Wednesday 2 December 2020

లిరిక్ రైటర్ 'లోరా'

సుమారు 7 ఏళ్ల క్రితం అనుకుంటాను... ఒక యువ లిరిక్ రైటర్ నా బేగంపేట ఆఫీసుకొచ్చాడు. తాను రాసిన పాటలు చూపించాడు. ఒక సిచువేషన్ ఇస్తే, దానికి ఓ గంటసేపట్లో ఆఫీసులోనే కూర్చుని పాటరాసి చూపించాడు. 

అంతా బాగానే ఉంది. కొత్త రైటర్ కాబట్టి ప్రొఫెషనల్ రైటింగ్, సినిమా లిరిక్స్ రైటింగ్‌కు సంబంధించిన కొన్ని బేసిక్స్ ఇంకా పూర్తిగా తెలియదని అర్థమైంది. తర్వాత, నా లేటెస్ట్ సినిమా స్విమ్మింగ్‌పూల్ టైమ్‌లో కూడా నా ఆఫీసుకొచ్చాడు. షరా మామూలే. రాసి వున్న పాటలు చూపించాడు. అప్పటికప్పుడు ఒక సిచువేషన్‌కు రాసి చూపించాడు. కొంచెం గైడెన్స్‌తో బాగా రాయగలడు. అయితే, హీరో నేపథ్యంలో వున్న ఒక ఆబ్లిగేషన్ కారణంగా మొత్తానికి ఆ కొత్త లిరిక్ రైటర్‌ను పరిచయం చెయ్యలేకపోయాను. 

కట్ చేస్తే - 

ఈమధ్య ఈ లిరిక్ రైటర్‌కు, నాకు మధ్య కొంచెం కమ్యూనికేషన్ పెరిగింది. చాలా విషయాలు తెలిశాయి అతని గురించి...

> ఒక వెబ్‌పోర్టల్ నిర్వహించాడు.
> యూట్యూబ్ చానెలుంది.
> మ్యూజిక్ వీడియోలు చేస్తుంటాడు.
> కొన్ని షార్ట్ ఫిల్మ్స్/మ్యూజిక్ వీడియోల్లో యాక్ట్ కూడా చేశాడు.
> స్క్రిప్ట్/డైలాగ్ రైటింగ్‌మీద కూడా ఆసక్తి వుంది.
> ఈమధ్య కొత్తగా మీమ్స్ చేస్తున్నాడు.
> ఒక షార్ట్ ఫిల్మ్ రచించి డైరెక్ట్ చేశాడు. (నేను చూసింది ట్రయలర్.) 
> ఒకటి రెండు సినిమాలకు కూడా లిరిక్స్ రాశాడు కాని, అవి ట్రాక్ ఎక్కలేదు.  

వైజాగ్‌లో ఉద్యోగం చేస్తూనే, ఇలా చాలావాటిల్లో తన స్కిల్ నిరూపించుకొనే ప్రయత్నం చేస్తున్నాడీ యువకుడు. 

జాక్ ఆఫ్ ఆల్...
కాని, మాస్టర్ ఆఫ్ నన్ కాకూడదు.  

మంచి కమ్యూనికేషన్, చొచ్చుకుపోయే గుణం సినిమా ఫీల్డులోనే కాదు, మరే ఫీల్డులోనైనా చాలా ముఖ్యం. తన స్కిల్స్‌తో పాటు ఈ యువకుడు ఈ రెండు చిన్న విషయాల్లో కూడా కొంత శ్రధ్ధపెడితే చాలు... తన లక్ష్యం చాలా సులభంగా చేరుకోగలుగుతాడు. 

2021 ప్రారంభంలో నా కొత్త చిత్రం ద్వారా ఈ యువకున్ని నేను లిరిక్ రైటర్‌గా పరిచయం చేస్తున్నాను. ఈలోపే, ఇంకో సినిమా ద్వారా ఇంకెవరైనా డైరెక్టర్ పరిచయం చేసినా ఆశ్చర్యం లేదు.

రాజేశ్ లోకనాథం అతని పేరు. 'లోరా' ఎంటర్‌టైన్‌మెంట్ అతని యూట్యూబ్ చానెల్ పేరు. 

ఐ విష్ హిమ్ బెస్టాఫ్ లక్. 

4 comments:

  1. He is my friend and I am the one who knows and closely watched all his talents. He is a good singer too. I know that he will definitely become a star. Wish you all the best Razesh

    ReplyDelete
  2. మీ మ్యాగజైన్ ఓపెన్ చేసిన వెంటనే , హోమ్ పేజీ లో నాకు పాత ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి . కొత్త ఆర్టికల్స్ ఎక్కడో లోపల ఆయా విభాగాల లోపల ఉంటున్నాయి . అవి కూడా నాకు మీ ట్విట్టర్ లింక్ లు ద్వారా చూసా . లేకపోతే మ్యాగజైన్ ఓపెన్ చేస్తే, ఇంకా కొత్త సంచిక రాలేదేమో అని అనుకునే అవకాశం ఉంది . అందువలన , కొత్త ఆర్టికల్స్ హోమ్ పేజీ లో పైన అప్డేట్ అయ్యేలా చేస్తే బెటర్ అని నా ఉద్దేశ్యం మరియు ఉచిత సలహా కూడా .

    ReplyDelete
    Replies
    1. వెంకట్ గారు,
      అలాగేం లేదే! మీరు మొబైల్లో చూస్తున్నప్పుడా, లాపీలో/కంప్యూటర్లో చూసినప్పుడా.. మీకిలా కనిపిస్తోంది? నేను, నా టీమ్ ఇప్పుడు కూడా చెక్ చేశాము. ఫ్రెష్ కంటెంట్ కనిపిస్తోంది. అంతకుముందువి కావాలంతేనే మీరు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. "ప్రీవియస్" నొక్కుతూ.

      మీ వాట్సాప్ నంబర్ నాకు మెసేజ్ పెట్టండి. వివరంగా మాట్లాడ్డానికి.

      థాంక్స్ ఎనీవే...

      Delete