Tuesday 24 November 2020

సినీ ఫీల్డులోకి ప్రవేశించడం ఎలా? (FREE e-book)

యాక్టర్‌గా కావచ్చు, స్క్రిప్ట్ రైటర్‌గా కావచ్చు, డైరెక్టర్‌గా కావచ్చు... ఇప్పుడెవరైనా సులభంగా సినీఫీల్డులోకి ప్రవేశించవచ్చు. 

ఇంతకుముందు సినిమా ఫీల్డు వేరు. డిజిటల్ టెక్నాలజీ వచ్చాక సినిమా ఫీల్డు వేరు. 

ఐఫోన్‌తోనే మొత్తం సినిమా షూట్ చేసి, అదే ఐఫోన్‌లో ఎడిటింగ్‌తో సహా మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసి, ఆ సినిమాలను ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో పోటీకి పంపిస్తున్న రోజులివి. ఒకవైపు వందల కోట్లల్లో బడ్జెట్లు ఎలా పెరిగిపోతున్నాయో, మరోవైపు అసలు బడ్జెట్టే అవసరంలేనివిధంగా నో బడ్జెట్ రెనగేడ్ సినిమాలు రూపొందుతున్న రోజులివి. 

కమ్యూనికేషన్ విషయంలో కొంచెం కమాండ్ వుంటే చాలు, సోషల్ మీడియా ద్వారానే ఎందరో సెలబ్రిటీలతో డైరెక్ట్‌గా   కనెక్ట్ అయిపోవచ్చు ఇప్పుడు. 


డైరెక్టర్ కావడానికి గతంలో లాగా ఒక పదేళ్ళపాటు 10 సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు. నిజంగా మీలో ఆ క్రియేటివిటీ వుంటే డైరెక్ట్‌గా డైరెక్టర్ అయిపోవచ్చు. రైటర్ విషయంలో కూడా అంతే. ఒక సెన్సేషనల్ స్క్రిప్టు రాసే సత్తా మీలో నిజంగా వుంటే ఇంకెవ్వరిదగ్గరా ఓ పదేళ్ళపాటు అసిస్టెంట్‌గా పనిచెయ్యాల్సిన అవసరంలేదు. 

అలాగే, ఇంతకుముందులాగా హీరో-లేదా-హీరోయిన్ అంటే ఇలాగే వుండాలన్న రూల్స్ ఇప్పటి సినిమాలకు లేవు. ఎవరైనా సరే, నటుడు కావచ్చు, నటి కావచ్చు. హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు. 

ఒక 4 ఏళ్ల క్రితం ఇండస్ట్రీతో పోలిస్తే, ఇప్పుడు మీరు సినిమాల్లో చాన్స్ సంపాదించుకోవడం చాలా ఈజీ.  


కాని - ఔత్సాహికులైన కొత్తవాళ్ళు తెలుసుకోవల్సిన బేసిక్స్ అంటూ కొన్నుంటాయి. ఫిలిం ఇండస్ట్రీ అసలు ఎలా పనిచేస్తుంది? ఎలా చాన్సులు దొరుకుతాయు? అసలు కొత్తవాళ్లలో ఇండస్ట్రీకి ఏం కావాలి? కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వారిలో ఉన్న స్కిల్స్‌ను ఎలా ఇండస్ట్రీ కోరుకొనే విధంగా మౌల్డ్ చేసుకోవాలి... వంటి కొన్ని అతి ముఖ్యమైన విషయాల్లో అవగాహన అవసరం. 

ఈ ప్రాథమిక అవగాహన లేకుండా చేసే ప్రయత్నాలేవీ ఫలించవు. మీ అత్యంత విలువైన సమయం, డబ్బూ వృధా అయిపోతాయి. 

ఈ నేపథ్యంలో కొత్తవాళ్లకోసం, వారు తీసుకోవాల్సిన శిక్షణ గురించి, తెలుసుకోవాల్సిన బేసిక్స్ గురించి ఒక చిన్న ఈ-బుక్ రాశాన్నేను.

ఈ ఈ-బుక్ ఉచితం. 

ఒక కెరీర్‌గా సినీఫీల్డు పట్ల ప్యాషన్, సీరియస్‌నెస్ బాగా ఉన్న ఔత్సాహికులు మీ పేరు, ఊరు తెలుపుతూ నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 24 గంటల్లో ఈ ఫ్రీ ఈ-బుక్‌ను మీకు నేనే స్వయంగా పంపిస్తాను. ఈ ఈ-బుక్ చదివిన తర్వాత మీరు తీసుకోబోయే నిర్ణయం మిమ్మల్ని సినీఫీల్డులోకి అతి సులభంగా ప్రవేశించేలా చేస్తుంది. మీరూ సెలెబ్రిటీ అవుతారు.  

నా వాట్సాప్: 9989578125. 

బెస్ట్ విషెస్.
-మనోహర్ చిమ్మని  

5 comments:

 1. నాకు సినిమా మేకింగ్ అంటే ఇష్టం , ఒక ఆలోచనని తెర మీదకి తీసుకుని వచ్చే ఆ ప్రాసెస్ అంటే చాల ఇంటరెస్ట్. కానీ ఉన్న ఈ జీవితం , ఉద్యోగం వదులుకుని నేను రాలేను . కానీ మీరు రాసిన పుస్తకం చదవాలని ఇంటరెస్ట్ గ ఉంది . దయచేసి నా ఇమెయిల్ కి పంపగలరా ?
  venki4blogs@gmail.com ( please remove this ID while approving if possible).

  ReplyDelete
  Replies
  1. ఇంకో 10 నిమిషాల్లో ఈ-బుక్ మీకు మెయిల్ చేస్తున్నాను. బెస్ట్ విషెస్.

   PS: Plz get back to me to my whatsapp number 9989578125 with your valuable feedback. :-)

   Delete
 2. మనోహర్ గారు,
  దయచేసి మీ ఈ-బుక్ నాకు కూడా పంపండి.

  ReplyDelete
  Replies
  1. నేను సినిమా చూసి దగ్గరగా ఏభై ఏళ్ళవుతుంది. ఇప్పటి నటీనటులూ తెలీదు. మీరేదో తపన పడుతున్నట్టు అనిపిస్తుంది. నేను అదేమో తెలుసుకోగలనా అన్నది నా సందేహం. నాకు అర్ధమవుతుందని అనుకుంటే ఆ బుక్కేదో నాకూ పంపండి. మనోహరమ్ తెలుసుకోవాలనే కుతూహలం,నా వల్ల మీకేం ఉపయోగం ఉండదు సుమా

   Delete