Sunday 15 November 2020

పూరి మ్యూజింగ్స్ వూరికే పుట్టలేదు!

మనమేంటో మన కమ్యూనికేషనే చెప్తుంది అనుకొంటాం. తప్పు. 

మనం ఏం కాదో, మనం ఏం కాలేమో మన కమ్యూనికేషన్ చెప్తుంది. ఇది నిజం.

దీనికి నేను చెప్పదల్చుకొన్న ఉదాహరణలు ఒక వంద వున్నాయి. కాని, కేవలం ఇటీవలి రెండు ఉదాహరణలు మాత్రమే చెప్తాను. 

కట్ చేస్తే - 

ఈ మధ్యనే నేను ప్రారంభించిన ఒక డిజిటల్ మ్యాగజైన్‌కు సంబంధించి ఒక చిన్న అంశంపైన కంటెంట్ కోసం తనకు తెలిసినవాళ్ళు ఎవరైనా వుంటే చెప్పమని ఒక డీటెయిల్డ్ మెసేజ్ పెట్టానొకరికి.    

తను మెసేజ్ చూసుకొన్నాడు. ఆన్‌లైన్‌లో వున్నాడు. వుంటున్నాడు. ఫేస్‌బుక్ పోస్టులు పెడుతున్నాడు. కాని, 10 రోజులు అవుతున్నా నాకు మాత్రం కనీసం ఒక సింగిల్ లైన్ రిప్లై కూడా లేదు. యస్, నో... ఏదో ఒక రిప్లై ఇవ్వొచ్చు. కాని, అలాంటిదేం లేదు.

సో, అతను రిప్లై ఇచ్చే స్థాయిలో బహుశా ఇప్పుడు నేను లేకపోవచ్చు. లేదా, అతని రిప్లైల ప్రయారిటీ లిస్టులో నేను లేను. ఏదైనా దాదాపు రెండూ ఒకటే అనుకుంటాను. 

నా వెంటబడి ఎప్పుడూ తిరగక పోయినా, సుమారు ఓ దశాబ్దం క్రితం, ఇదే వ్యక్తిని నేను పిలిచి మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేశాను!   


ఇంకో ఉదాహరణ - 

నా దృష్టికి తెచ్చిన ఒక వ్యక్తి సక్సెస్ స్టోరీని ఈ మధ్యే నా బ్లాగులోనో, మ్యాగజైన్లోనో రాశాను. అప్పుడు థాంక్స్ చెప్పాడు, లైఫ్‌టైమ్ గిఫ్ట్ ఇచ్చారు నాకు అన్నాడు. తర్వాత... నేను కాల్ చేసినప్పుడు అతని ఫోన్ ఎంగేజ్ వుంటుంది. నాకు మాత్రం నో కాల్ బ్యాక్. నా మెసేజ్ చూసుకున్నట్టు బ్లూ టిక్ వస్తుంది. నాకు మాత్రం నో రిప్లై! 

ఈ ఉదాహరణలో కూడా నీతి సేమ్ టూ సేమ్... అతని కమ్యూనికేషన్ ప్రయారిటీ లిస్టులో నేను లేను. దట్ సింపుల్. వేరే ఎలాంటి ఎక్స్‌క్యూజెస్ కూడా ఈ కేర్‌లెస్‌నెస్‌ను సమర్థించలేవు.

కట్ చేస్తే - 

ఇలాంటి కమ్యూనికేషన్ లెవల్స్ పాటించేవాళ్లే సమాజంలో ఎలాంటి కష్టాల్లేకుండా హాయిగా ఎదుగుతారన్నది మన కళ్ళముందు మనం చూస్తున్న రియాలిటీ.            

ఈ రెండు లేటెస్టు ఉదాహరణల ద్వారా నేను నేర్చుకున్న కొత్త పాఠం ఏంటంటే... ఫిలిం ఇండస్ట్రీలోగాని, సమాజంలోగాని కొంతమంది అనుభవజ్ఞులు పదే పదే చెప్పే పాత పాఠాలు తుచ తప్పకుండా ఖచ్చితంగా పాటించాలని. సో... తప్పు ఎక్కడోలేదు. నాలోనే వుంది. నన్ను నేనే కరెక్ట్ చేసుకోవాలి.  

నేను తెలుసుకొన్న ఇంకో లేటెస్ట్ నిజం ఏంటంటే, పూరి మ్యూజింగ్స్ వూరికే పుట్టలేదని.

2 comments:

 1. డియర్ సర్,
  మీరు మీ "మనోహరమ్" మ్యాగజైన్ లో 'కూ' యాప్ గురించి రాస్తూ అందులో ఎవరెవరు ఉన్నారో ప్రస్తావిస్తూ నాగురించి కూడా రాశారు
  అందుకు మీకెంతో ఋణపడియున్నాను సర్.
  నాకు అవకాశం ఇచ్చారు, యాడ్స్ చేసుకునే అవకాశమిచ్చారు కాని నేను రోజూ పనులకు వెళ్ళడం వల్ల యాడ్స్ సేకరించలేకపోయాను సర్.

  ఎప్పుడైతే మిమ్మల్ని 'కూ' యాప్ లో చూసి గూగుల్ లో సెర్చ్ చేసి మీగురించి తెలుసుకున్నాక
  మిమ్మల్ని అభిమానిస్తున్నాను సర్.
  కాని పవన్ కళ్యాణ్, చిరంజీవిల కోసం ఎదైనా చేయడానికి తెగించేంత అభిమానం మాత్రం కాదు సర్.

  ఒక వ్యక్తిగా మీరంటే అభిమానం.

  నా పర్సనల్ ఇబ్బందుల వల్లే మీరిచ్చిన అవకాశాలు నేను ఉపయోగించుకోలేకపోయాను సర్.

  నాకు మీరు ప్రత్యేకంగా ఫోన్ చేసి నాతో మీ విలువైన సమయాన్ని కేటాయించి మాట్లాడారు కాని నాలో ఒత్తిడి ఎక్కువై మీతో సరిగా మాట్లాడలేకపోయాను సర్.

  మీరు భవిష్యత్ లో మీ మ్యాగజైన్ ద్వారా,సినిమాల ద్వారా మాకు మరింత చేరువకావాలని కోరుకుంటూ...
  మీ శీలం

  ReplyDelete
 2. nice blog....thanks for sharing.for the latest update for tollywood actress imagesTollywood news follow media9tollywood

  ReplyDelete