’ ఒక బిందాస్ పాజిటివ్ డిజిటల్ మ్యాగజైన్. ఈ ఆన్‌లైన్ మ్యాగజైన్ కంటెంట్‌లో సక్సెస్ సైన్స్ తర్వాత స్థానం సినిమాదే. ఈ నేపథ్యంలో… సినీ జర్నలిస్టులు, పీఆర్వో మిత్రులతో వ్యక్తిగతంగా క్రింది విషయాలను షేర్ చేసుకోడానికి సంతోషిస్తున్నాను:

1. సినిమారంగానికి సంబంధించినంతవరకు ‘మనోహరమ్‌’లో వంద శాతం పాజిటివ్ రైటప్‌లే వుంటాయి. ఎలాంటి సందర్భంలో అయినా వంద శాతం సినీఫీల్డువైపే పాజిటివ్‌గా వుంటుంది మనోహరమ్.

2. 'మనోహరమ్‌’లో సినిమా రివ్యూలకోసం ప్రత్యేకంగా కాలమ్ లేదు. కాని, రివ్యూలు కూడా వుంటాయి. మళ్లీ వెనుకటి సినిమారంగం, విజయచిత్ర పత్రికల రోజులు గుర్తుకువచ్చేలా .. మనోహరమ్‌లో సినిమా రివ్యూలు పూర్తి విభిన్నంగా, నిర్మాణాత్మకంగా ఉండేలా రాయాలన్నది నా ఆలోచన. ఈ సౌకర్యాన్ని దర్శకనిర్మాతలు వినియోగించుకొనేలా చేయగలరని సవినయ మనవి.

3. అలాగే – చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ సినిమాలవరకు… కాన్‌సెప్ట్ స్టేజి నుంచి, పోస్ట్ రిలీజ్ దాకా – ‘మనోహరమ్’ మ్యాగజైన్‌లో విభిన్నమైన Conceptual and Customized Promotion Plans పరిచయం చేసే అవకాశం ఉంది. ప్రొడ్యూసర్-డైరెక్టర్లు ఈ సౌకర్యం కూడా వినియోగించుకొనేలా చేయగలరని సవినయ మనవి. ఈ విషయంలో మీ అమూల్యమైన సలహాలు, సూచనలకు స్వాగతం.

4. 'మనోహరమ్’లో హీరోహీరోయిన్స్, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఇతర ప్రముఖ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇంటర్వ్యూలు, వారి గురించి రైటప్స్ కూడా ఉంటాయి. ఈ విషయంలో ఫిలిం జర్నోస్, పీఆర్వో మిత్రులు నన్ను నేరుగా కాంటాక్ట్ చేయవచ్చు. 

థాంక్యూ సో మచ్! 

My whatsapp: 9989578125
My email: mchimmani10x@gmail.com

“ఈ ప్రపంచంలో
అత్యంత అసాధ్యమైన పని ఒక్కటే.
మనం ఎన్నటికీ ప్రారంభించని పని!”

12 comments:

 1. మీ మనోహరమ్‌ చూసాను. చాలా బాగుంది. ఇంకా క్షుణ్ణంగా చదవాలి. విజయచిత్రను దృష్టిలో పెట్టుకున్నారు - అటువంటి standard కోసం ప్రయత్నం చేయాలనుకోవటం అభినందనీయం. ఒకరోజుకు తప్పకుండా మనోహరమ్‌లో కనిపించటం అన్నది సినీ ఆర్టిష్ట్ అనేవాడి ప్రొఫైల్‌లో ఒక అసెట్ అయ్యే స్థాయి రావాలని మనస్ఫూర్తిగా అశిస్తున్నాను.

  ReplyDelete
  Replies
  1. చాలా థాంక్స్ అండి. పాజిటివ్ ప్రజెంటేషన్ ఒక్కటే నేను విజయచిత్ర విషయంలో ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొన్నాను. ఆ ఒక్కటి చాలు అని నా వుద్దేశ్యం.

   నేను ప్లాన్ చేసుకున్నదాంట్లో ఇప్పటివరకు ఒక 10% మాత్రమే చేయగలిగాను. కొత్త సంవత్సరం ప్రారంభం నాటికి మరింత బాగా ఉంటుంది. Thanks once again.

   Delete
 2. ఒకరోజుకు తప్పకుండా మనోహరమ్‌లో కనిపించటం అన్నది సినీ ఆర్టిష్ట్ అనేవాడి ప్రొఫైల్‌లో ఒక అసెట్ అయ్యే స్థాయి రావాలని మనస్ఫూర్తిగా అశిస్తున్నాను.👌👌

  ReplyDelete
  Replies
  1. థాంక్యూ సో మచ్ నీహారిక గారు! తప్పకుండా ప్రయత్నిస్తాను. 🙏👍

   Delete
 3. విజయ చిత్ర స్థాయి మేగజైన్ ఆన్లైన్ లో ఎక్కడా లేదు. మీరు మొదలుపెట్టారు. ఆపకుండా కొనసాగించండి. అభినందనలు.
  All The Best 👍

  ReplyDelete
  Replies
  1. మీరు చెప్పింది నిజం. నా వంతు ప్రయత్నం నేను చాలా సిన్సియర్‌గా చేస్తాను. Thank you so much.

   Delete
 4. నమస్తే మనోహర్ గారు..
  ఇందాకే మీ "మనోహరమ్" వమ్యా* స్కిమ్ చేశాను.. చాలా మంచి విషయాలు పొందు పరిచారు.. ఆసక్తికరంగా కూడా ఉంది. స్వతహగా సినిమా పై కంటెంట్ అదీ కూడా పదుగురు మెచ్చేదిగా తీర్చిదిద్ది ఇలా అందించటం బాగుంది. కదిలే కాలం సంద్రమైతే అందులో ఎగిసే అలలు ఆశలకు ప్రతీక..!


  *వమ్య: వర్చువల్ మ్యాగజైన్

  ReplyDelete
  Replies
  1. నమస్తే అండీ.
   థాంక్యూ సో మచ్.

   Delete
 5. మీ " మనోహరం " చూసాను... చాలా డీసెంట్ గా, ఎటువంటి గాసిప్పులూ లేకుండా క్లీన్ గా ఉంది... అభినందనలు.

  ReplyDelete
 6. మీ "మనోహరమ్‌" సినీ-ప్రియులకి మనోహరంగా ఉంది. శుభాభినందనలు!

  ReplyDelete
  Replies
  1. థాంక్యూ సో మచ్, లలిత గారు!

   Delete