Monday 8 April 2019

కౌంట్ డౌన్ .. 18 గంటలు!

ప్రచారపర్వం ముగియడానికి ఇంకా కేవలం 18 గంటలు మాత్రమే ఉన్నది.

ఇక్కడ తెలంగాణలో, అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో. 

ఈ క్షణం నుంచి ప్రతి క్షణం విలువైనదే.

ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు కాగా, ఇప్పటినుంచి 11 వ తేదీనాడు పోలింగ్ ముగిసేదాకా చేసే కసరత్తు, పడే శ్రమ, తీసుకొనే జాగ్రత్తలు ఒక ఎత్తు.

టఫ్ ఫైట్ ఉండే అవకాశముందనుకునే కొన్ని స్థానాల్లో, ఎవ్వరూ ఊహించని విధంగా, అంచనాలు పూర్తిగా తల్లకిందులు కావడానికి ఈ కొద్ది సమయమే కారణమవుతుంది.

తెలంగాణలో అలాంటి ప్రమాదం దాదాపు లేదు. కాని, ఆంధ్రలో మాత్రం చాలా ఉంది. ఉంటుంది.

ఏపీలో రాజకీయంగా ఒక పెనుమార్పుకి కారణం కాబోతున్న వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధినేత జగన్‌తో పాటు, ఆ పార్టీ అతిరథమహారథుల నుంచి, క్రింది స్థాయి కార్యకర్త దాకా ఈ కొద్ది సమయం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఫలితాలను ప్రభావితం చేయగల ప్రతి చిన్నా పెద్దా విషయం మీద తగినంత ఫోకస్ పెట్టాలి.

అవతల ఉన్నది 40 యియర్స్ ఇండస్ట్రీ.

ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదలడు. చివరి నిమిషం వరకూ కొత్త అవకాశాల్ని సృష్టించుకొని దెబ్బదీసే ప్రయత్నంలోనే ఉంటాడు.

తస్మాత్ జాగ్రత్త! 

8 comments:

 1. పచ్చమీడియా పైశాచికం పీక్స్ లోకి వచ్చింది. లేనిపోని వెర్రి మొర్రి సర్వేలతో తప్పుడు ఆడియోలతో ఆంధ్ర పెజానీకాన్ని బులిబూచికం చేస్తున్నారు. ఈ కులపిచ్చి తెలంగాణ లో లేదు. Thank god.

  ReplyDelete
  Replies
  1. https://www.andhrajyothy.com/artical?SID=762895

   సీబీఎన్ చంద్రజ్యోతి ఈరోజు ఇంకో సర్వే విడుదల చేసింది. "సోషల్ పోస్ట్ పొలిటికల్ కన్సల్సెన్టీ" అనబడే సదరు సర్వేయరు ఎవరయ్యా అని ఆరా తీస్తే అది ఒక యూట్యూబ్ టీవీ ఛానెల్ అని తేలింది. ఇదండీ యవ్వారం. విచిత్రం ఏమిటంటే ఈ ఫేక్ సర్వేలలో సైతం పచ్చపార్టీ సీట్లు తగ్గుతూ వస్తున్నాయి.

   Delete
 2. మనోహర్ గారూ,

  వికారాబాద్ నిజంగా ఊటీలాగా ఉంటుందా ?
  ఈ క్రింద వీడియో గ్రాఫిక్సా లేక నిజమా ?
  నేను హైదరాబాద్ దాటి తెలంగాణా వైపు వెళ్ళలేదు.
  https://youtu.be/39x1VrAou50

  @గొట్టిముక్కలలాగా అబద్దాలు చెప్పకుండా నిజం చెప్పండి.

  ReplyDelete
  Replies
  1. మా సినిమావాళ్ళు అడవుల లొకేషన్ దగ్గర్లో కావాలంటే వికారాబాద్ ఫారెస్ట్‌కు వెళ్తారు. ఇక్కడి అనంతగిరి హిల్స్ వాతావరణం చాలా బావుంటుంది. అలాగే, మాలాంటి క్రియేటివ్ మిత్రబృందాలెన్నో పార్టీలు చేసుకోవాలన్నా, మంచివాతావరణంలో జ్ఞాపకాలు పంచుకోవాలన్నా వికారాబాద్ వెళతారు.

   నీహారిక గారూ, గొట్టిముక్కలగారు చెప్పినట్టు ఇది తెలంగాణకు సంబంధించి "చిన్న ఊటీ" అనుకోవచ్చు. వారు నిజమే చెప్పారు. ఈ లింక్ చూడండి:

   https://en.wikipedia.org/wiki/Ananthagiri_Hills

   Delete
  2. హలో మేడం నేను వికారాబాదు గురించి ఎక్కడ రాసానో చూపించండి, అబద్దమో నిజమో తరువాత చెప్పొచ్చు.

   Delete
  3. Btw, మీరిచ్చిన లింక్ వికారాబాద్‌ది కాదు. వరంగల్ బస్ స్టేషన్‌ది! :)

   Delete
  4. @MANOHAR CHIMMANI:

   "గొట్టిముక్కలగారు చెప్పినట్టు"

   మనోహర్ గారూ, నేనెప్పుడూ అనంతగిరి గురించి ఏమీ చెప్పలేదండీ. ఈవిడ పని కట్టుకొని నా మీద దుష్ప్రచారం చేయడంలో ఉద్దేశ్యం ఏమిటో ఆమెకే తెలియాలి.

   Delete
  5. కొన్ని విషయాల్లో ఏం చేయలేం. బ్లాక్ చేయటం తప్ప!
   మనం ఇచ్చిన గౌరవాన్ని నిలుపుకోలేనప్పుడు ఇదొక్కటే మార్గం.
   @Gottimukkala

   Delete